E-Paper
Advertisement

4K డిస్‌ప్లే, 12700mAh బ్యాటరీతో Lenovo Yoga Tab Gen 2.. ధరెంతో తెలుసా?

4K డిస్‌ప్లే, 12700mAh బ్యాటరీతో Lenovo Yoga Tab Gen 2.. ధరెంతో తెలుసా?
Advertisement

Lenovo Yoga Tab Gen 2 Series: ప్రీమియం ఆండ్రాయిడ్ ట్యాబ్ కొనాలనుకునే వారికి లెనోవో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచస్థాయి టెక్ ఈవెంట్ IFA 2026లో Yoga Tab Gen 2, Yoga Tab Plus Gen 2 పేరుతో రెండు సరికొత్త మోడళ్లను లాంచ్ చేసింది. వినోదంతో పాటు ఆఫీస్ వర్క్, క్రియేటివ్ పనులకు ఇవి బా‌గా సెట్ అవుతాయి. ఈ రెండింటిలోనూ ఏకంగా ఏడేళ్లపాటు ఆండ్రాయిడ్, సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ ప్రకటించడం విశేషం.

సాధారణ మోడల్ 11.1 ఇంచుల 4K డిస్‌ప్లేతో వస్తే.. ప్లస్ వేరియంట్ 13 ఇంచుల పెద్ద 4K డిస్‌ప్లేతో వస్తోంది. రెండింటిలోనూ 144Hz రీఫ్రెష్ రేట్, 1100 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటం వల్ల గేమింగ్, వీడియోలు చాలా స్మూత్‌గా అనిపిస్తాయి. చిన్న మోడల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9500s చిప్‌సెట్, ప్లస్ మోడల్‌లో పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ వాడారు.

Advertisement

Also Read: హైదరాబాద్‌లో TCS భారీ ఏఐ ప్రాజెక్ట్.. రూ.57,600 కోట్లతో HyperVault డేటా సెంటర్!

ఛార్జింగ్ టెన్షన్ లేకుండా ఉండటానికి ఇందులో పెద్ద బ్యాటరీలను అమర్చారు. సాధారణ మోడల్‌లో 11000mAh బ్యాటరీ ఉంటే.. ప్లస్ వెర్షన్‌లో ఏకంగా 12700mAh బ్యాటరీ ఇచ్చారు. రెండూ 68W ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. సినిమా ఫీల్ కోసం ప్లస్ మోడల్‌లో 6 స్పీకర్ల సెటప్ ఉంది. మ్యూజిక్, గేమింగ్‌కు తగినట్లు ట్యాబ్ వెనుక ఉన్న లైట్ మెరుస్తూ కొత్త లుక్ ఇస్తుంది.

Advertisement

ఈ ట్యాబ్‌లు Tab Pen Pro 2 స్టైలస్, మ్యాగ్నెటిక్ కీబోర్డ్‌కు సపోర్ట్ చేస్తాయి. దీంతో డ్రాయింగ్ వేయడం, నోట్స్ రాసుకోవడం, ఆఫీస్ వర్క్ చేయడం సులభం అవుతుంది. కాలింగ్, స్కానింగ్ కోసం వెనుక 13MP, ముందు 8MP కెమెరాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆండ్రాయిడ్ 17తో వచ్చే ఈ ట్యాబ్‌లు ఆండ్రాయిడ్ 24 వరకు అప్‌డేట్స్ పొందుతాయి.

Lenovo Yoga Tab Gen 2 ప్రారంభ ధర రూ.68,800 కాగా.. Plus Gen 2 రూ.94,400గా ఉంది. సెప్టెంబర్ నుంచే ఇవి గ్లోబల్ మార్కెట్‌లో అమ్మకానికి వచ్చాయి. భారతదేశంలో లాంచ్ తేదీ, అధికారిక ధరల వివరాలను కంపెనీ త్వరలోనే ప్రకటించనుంది. ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ఇవి మంచి ఛాయిస్ అనే చెప్పాలి.

Also Read: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాపిల్ ఈవెంట్.. iPhone 18 Proతో పాటు వచ్చే కొత్త డివైజ్‌లు ఇవే!

Tags

Related News

6000mAh బ్యాటరీ, IP68 రేటింగ్.. ఈ ప్రైజ్ రేంజ్‌లో ఇలాంటి ఫోన్ రావడం ఇదే తొలిసారి!

గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కి పండగే.. ఆ ఫోన్ ధర రూ.13,300 తగ్గింది, ఈ డీల్ మిస్ అవ్వొద్దు!

హెల్దీగా తినాలని ఉందా? బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!

హైదరాబాద్‌లో TCS భారీ ఏఐ ప్రాజెక్ట్.. రూ.57,600 కోట్లతో HyperVault డేటా సెంటర్!

బడ్జెట్‌లో బెస్ట్ క్యాసియో అనలాగ్ వాచ్.. ఇలాంటి వాచ్ ఒక్కటైనా ఉండాలి

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాపిల్ ఈవెంట్.. iPhone 18 Proతో పాటు వచ్చే కొత్త డివైజ్‌లు ఇవే!

రూ.7,490కే కెన్‌స్టార్ వాషింగ్ మెషీన్..బడ్జెట్‌ నంబర్ 1 మోడల్

Big Stories

Advertisement
×