E-Paper
Advertisement

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?
Advertisement

Fake Currency: నకిలీ నోట్లను చలామణి చేస్తున్న గ్యాంగును శంషాబాద్​ జోన్ టాస్క్​ ఫోర్స్​ అధికారులు బాలాపూర్​ పోలీసులతో కలిసి అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి 2.91లక్షల నకిలీ కరెన్సీ, ప్రింటింగ్​ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్​ ఫోర్స్​ అదనపు డీసీపీ కే.ఎస్​.రావు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. చింతల్​ తండాకు చెందిన రామావత్​ రాము అలియాస్ మహ్మద్ (36) వృత్తిరీత్యా జొమాటో డెలివరీ బాయ్​. అదే తండాకు చెంది ర్యాపిడో డ్రైవర్​ గా పని చేస్తున్న రామావత్ మోతీలాల్​ (35), ఆటోడ్రైవర్ రామావత్​ గాంధీ (19), నాగోల్​ బండ్లగూడకు చెందిన సుధీర్​ జాన్​ చేలా అలియాస్​ వంశీతో అతనికి పరిచయం ఉంది.

యూట్యూబ్‌లో వీడియోలు..

జొమాటో డెలివరీ బాయ్ గా చేస్తున్న పనితో ఆశించిన ఆదాయం రాకపోతుండటంతో రామావత్ రాము తేలికగా డబ్బు సంపాదించేందుకు నకిలీ నోట్ల దందా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో బంధువైన రామావత్ మోతీలాల్‌ తో కలసి యూట్యూబ్, ఇన్‌ స్టాగ్రామ్‌ లలో నకిలీ నోట్ల తయారీ వీడియోలు చూశాడు. మోతీలాల్‌ యూ ట్యూబ్‌లో దొరికిన ఓ ఫోన్ నెంబర్​ ను సంప్రదించి అవసరమైన ప్రింటర్, స్కానర్, బాండ్ పేపర్ల వివరాలు తెలుసుకున్నాడు. ఆ తరువాత రామావత్ మోతీలాల్​, రామావత్ గాంధీతో కలిసి ప్రింటింగ్ పరికరాలు కొనుగోలు చేశారు.

Advertisement

Also read: అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

రాత్రి వేళల్లో..

అచ్చం అసలు నోట్లలా కనిపించేలా వాటర్‌ మార్క్‌ లతో నకిలీ నోట్లను తయారు చేశారు. రాత్రి వేళల్లో వైన్ షాపులు, కూరగాయల మార్కెట్లలో ఈ నోట్లను చలామణి చేయడం ప్రారంభించారు. ఈ మేరకు పక్కాగా సమాచారాన్ని సేకరించిన టాస్క్​ ఫోర్స్​ సీఐ డీ.కృష్ణమోహన్​, బాలాపూర్​ సీఐ సుధాకర్​, ఎస్​ఐ మన్సూర్ అలీతోపాటు సిబ్బందితో కలిసి నలుగురు నిందితులను అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి నాలుగు అసలైన 500 రూపాయల నోట్లు, నాలుగు వంద రూపాయల నోట్లతోపాటు 2.91లక్షల నకిలీ కరెన్సీ, ప్రింటర్​, స్కానర్ తదితర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం బాలాపూర్​ పోలీసులకు అప్పగించారు.

Advertisement

Also read: రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

Tags

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×