E-Paper
Advertisement

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?
Advertisement

Irumudi Box Office:ఇరుముడి…శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రాంపేజ్ ఆడేస్తుంది.వంద కోట్లు కొడితే అదే మహాప్రసాదం అనుకునే ఈ రోజుల్లో ఇరుముడి సినిమా 12 రోజుల్లో ఏకంగా రెండొందల కోట్లని టచ్ చేసిందంటూ మేకర్స్ సగర్వంగా పోస్టర్ వదిలారు.దీంతో ఇపుడు సినిమా మూడొందల కోట్లని టచ్ చేస్తుందా లేదా అన్నప్రశ్న పైనే అందరి దృష్టి పడింది.

బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామి

నిజానికి సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంత పెద్ద ఫిగర్ ని క్రాస్ చేస్తుందన్న ఆలోచన ఎవరికైనా ఉందంటే అనుమానమే.కానీ శివ నిర్వాణ ఎంచుకున్న స్టోరీ,మరియు టేకింగ్, రవితేజ, నక్షత్రల నటన వాటికి తోడు కలిసి వచ్చిన అయ్యప్పస్వామి నేపథ్యం ..పూనకాలు తెప్పించిన మల్లెపూల పల్లకి పాట…వెరసి సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామి స్ప్రుష్టించింది.

Advertisement

ఇక వారం తిరిగే సరికే టాక్సిక్ రావడం, అంచనాలు భారీగా ఉండటంతో ఇరుముడికి మైనస్ అవుతుందేమో అనుకున్నారంతా ..కాని అది కాస్తా బోల్తాపడటం తో ఇరుముడి మరింత దూసుకెళ్లింది.ఊరూ,వాడా,పిల్లా జెల్లా, ముసలి ముతకా ఇలా అందరూ ఇరుముడికి క్యూ కట్టడంతో ముచ్చటగా రెండొందల కోట్లు వచ్చి పడ్డాయి.

వందకోట్ల తేడా

ముఖ్యంగా 12 రోజుల్లో నైజాం లోరూ.81 కోట్ల గ్రాస్, రూ.44 కోట్ల షేర్ సాధించగా, ఒక్క 12వ రోజే దాదాపు రెండు కోట్ల పై చిలుకు వసూల్లని, రూ.1 కోట్ల పై చిలుకు నెట్ ని కొల్లగొడుతున్న జోరు చూసి వచ్చే రోజుల్లో 300 కోట్లు ఏమైనా టచ్ చేస్తుందా అంటూ ఆరాలు తీసే పనిలో పడ్డారు ట్రేడ్ పండితులు.

Advertisement

అయితే మొదటి రోజున భారీ హైప్ , సాలిడ్ ఫ్యాన్ బేస్,వీకెండ్స్ వంటి అంశాలతో భారీ వసూల్లని సొంతం చేసుకున్న సినిమాలు లాంగ్ రన్ లో అంత అదే స్థాయిలో నిలకడ చూపించాలంటే చాలా కష్టం.పైగా ఇప్పుడొచ్చిన 200 కోట్లకి వస్తే బాగుండు అనుకుంటున్న 300 కోట్లకి మధ్య వందకోట్ల తేడా ఉంది.

మరికొన్ని రోజులు ఆగితే కాని

దీన్ని ఫిల్ చేయాలంటే అంత ఆషామాషీ కాదు.కానీ ఇపుడు వస్తున్న సినిమాలు సో సో టాక్ తెచ్చుకుని, ఈ సినిమా మాత్రం కలెక్షన్స్ డ్రాప్ చేయకుండా హోల్డ్ చేయగలిగితే వచ్చే రోజుల్లో ఆ ఫిగర్ ని టచ్ చేయడం కూడా పెద్ద కష్టమేమీ కాదు.కానీ కాసింత డ్రాప్ కనిపిస్తే మాత్రం సినిమాని ott కి ఇవ్వలేరా అంటే చెప్పడం కష్టం.

చూడాలి మరి అనుకుంటున్నట్టుగా సినిమా 250 కోట్లని ఈజీగానే టచ్ చేస్తుందా లేదా ఆశ పడుతున్నట్టుగా మూడొందల కోట్ల వైపుకి దూసుకు వెళ్తుందా అనేది మరికొన్ని రోజులు ఆగితే కాని తెలిసేలా లేదు !

 

Tags

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×