BigTV English

Ileana D’Cruz: ఇలియానా పనైపోయింది.. ఇక పూర్తిగా సినిమాలకు దూరం, ఇదిగో ప్రూఫ్!

Ileana D’Cruz: ఇలియానా పనైపోయింది.. ఇక పూర్తిగా సినిమాలకు దూరం, ఇదిగో ప్రూఫ్!

Ileana D’Cruz: సాధారణంగా ఎవరికైనా 60 ఏళ్ళు దాటక కంపెనీ రిటైర్మెంట్ ప్రకటిస్తుంది. కానీ, ఎలాంటి రిటైర్మెంట్ లేని ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే అది ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే. ఇక్కడ తుదిశ్వాస విడిచేవరకు నటించొచ్చు. కొంతమంది నటీనటులు అలానే చివరి శ్వాస వరకు నటిస్తారు. ఇంకొంతమంది మధ్యలోనే ఫేడ్ అయిపోతారు. ముఖ్యంగా హీరోయిన్స్. హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి పెళ్లి చేసుకొనేవరకు చాలా యాక్టివ్ గా ఉంటారు. పెళ్లి తరువాత కొందరు నటిస్తారు.. కొందరు ఆపేస్తారు. ఇక ఇంకొంతమంది అసలు పెళ్లి తరువాత నటించాలనే కోరికనే వదిలేస్తారు.


 

ఇక ఈ మూడు ఆప్షన్స్ లో అందాల భామ ఇలియానా ఏ ఆప్షన్ ను ఎంచుకుంది అనే విషయం ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఈ భామ ప్రస్తుతం వెండితెరపై కనిపించడం మానేసింది కాబట్టి. అసలు ఇలియానాకు ఏమైంది..? ఇండస్ట్రీకి ఎందుకు దూరమైంది.. ? అవకాశాలు రాకానా..? లేక బరువు పెరిగినందుకా? లేక పెళ్లి చేసుకున్నందుకా.. ? ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యినందుకా.. ? ఇవేమి కాకుండా భర్త సినిమాలు వద్దు అన్నాడా.. ? అనేది తెలియాల్సి ఉంది.


 

ఇలియానా డిక్రూజ్.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. దేవదాసు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది ఇలియానా. అసలు జీరో నడుము అంటే ఇలా ఉంటుందా అని కుర్రాళ్లకు  చూపించిన హీరోయిన్ ఇలియానా. ఆమె నడుము అందాలను చూడడానికే సినిమాకు క్యూ కట్టేవారు అంటే  ఆశ్చర్యపోనవసరం లేదు. మొదటి సినిమాతోనే  భారీ విజయాన్ని అందుకున్న ఇలియానా.. ఆతరువాత వెనుతిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. కుర్ర హీరోలు, సీనియర్ హీరోలు అనే తేడా లేకుండా అందరితోనూ కలిసి నటించింది.

 

ఇక సమంత, తమన్నా, కాజల్, అనుష్క లాంటి స్టార్ హీరోయిన్లతో పోటీపడి మరీ నెగ్గింది ఇలియానా. విజయాపజయాలను పక్కన పెట్టి.. వచ్చిన సినిమాలన్ని చేసుకుంటూ వచ్చింది. ఇక అంతా బాగుంది అనుకున్న సమయంలో ఒక కుదుపు. ప్రేమ. ఈ రెండక్షరాల మాయలో పడిన ఇలియానా మోసపోయింది. ఆ  మోసం ఆమె జీర్ణించుకోలేకపోయింది. మద్యానికి, డ్రగ్స్ కి బానిస అయ్యింది. ఆ ఫలితమే ఆమె బరువు పెరగడం.  డిప్రెషన్ తో కూడా పోరాడిన ఇలియానా.. బరువు పెరిగి అందరికి షాక్ ఇచ్చింది. అయినా కూడా అధైర్య పడకుండా అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో కనిపించింది. ఆ సినిమాలో ఆమెను ట్రోల్ చేసినంతగా ఇంకెవరిని చేయలేదు అని చెప్పొచ్చు.

 

ఇక ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోవడంతో. ట్రోల్స్ తట్టుకోలేక బరువు తగ్గి బాలీవుడ్ లో పాగా వేసింది. అక్కడ అడపాదడపా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఆ సమయంలో మరో పెద్ద షాక్ ఇచ్చింది. పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నట్లు ప్రకటించి ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. ఆ తరువాత బిడ్డకు జన్మనిచ్చి.. సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమయ్యింది. ఇక ఆ బిడ్డకు ఏడాది వయస్సు వచ్చేసరికి తండ్రిని పరిచయం చేసింది.

 

పెళ్లి ఎప్పుడు అయ్యింది.. ? అనే విషయం ఎవరికీ తెలియదు. సరే ఇతనే నా భర్త అని అందరికీ పరిచయం చేయడంతో నెటిజన్స్ కూడా కొద్దిగా సెట్ అయ్యారు. పెళ్లి తరువాత ఇలియానా నటిస్తుంది అనుకున్నారు. కానీ, వచ్చిన అవకాశాలను కూడా ఆమె వదులుకుంది.ఈలోపే ఈ చిన్నది రెండోసారి తల్లి అయ్యింది. ఇక దీంతో  అభిమానులకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇలియానా పని అయిపోయింది. అమ్మడు ఫుల్ గా సినిమాలకు దూరం అవుతుందన తెలుస్తోంది అంటూ చెప్పుకొస్తున్నారు.

 

ఇద్దరు పిల్లలను పెంచడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఇక అందుకే ఇలియానా ఆ టాస్క్ ను తీసుకుందని తెలుస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో కూడా అమ్మడు యాక్టివ్ గా ఉండడం లేదు. కొన్నిరోజులు పోతే పూర్తిగా కనిపించకుండానే పోతుందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. పెళ్లి అయినా.. పిల్లలు ఉన్నా.. కాజల్, దీపికా, ప్రియాంక లాంటి వారు తమ ఉనికిని కాపాడుకుంటున్నారు. వారి బాటలోనే ఇలియానా కొనసాగితే బావుంటుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా ఇలియానా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక భర్త బలవంతం ఏమైనా ఉందా.. ? లేక ఆమెనే సొంత నిర్ణయం తీసుకుందా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Related News

Cm Revanth Reddy: నేషనల్ అవార్డు విన్నర్లకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు 

Skn: ఇలా అయితే సినిమాలు నిర్మించలేం, తేల్చి చెప్పేసిన నిర్మాత

Director Ram Jagadeesh: సైలెంట్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన కోర్టు డైరెక్టర్.. ఫోటోలు వైరల్!

Tamannaah Bhatia: కావాలయ్యా అంటున్న తమన్నా, మేము వస్తాము అంటున్న నెటిజన్స్

Parag Tyagi: చనిపోయిన భార్యకు గుర్తుగా గుండెపై అలాంటి పని చేసిన నటుడు… నిజమైన ప్రేమ అంటూ!

Rashmika: “థమా” ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే హైప్ పెంచిన రష్మిక… భయపెట్టేస్తోందిగా?

Big Stories

×