E-Paper
Advertisement

SPIRIT : త్రీ గెటప్స్ లో కనిపించనున్న ప్రభాస్, సందీప్ ఏం ప్లాన్ చేస్తున్నాడు?

SPIRIT : త్రీ గెటప్స్ లో కనిపించనున్న ప్రభాస్, సందీప్ ఏం ప్లాన్ చేస్తున్నాడు?
Advertisement

SPIRIT : సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే సంచలమైన దర్శకుడుగా పేరు సాధించాడు సందీప్ రెడ్డి వంగ. తెలుగులో కేడి అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆ సినిమా తర్వాత మరో దర్శకుడు దగ్గర సందీప్ పనిచేయలేదు. తర్వాత దర్శకుడు అయిపోదామని ఫిక్స్ అయ్యాడు. ఆ తరుణంలో అర్జున్ రెడ్డి స్క్రిప్ట్ పట్టుకొని చాలామంది నిర్మాతలను కలిశాడు. ఒక తరుణంలో స్వప్నా దత్ ప్రొడ్యూసర్ గా శర్వానంద్ హీరోగా ఈ సినిమా చేసేద్దాం అని అనుకున్నారు. కానీ కుదరలేదు.

ఇంక ఎవరూ ముందుకు రాకపోవడంతో సందీప్ రెడ్డి బ్రదర్ ప్రణయ్ రెడ్డి నిర్మాతగా అర్జున్ రెడ్డి సినిమాను నిర్మించారు. సినిమా విడుదలైన తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అసలైన దర్శకుడు దొరికాడు అనిపించుకున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తెలుగు దర్శకుడు సత్తా ఏంటో అక్కడ రుజువు చేశాడు. తన కబీర్ సింగ్ సినిమాను వైలెంట్ ఫిలిం అన్నారని, అనిమల్ సినిమా తీసి అసలైన వైలెంట్ ఫిలిం అంటే ఏంటో చెప్పాడు.

స్పిరిట్ లో మూడు గెటప్స్ 

Advertisement

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఒక స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో మరింత హైప్ క్రియేట్ చేసింది.

ప్రభాస్ ఈ సినిమాలో మొత్తం మూడు గెటప్స్ లో కనిపించబోతున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ రెండు గెటప్స్ రెడీ అయిపోయాయి. వాటిని ఫైనల్ కూడా చేసేసారు. ఇంకొక గెటప్ ఫైనల్ చేయాల్సి ఉంది. ప్రభాస్ ను సందీప్ ఎలా చూపిస్తాడు అనే క్యూరియాసిటీ చాలామందికి ఇప్పటికే మొదలైంది.

అనిమల్ తరహాలో 

Advertisement

అనిమల్ సినిమాలో రణబీర్ కపూర్ నటించిన విధానం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. దీని గురించి సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ కూడా నాకంటే చిన్నవాడు అయిపోయాడు కానీ లేకపోతే నేను ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టేవాడిని అంత బాగా యాక్టింగ్ చేశాడు అని చెప్పారు.

అయితే అనిమల్ సినిమాలో రన్బీర్ కపూర్ కొన్ని గెటప్స్ లో కనిపిస్తాడు. ఏజ్ బట్టి ఆ గెటప్ డిజైన్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు అదే తరహాలో ప్రభాస్ కు కూడా గెటప్స్ డిజైన్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఈ నెల ఆఖరి నుంచి మొదలవుతుంది అని సందీప్ చెప్పాడు. దీని విషయంలో ఇంకా గ్యారెంటీ లేదు. ఎందుకంటే సందీప్ ఇలా చెప్పడం మొదటి సారి కాదు.

Also Read: Pradeep Ranganathan: తెలుగులో భారీ రెమ్యూనరేషన్, ఇండస్ట్రీని పాడు చేస్తున్నారా?

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×