Durga Movie : తెలుగు ఇండస్ట్రీలోని ఒకప్పుడు సినిమాలలోని విలన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీర ఆకృతి తో పాటుగా తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.. ఆ రోజుల్లో గ్రాఫిక్స్ కూడా లేకపోవడంతో తమ నటనతోనే జనాలని భయపెట్టారు. హీరోలతో పోలిస్తే విలన్లు లేదా మాంత్రికులుగా నటించిన వాళ్లు జనాలను ఎంతగా ఆకట్టుకున్నారో చెప్పనక్కర్లేదు.. విలన్ పాత్రల్లో కన్నా మాంత్రికుడు పాత్రలో నటించిన వాళ్లు జనాలకు బాగా గుర్తుండి పోతున్నారు. అప్పటిలో ఒక రామిరెడ్డి, అమరీష్ పూరి లాంటి వాళ్లు ఎందరో ఉన్నారు. ఇక విషయానికొస్తే.. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న మాంత్రికుడు గుర్తున్నాడా..? ఈయన ఎవరు? ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
గతంలో ఎక్కువగా దేవుళ్ళ మీద వచ్చే సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్ ను కూడా అందుకున్నాయి. అలాంటి వాటిలో దుర్గా సినిమా కూడా ఒకటి. తొట్టెంపూడి వేణు, హీరోయిన్ రోజా కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా జనాలకు బాగా గుర్తుండిపోయింది. ఇందులో విలన్ పాత్రలో హీరో తండ్రి నటించాడు.. భార్యాబిడ్డను వదిలేసి తాంత్రిక విద్యల కోసం వెళ్లిన ఆయన ఆ తర్వాత తన కొడుకుకి ఒక బిడ్డ పుట్టిన తర్వాత తిరిగి వస్తాడు. తన మంత్ర శక్తులతో అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తాడు.. ఆ పరిస్థితుల నుంచి హీరో తన ఫ్యామిలీ ని ఎలా కాపాడుకున్నాడు? దుర్గమ్మ కరుణ కటాక్షాల వల్లే హీరో తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు అన్నది స్టోరీ. ఇందులో మాంత్రికుడు పాత్రలో నటించిన వ్యక్తి మలయాళ నటుడు.. ఈయన అసలు పేరు సురేష్ కృష్ణ.. మలయాళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న నటుడు. ఒకవైపు సినిమాలు మరోవైపు బుల్లితెర షోలు చేస్తూ బిజీగా ఉంటున్నాడు.. ఇక ఈయన గురించి కాస్త వివరాలిలా…
Also Read :ఇన్నాళ్లకు గుడ్ న్యూస్ చెప్పిన శృతి.. ఫ్యాన్స్ కు బిగ్ షాక్..
నటన పై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు మలయాళ నటుడు సురేష్ కృష్ణ.. ఈయన . 1993లో వచ్చిన ‘ఛమయం’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకొని ‘యువతుర్కి’ మూవీతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ‘పొట్టు అమ్మన్’ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ మూవీనే తెలుగులో దుర్గ.. ఈ చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.. భయంకరమైన ఆకృతి, జనాలకు గుండెల్లో వణుకు పుట్టించే తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను మాంత్రికుడుగా బాగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఈయన తెలుగులో సినిమాలు చేయలేదు కానీ మలయాళ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా మారాడు. ప్రస్తుతం ఈయన తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ వస్తున్నాడు.. కేవలం మలయాళ సినిమాలు మాత్రమే కాదు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో కూడా ఈయన సందడి చేస్తూ వస్తున్నాడు. ఇటీవల తెలుగులో ఓ సినిమాలో కూడా ఈయన నటించిన తెలుస్తుంది.