E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode April 25th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: యాదమ్మను పంపిచేయమన్న అమర్    

Nindu Noorella Saavasam Serial Today Episode April 25th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: యాదమ్మను పంపిచేయమన్న అమర్    
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి, చంభా కారులో వస్తుంటారు. చంభా కోపంగా నీ టైం బాగుంది.. భాగీ టైం బాగాలేదు కానీ నీకు అన్ని కలిసొస్తున్నాయి మనోహరి. నీ గురించి రణవీర్‌ నోరు విప్పడం లేదు. నీ గురించి అన్ని తెలిసిన భాగీ సాక్ష్యాలు లేవని సైలెంట్‌గా ఉంది. అరుంధతి మీద ప్రేమతో అమరేంద్ర నిన్ను ఇంట్లో ఉండనిస్తున్నాడు. త్వరగా ఏదో ఒకటి చేసి నీ కూతురును కనిపెట్టి రణవీర్‌కు అప్పగించి కలకత్తా పంపించేసేయ్‌ అంతటితో నీ పీడ విరగడి అయిపోతుంది. ఆ తర్వాత అమరేంద్రను పెళ్లి చేసుకుని భాగీని బుజ్జమ్మను ఇంట్లోంచి గెంటేయ్‌ ఆ పిల్లలను కూడా అమరేంద్రకు దూరంగా పెట్టు. అమరేంద్రను కూడా కొంగున కట్టేసుకో.. రాథోడ్‌ ను కూడా పనిలోంచి తీసేసెయ్‌ అని చెప్తుంటే..

మనోహరి ఏంటి చంభా ఈరోజు చాలా ప్రస్టేషన్‌లో ఉన్నావు అని అడుగుతుంది. దీంతో చంభా లేకపోతే ఆ భాగీ నన్ను ఎన్ని మాటలు అంది. ఆకాష్‌ కిడ్నాప్‌ అయిన రోజు రాథోడ్‌ కూడా నన్ను నానా మాటలు అన్నాడు. నీకు అన్ని చెప్పలేను. నా మీద పంచులు మీద పంచులు వేశారు. వాళ్లెవ్వరూ నీ ఇంట్లో ఉండకూడదు మనోహరి అనగానే.. మనోహరి ఆశ్చర్యంగా నా ఇల్లా..? అని అడుగుతుంది. దీంతో చంభా అవును అమరేంద్రను పెళ్లి చేసుకుంటే అది నీ ఇల్లే అవుతుంది కదా అనగానే.. మనోహరి నాకు బాగానే బూస్టింగ్‌ ఇస్తున్నావు.. నీ శాలరీ డబుల్ చేస్తాను చంభా అనగానే.. చంభా కోపంగా బోడి శాలరీ ఎవరికి కావాలి..? నువ్వు అమరేంద్రను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఆస్థిలో వాటా ఇవ్వు చాలు అని చెప్పగానే.. మనోహరి ఓ ఆస్థిలో వాటా కోసం ఇంట్లో ఉన్నావా..? అంటుంది. దీంతో చంభా కోపంగా మనసులో లేకపోతే నీ కోసం ఉన్నాను అనుకుంటున్నావా ఏంటి…? అనుకుంటుంది. మనోహరి మాత్రం అలాగే చంభా నువ్వు చెప్పింది జరగాలే కానీ నువ్వు కోరింది ఇస్తాను అనగానే.. చంభా హ్యాపీగా ఫీలవుతుంది.

