BigTV English

Comedian Ali: సెట్ లో అందరిముందు ఆ నిర్మాత నన్ను కొట్టాడు..

Comedian Ali: సెట్ లో అందరిముందు ఆ నిర్మాత నన్ను కొట్టాడు..

Comedian Ali: కమెడియన్ ఆలీ గురించి తెలుగు ప్రేక్షకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటుడిగా కెరీర్ ను ప్రారంభించి హీరోగా కొన్ని సినిమాలు చేసి, స్టార్ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. బ్రహ్మానందం తర్వాత అంతటి స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న ఆలీ.. ఈమధ్య సినిమాలను తగ్గించేశాడు. ఇండస్ట్రీల ఆయన పనిచేయని డైరెక్టర్లు లేరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నటుడిగా, యాంకర్ గా, ఒక మంచి కుటుంబ పెద్దగా ఆలీ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.అయితే రాజకీయ నాయకుడిగానే ఆలీ అభిమానులను నిరాశపర్చాడు.


 

ఇవన్నీ పక్కన పెడితే..  ఆలీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని బయటపెట్టాడు.తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు.బాలనటుడుగా చేసే సమయంలో తనకు ఎదురైన ఒక చేదు సంఘటన గురించి అభిమనులతో చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో ఆయనకు అండగా నిలబడిన రాఘవేంద్రరావు గొప్ప మనసు గురించి చెప్పుకొచ్చాడు. ” నిప్పులాంటి నిజం అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. మురళి మోహన్, రాజ్యలక్ష్మీ జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు కె. ముఖర్జీ నిర్మాత. అప్పుడు నా వయస్సు చాలా తక్కువ. బాలనటుడిగా మంచి మంచి సినిమాలు చేస్తున్న సమయం. ఆ సినిమాలో కూడా నాది మంచి పాత్ర.


 

ఇప్పుడైనా.. అప్పుడైనా ఆ సీన్ లో ఒక్కరు లేకపోయినా మొత్తం షూటింగ్ ను క్యాన్సిల్ చేయాల్సిందే. 1980లో ఆంధ్రప్రదేశ్ లో తుఫానులు బాగా వచ్చేవి. ఆ సమయంలోనే నా చిన్న చెల్లెలు అనారోగ్యంతో మరణించింది. అప్పుడు సమాచారం అందివ్వడానికి ఫోన్స్ లేవు. ఇక ఆరోజు షూటింగ్ కు వెళ్ళకుండా ఇంటిదగ్గరే ఉన్నాను. తెల్లారి షూటింగ్ కు వెళ్తే.. నిర్మాత నన్ను సెట్ లో అందరిముందు షూటింగ్ కు ఎందుకు రాలేదని కొట్టాడు. నేను ఏమి అనకుండా ఒక మూలన వచ్చి కూర్చొని ఏడుస్తున్నాను. ఇక ఆ సమయంలోనే రాఘవేంద్రరావు గారు వచ్చారు. నేను ఏడవడం చూసి నా దగ్గరకు వచ్చి ఏమైంది.. ? అని అడిగితే జరిగింది చెప్పాను.

 

వెంటనే ఆయన.. నిర్మాతను పిలిచి ఈ కుర్రాడిని ఎందుకు కొట్టారు అని అడిగారు. సదురు నిర్మాత.. షూటింగ్ కు రాలేదు కదా అన్నాడు. షూటింగ్ కు రాకపోతే కొడతావా.. ? వాడు చిన్న పిల్లాడు. కారణం ఎంతో తెలుసుకోకుండా కొడతావా..? అతని చెల్లెలు చనిపోయింది. అందుకే రాలేదు.. ఏది నిజం తెలుసుకోకుండా చేయొద్దు అని చెప్పారు. ఆ తరువాత వెంటనే షూటింగ్ క్యాన్సిల్ చేసి వెళ్లిపోయారు. నేనంటే రాఘవేంద్రరావుకు బాగా ఇస్టం. నన్ను చూస్తే ఆయనకు శ్రీదేవి గుర్తొస్తుందని, ఇద్దరు కూడా బాలనటులుగా చేసి ఒక స్థాయికి వచ్చామని చెప్తుంటారు ” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం ఆలీ కెరీర్ గురించి చెప్పాలంటే.. పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారాడు. ఇంకోపక్క ఒక టీవీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.

Related News

Rahul Sipligunj: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్.. అమ్మాయి ఎవరంటే..?

Mokshagna: నందమూరి మోక్షజ్ఞ కొత్త లుక్.. ఇలా మారిపోయాడేంటి ?

Rao Bahadur Teaser: ఆకట్టుకుంటున్నరావు బహదూర్ టీజర్.. సత్యదేవ్ గెటప్ చూశారా?

Peddi Movie : ‘పెద్ది ‘ సాలిడ్ అప్డేట్.. గ్లోబల్ స్టార్ క్రేజీ లుక్..ఫ్యాన్స్ కు పండగే..

War 2 Collections: దారుణంగా పడిపోయిన వార్ 2 కలెక్షన్లు… భారీ నష్టాలు తప్పేలా లేదు

Pooja Hegde : పాన్ ఇండియా హీరోనే లైన్లో పెట్టేసింది.. అస్సలు ఊహించి ఉండరు సుమీ..!

Big Stories

×