E-Paper
Advertisement

ఇరుముడి ఊపు తగ్గలేదుగా…మరో రికార్డుపై కన్నేసిన రవితేజ !

ఇరుముడి ఊపు తగ్గలేదుగా…మరో రికార్డుపై కన్నేసిన రవితేజ !
Advertisement

Irumudi Box Office:ఇరుముడి ..ఇరుముడి ..ఇరుముడి ..ఇపుడు టాలీవుడ్ మొత్తం ఈ నామ స్మరణే వినిపిస్తుంది.మైత్రిమూవీ మేకర్స్ బ్యానర్ పై శివ నిర్వాణ దర్శకత్వంలో రవి తేజ హీరోగా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుండే సూపర్ హిట్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.ఇక ఇప్పటికే సినిమా రెండు వందల కోట్లని క్రాస్ చేసి రవితేజ కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ కొల్లగొట్టిన సినిమాగా రికార్డ్ సాధించగా తాజాగా మరో రికార్డుని తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అయిపోయాడు.

నిజానికి ఈ మధ్యకాలంలో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న మాస్ మహారాజా అభిమానులకు ‘ఇరుముడి’ మంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మూడో వారంలోకి అడుగుపెట్టినా జోరు తగ్గకుండా దూసుకుపోతుండటం విశేషం. సాధారణంగా ఏ సినిమా అయినా రెండో వారానికి వచ్చేసరికి థియేటర్లలో జనాలు రావడం తగ్గిపోతుంది. . కానీ ఇరుముడి కి మంచి మౌత్ టాక్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ జనాలు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఫలితంగా మూడో వారంలో కూడా చాలా చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి కూడా.

81 లక్షలకు పైగా టికెట్లు

Advertisement

ఇక ఇప్పటికే ఈ సినిమాకు 81 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచే భారీగా ఫుట్‌ఫాల్స్ రావడం ఇక్కడ మరో విశేషం. సాధారణంగా కోటి ఫుట్‌ఫాల్స్ మార్క్‌ను అందుకోవడం అంత ఆషామాషీ విషయం కాదు.

ముఖ్యంగా భారీ పాన్-ఇండియా సినిమాలకు లేదా పెద్ద పండుగ సీజన్లలో రిలీజ్ అయ్యే సినిమాలకి మాత్రమే ఈ స్థాయిలో ఆడియన్స్ వస్తుంటారు.కానీ అలాంటిది ఏమీ లేకుండా మామూలు రోజుల్లోనే
ఒక రీజినల్ సినిమా ఈ స్థాయి నంబర్స్ ని చూడటం నిజంగా ఆశ్చర్యమే.

కోటి ఫుట్‌ఫాల్స్ దిశగా సినిమా

Advertisement

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఆఫ్‌లైన్ టికెట్ సేల్స్.మామూలుగా బాక్సాఫీస్ లెక్కలన్నీ ఆన్‌లైన్ బుకింగ్స్ ఆధారంగానే చర్చల్లోకి వస్తుంటాయి.కానీ రూటెడ్ ఏరియాలలో కాని, సింగిల్ స్క్రీన్స్ ఉన్న చాలా చోట్ల కౌంటర్ ల వద్దే టికెట్స్ అమ్మేస్తుంటారు.అలా చూస్తే మొత్తం ఫుట్‌ఫాల్స్ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.ఈ వీకెండ్ కి సినిమా 85 లక్షల ఫుట్‌ఫాల్స్ మార్క్‌ను దాటే ఛాన్స్ పుష్కలంగా ఉంది. ఆ తర్వాత 90 లక్షలు, ఆపై కోటి ఫుట్‌ఫాల్స్ దిశగా సినిమా అడుగులు వేసినా ఆశ్చర్యం లేదు.

రవితేజ ఖాతాలో ‘కోటి ఫుట్‌ఫాల్స్’

మొత్తానికి ఎన్నేళ్ళగానో ఎదురుచూస్తున్న రవితేజకి ఇరుముడి సినిమా రూపంలో పెద్ద సక్సెస్ అందించాడు శివ నిర్వాణ.  చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ ‘ఇరుముడి’ తన స్టామినా చూపిస్తుంది.ఈ జోరు గనుక ఇలాగే కంటిన్యూ చేస్తే రవితేజ ఖాతాలో ‘కోటి ఫుట్‌ఫాల్స్’ అనే మైల్ స్టోన్ చేరడం పెద్ద కష్టమేమి కాదు.

Tags

Related News

కౌన్సిల్ సొమ్ము ఎటు పోయింది? సంచలన ఆరోపణలు చేసిన సి.కళ్యాణ్

రణబాలికి పోటీగా ఆదర్శ కుటుంబం… గెలుపెవరిదో!

మిల్కీ బ్యూటీకి పడిపోయాడా?.. స్టేజ్‌పైనే హీరో చేసిన పని వైరల్

నాని ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..మళ్ళీ వాయిదా దిశగా ప్యారడైజ్!

కోర్ట్ హీరో రోషన్ ‘తెల్ల కాగితం’ టీజర్ రిలీజ్!

శ్రీలీల చిన్నప్పటి ‘భరతనాట్యం’ వీడియో చూశారా? ఏం టాలెంట్ గురూ!

చిక్కుల్లో పడ్డ హీరో కార్తీ.. స్టార్ హీరోయిన్ వస్త్రధారణపై కామెంట్స్!

Big Stories

Advertisement
×