Advertisement

ఇంతలో ఇంటికి వస్తారు. కారు దిగి ఇంట్లోకి వెళ్లబోతుంటే.. గుమ్మం దగ్గర రెండు బ్యాగులు కనిపిస్తాయి. అవి చూసిన చంభా నా బ్యాగులు బయట ఉన్నావేంటి..? అని అడుగుతుంది. దీంతో మనోహరి ఇంత పెద్ద ఇల్లు ఉండగా నీ బ్యాగులు బయటపెట్టుకున్నావేంటి..? అంటుంది. దీంతో ఏంటి క్యామెడీనా..? ఎవరో నా బ్యాగులు బయట పడేశారు అంటుంది చంభా. ఇంతలో రాథోడ్‌ నేనే అది నేనే అనుకుంటూ వస్తాడు. దగ్గరకు వెళ్లిన  చంభా నువ్వు ఎందుకు పడేశావు అని అడగ్గానే.. రాథోడ్‌ వెటకారంగా యాదమ్మ ఇక్కడ నీ పని అయిపోయింది అమ్మా ఇక నువ్వు దయచేయి అమ్మ అంటాడు. దీంతో మనోహరి కోపంగా ఏం మాట్లాడుతున్నావు రాథోడ్‌. యాదమ్మ ఎందుకు వెళ్లిపోవాలి..? అనగానే.. రాథోడ్‌ ఇక్కడ ఎవ్వరూ పర్మినెంట్‌ మనోహరి గారు మధ్యలో వచ్చిన వాళ్లు మధ్యలోనే వెళ్లిపోవాలి అని చెప్పగానే.. మనోహరి కోపంగా పర్మినెంట్‌ అంటే ఏంటి అర్థం అని అడుగుతుంది. దీంతో రాథోడ్‌ ఇప్పుడు ఈ ఇల్లు అమరేంద్ర సార్‌ ది కాబట్టి సార్‌ పర్మినెంట్‌. మిస్సమ్మ సార్ మిస్సెస్సు కాబట్టి మిస్సమ్మ పర్మినెంట్‌. పిల్లలు సారు పిల్లుల కాబట్టి పిల్లలు కూడా పర్మినెంట్‌.. యాదమ్మ నేను అంతెందుకు మీరు కూడా టెంపరరీగా వచ్చిన వాళ్లే కాబట్టి టైం వచ్చినప్పుడు వెళ్లిపోవాల్సిందే.. ఈరోజు యాదమ్మ. రేపు నేనో మీరో లగేజ్‌ సర్దుకోవాల్సిందే.. అనగానే..

మనోహరి కోపంగా నోటికి వచ్చినట్టు పిచ్చిపిచ్చిగా వాగకు రాథోడ్‌. నువ్వు ఏ ఉద్దేశంతో అంటున్నావో నాకు తెలుసు. లోపలికి పద యాదమ్మ నువ్వు నా మనిషివి నిన్ను ఎవరు అడ్డుకుంటారో నేను చూసుకుంటాను రా అంటూ చేయి పట్టుకుని యాదమ్మను లోపలికి తీసుకెళ్లబోతుంటే.. అప్పుడే లోపలి నుంచి మిస్సమ్మ వచ్చి గుమ్మానికి అడ్డుగా నిలబడుతుంది. మిస్సమ్మను చూసి మనోహరి, యాదమ్మ షాక్‌ అవుతారు. మనోహరి మాత్రం భాగీ అడ్డు తప్పుకో యాదమ్మను నన్ను లోపలికి వెళ్లనివ్వు అంటుంది. దీంతో మిస్సమ్మ సారీ మనోహరి యాదమ్మకు ఇంట్లోకి ఎంట్రీ లేదు అనగానే.. మనోహరి కోపంగా అది చెప్పడానికి నువ్వెవరు..? అని అడగ్గానే.. మిస్సమ్మ నేను ఈ ఇంటి యజమానిని, అమరేంద్ర గారి భార్యను అని చెప్పగానే.. మనోహరి అది ఒకప్పుడు ఇప్పుడు కాదు అంటుంది. మిస్సమ్మ మాత్రం అప్పుడు, ఇప్పుడు ఎప్పుడు నేనే ఆయన భార్యని దిస్‌ ఈజ్‌ మై ఐడెంటిటీ, దిస్‌ ఈజ్‌ మై లైసెన్స్‌ అని తాళి, బొట్టు చూపించగానే..

Advertisement

రాథోడ్‌ వెటకారంగా ఈ సాక్ష్యాలు చాలా ఇంకా ఏమైనా కావాలా మనోహరి గారు అనగానే.. మనోహరి కోపంగా నీకు ఈ ఇంటికి అమర్‌కు ఏ సంబంధం లేదు భాగీ నేన రానిస్తే నువ్వు ఈ ఇంటికి వచ్చావు. నేను ఉండనిస్తేనే ఇంట్లో ఉంటున్నావు.. నీకు నేను వేసిని బిక్ష ఇది అంటూ మనోహరి అటుండగానే.. మిస్సమ్మ కోపంగా మనోహరి ఎన్నిసార్లు చెప్పాలి నీకు నువ్వు ఉండనిస్తే నేను రాలేదు.. నేను రావాలి అనుకున్నాను కాబట్టి వచ్చాను. నువ్వు ఉండనిస్తే నేను ఇక్కడ ఉండలేదు.. నేను ఉండాలి అనుకున్నాను కాబట్టే నేను వచ్చాను అంటూ చెప్తుండగానేద.. అమర్‌ వస్తాడు. యాదమ్మను పంపించమని నేనే చెప్పాను రాథోడ్‌ రెండు నెలల శాలరీ ఇచ్చి పంపిచేయ్‌ అని చెప్తాడు. దీంతో యాదమ్మ, మనోహరి షాక్‌ అవుతారు. నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×