Irumudi Box Office:ఇరుముడి.. ఇరుముడి.. ఇరుముడి ..ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తుంది.ఒక సరైన సినిమా ఆడియన్స్ కి అందిస్తే ఎంత పెద్ద హిట్ చేస్తారో మరోసారి ప్రూవ్ చేసింది ఇరుముడి సినిమా.
వరుసగా ఆరు సినిమాలు డిజాస్టర్ చూసిన రవితేజకి ఎట్టకేలకు ఇరుముడి తో సాలిడ్ బ్లాక్ బాస్టర్ అందించాడు దర్శకుడు శివ నిర్వాణ.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయి పది రోజులైనా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది
ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తున్న వాలకం చూస్తుంటే మరి కొద్ది రోజుల్లోనే ఈజీగా 200కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయ్యేలానే ఉంది ఈ సినిమా.
ఇక ప్రస్తుతం ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్ల తీరును చూస్తే ఇండియాలో మొదటి రోజు 15 కోట్ల నెట్ కొల్లగొట్టిన ఈ సినిమా రెండో రోజు 16 కోట్లను వసూలు చేసి తన సత్తా చాటింది.
ఇక ఆదివారంకొచ్చేసరికి ఏకంగా 20 కోట్ల వసూళ్ళకి పరిగెత్తింది సినిమా.ఇక నాలుగో రోజు 12 కోట్లు ,ఐదో రోజు 13 కోట్లు, ఆరు రోజు 10 కోట్లు రాబట్టి సాలిడ్ గా థియేట్రికల్ రన్ ని కంటిన్యూ చేసింది .అయితే టాక్సిక్ సినిమా రిలీజ్ అయ్యాక కాసింత డ్రాప్ చూపించిన ఈ సినిమా ఏడో రోజుకి కేవలం 6 కోట్లకే పరిమితం అయిపోయిందన్న టాక్ వినిపిస్తుంది.
యష్ సినిమా గనుక ఏ మాత్రం సూపర్ డూపర్ హిట్ అయి ఉన్న ఈ సినిమా అంత ఈజీగా మళ్లీ ఈ రేంజ్ కలెక్షన్లని తీసుకునేదా అన్న అనుమానాలు కూడా రైజ్ అయ్యాయి. కానీ ఏ ముహూర్తాన టాక్సిక్ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుందో అది ఇరుముడి సినిమాకి చాలా ప్లస్ అయిపోయింది . మళ్లీ బాక్సాఫీస్ వద్ద జోరు చూపించిన ఈ సినిమా పదో రోజుకి ఇండియాలో 130 కోట్లని కలెక్ట్ చేయగా మొత్తంగా గ్రాస్ చూస్తే 150 కోట్లతో సాలిడ్ పొజిషన్లో ఉంది.మరోవైపు ఓవర్సీస్ లోనూ ఈ సినిమా ఏకంగ 20 కోట్ల వసూలని కొల్లగొట్టడం విశేషం.
దీంతో వరల్డ్ వైడ్ గా 170 కోట్ల గ్రాస్ ని అందుకుంది ఈ సినిమా .అలా మొత్తంగా చూస్తే 10 రోజుల్లోనే 150 కోట్ల వసూలని కొల్లగొట్టి రవితేజ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హీట్ అవ్వడమే కాకుండా పుష్ప 2 బాహుబలి 2 రికార్డులను కూడా మడతపెట్టడం విశేషం.
అది ఎలాగంటారా.రిలీజ్ అయినా రెండో శుక్రవారం వసూళ్లని చూస్తే ఇరుముడి సినిమా ఏకంగా 11 కోట్లని రాబట్టి అల్లు అర్జున్ పుష్ప2, అలాగే ప్రభాస్ బాహుబలి 2 రికార్డులని క్రాస్ చేసేసింది . ఇక ఈ లిస్టులో మొదటగా ఆర్ఆర్ఆర్ సినిమా 15 కోట్లతో మొదటి స్థానంలో ఉంటే ఇరుముడి సినిమా 11.5 కోట్లతో ఆల్ టైం రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది .
ఇక ఈ జోరు ఇలాగే కంటిన్యూ అయితే రవితేజ ఈ సినిమాతో ముందు ముందు మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం పక్కా.ఇక సినిమా కథ విషయానికి వస్తే బాగా తాగే తండ్రి తన కూతురి కోరికతో అయ్యప్ప దీక్ష తీసుకుంటాడు, అయితే దీక్ష మొదలుపెట్టే సమయంలో అతడి గతంలో జరిగిన కొన్ని విషయాలు మళ్లీ అతను ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక ఇక్కడి నుంచి కథలో ఫ్యామిలీ, ఎమోషన్, భక్తి ఇలా అన్నింటిని సమపాళ్లల్లో దట్టించి సినిమాని మంచి ఎమోషనల్ ల్యాండ్ చేశాడు డైరెక్టర్ శివ నిర్వాణ.
మొత్తానికి ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ ని ఇరుముడి సినిమాతో కొట్టేశాడు రవితేజ .చూడాలి ముందు ముందు ఈ సక్సెస్ స్ట్రీక్ ని రవితేజ ఎలా కంటిన్యూ చేస్తాడో !