E-Paper
Advertisement

Varanasi : తెలుగు ప్రేక్షకులు ఈ రైటర్ ను గుర్తించాల్సిందే, రాజమౌళి సక్సెస్ లో కీ రోల్

Varanasi : తెలుగు ప్రేక్షకులు ఈ రైటర్ ను గుర్తించాల్సిందే, రాజమౌళి సక్సెస్ లో కీ రోల్
Advertisement

Varanasi : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో కొరియర్ మొదలు పెట్టాను రాజమౌళి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగారు. ఇప్పటివరకు రాజమౌళి కెరియర్ లో ఒక డిజాస్టర్ సినిమా కూడా లేదు. ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడు. ఏ సీన్ పెడితే వర్కౌట్ అవుతుంది అని అద్భుతంగా ఊహించగలడు.

తనకు అనిపించిన అద్భుతమైన ఆలోచనలను కూడా కమర్షియల్ ఫార్మాట్ లో చెప్పగలడు. అలానే రాజమౌళి కామెడీ సినిమా చేసినా కూడా అదే రేంజ్ లో వర్కౌట్ అవుతుంది. విక్రమార్కుడు, మర్యాద రామన్న వంటి సినిమాల్లో కామెడీ నెక్స్ట్ లెవెల్ లో వర్కౌట్ అయింది. రాజమౌళి సినిమా కోసం ఎంతలా కష్టపడతాడు అని పలు సందర్భాల్లో చాలామంది చెబుతూ వచ్చారు. అంతేకాకుండా రాజమౌళి తీసిన సినిమాలు కూడా దానిని ప్రూవ్ చేశాయి.

ఆ రైటర్ ను గుర్తించాలి 

Advertisement

రాజమౌళి సినిమాలకు సంబంధించి తన కుటుంబమే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. తన అన్నయ్య ఎంఎం కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని ఇస్తారు. ఒక సీన్ తన మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ లో ఎలివేట్ చేస్తారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అద్భుతమైన కథలను ఇస్తారు. సై, మర్యాద రామన్న, ఈగ సినిమాలు మినహాయిస్తే మిగతా అన్ని కథలు కూడా విజయేంద్ర ప్రసాద్ రాశారు.

అయితే రాజమౌళి దగ్గర మరో అద్భుతమైన రైటరు ఉన్నారు. అతను బయట వారు కూడా కాదు. అతని ఫ్యామిలీ మెంబర్ కాంచి. చాలా సినిమాలకు కాంచి రచన సహకారాన్ని అందించారు. ముఖ్యంగా మర్యాద రామన్న ఈగ వంటి సినిమాలకు బాగా ఇన్వాల్వ్ అయ్యారు.

వారణాసితో గుర్తింపు 

Advertisement

మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి వారణాసి అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2027 సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఆ టైంలో విడుదల చేస్తాము అని ఎమ్ ఎమ్ కీరవాని చెప్పారు కానీ ఆ డేట్ కి సినిమా వస్తుందా లేదా అనేది డౌట్. ఎందుకంటే జక్కన్న అంత ఈజీగా ఏది ఓకే చేయరు.

పర్ఫెక్ట్ గా సినిమా వచ్చేసరికి ఇంకో 6 నెలలు ఎక్కువ టైం అయినా పట్టొచ్చు. ఇకపోతే ఈ సినిమాలో కథాంశం ఎలా ఉండబోతుంది అని వరల్డ్ పరిచయం అయ్యేలా ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో భారీ హైప్ క్రియేట్ చేసింది.

వీడియో ఎండింగ్ లో సినిమా టెక్నీషియన్స్ కి క్రెడిట్ ఇచ్చారు. ఆ క్రెడిట్ లో విజయేందర్ ప్రసాద్ పేరు తర్వాత కాంచి పేరు పడుతుంది. మొత్తానికి ఈ సినిమాతో మంచి గుర్తింపు వస్తుంది అనిపిస్తుంది. కేవలం రచయిత గానే కాకుండా నటుడుగా మంచి పేరు కాంచికి ఉంది. మర్యాద రామన్న సినిమాలోని ట్రైన్ సీను ఈయనకు మంచి పేరు తీసుకొచ్చింది.

Also Read: SPIRIT : త్రీ గెటప్స్ లో కనిపించనున్న ప్రభాస్, సందీప్ ఏం ప్లాన్ చేస్తున్నాడు?

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×