E-Paper
Advertisement

మలయాళ సినిమా కోసం ఆ రూల్స్ బ్రేక్ చేస్తున్న అనుష్క శెట్టి!

మలయాళ సినిమా కోసం ఆ రూల్స్ బ్రేక్ చేస్తున్న అనుష్క శెట్టి!
Advertisement

Anushka Shetty: అనుష్క శెట్టి.. అలియాస్ స్వీటీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో , గ్లామర్ తో నటన ప్రాధాన్యత ఉన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. అరుంధతి , బాహుబలి2 వంటి చిత్రాలలో రాజసం ఉట్టిపడే పాత్రలు పోషించి అందరిని ఆశ్చర్యపరిచింది. బిల్లా వంటి చిత్రాలలో గ్లామర్ ఒలకబోసిన ఈమె.. వేదం సినిమాలో వేశ్యగా నటించి అబ్బురపరిచింది. నిశ్శబ్దం, సైజ్ జీరో, భాగమతి వంటి చిత్రాలలో భిన్న విభిన్నమైన పాత్రలు పోషించి అందరి దృష్టిని ఆకట్టుకున్న అనుష్క శెట్టి.. కొంతకాలం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చి.. నవీన్ పోలిశెట్టితో చేసిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఇక చివరిగా తెలుగులో ఘాటి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ సరైన సక్సెస్ ను అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఏకంగా భాషనే మార్చేసింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే తన తొలి మలయాళం చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది. ‘కథనార్’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం తన షరతులను, కట్టుబాట్లను పక్కన పెట్టేసిందని సమాచారం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

మలయాళ డెబ్యూ కోసం అనుష్క రూల్స్ బ్రేక్?

అసలు విషయంలోకి వెళ్తే.. అనుష్క తొలిసారి మలయాళం లో నటిస్తున్న చిత్రం కథనార్ : ది వైల్డ్ సోర్సరర్ . జయ సూర్య హీరోగా నటిస్తున్న ఈ ఫాంటసీ థ్రిల్లర్ ట్రైలర్ ఇటీవల విడుదలయ్యి అటు విజువల్స్ పరంగా అందరి దృష్టిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తోంది అనేది మాత్రం ట్రైలర్ ద్వారా స్పష్టం అయింది. ఇక అంతా బాగానే ఉన్నా ఈ ట్రైలర్లో నిరాశపరిచింది మాత్రం అనుష్క విజువల్స్. ఆమె లుక్ ను కేవలం రెండు షాట్స్ కే పరిమితం చేయడంతో ఆమె రోల్ , నిడివి పై సందేహాలు కూడా మొదలయ్యాయి. ముఖ్యంగా ఈమెను ఎక్కువగా ట్రైలర్ లో చూపించకపోయేసరికి అభిమానులు కూడా బాగా హర్ట్ అవుతున్నారు.. ఇలాంటి సమయంలో ఈ సినిమా కోసం అనుష్క తన రూల్స్ బ్రేక్ చేయనుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రమోషన్స్ కి అనుష్క.. చిత్ర బృందం ధీమా..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. చిత్ర బృందం మాత్రం హైదరాబాదు తో పాటు ఇతర ప్రధాన నగరాలలో జరిగే ప్రమోషన్లలో అనుష్క స్వయంగా పాల్గొంటుందని గట్టిగా చెబుతోంది.పైగా ఇది అనుష్క కి 50వ చిత్రం.. అందులోను మలయాళంలో తొలి సినిమా కావడంతో ఈసారి మినహాయింపు ఇస్తుందని మేకర్స్ కూడా గట్టిగానే నమ్ముతున్నారు ..మరి నిజంగానే ఈ సినిమా కోసం ఆమె తన రూల్స్ నిజంగానే బ్రేక్ చేస్తుందా? అభిమానుల కోసం ప్రమోషన్స్ కి రంగంలోకి దిగి సినిమాపై అంచనాలు పెంచేస్తుందా? అనే విషయం తెలియాల్సి ఉంది.

ALSO READ:అలాంటి రికార్డ్ సెట్ చేసిన మొట్టమొదటి సినిమాగా ధురంధర్ 2!

పెదవి విరుస్తున్న నెటిజన్స్!

Advertisement

మలయాళ సినిమా కోసం ఆ రూల్స్ బ్రేక్ చేస్తున్న అనుష్క శెట్టి!నెటిజన్స్ మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. స్ట్రెయిట్ సినిమాలు చేసినప్పుడే బయటకు రాని ఈమె.. ఒక మలయాళం అందులోను డబ్బింగ్ కోసం బయటకు వస్తుందా అంటూ పెదవి విరుస్తున్నారు . మరి జూలై లేదా ఆగస్టులో విడుదల కానున్న ఈ సినిమా కోసం అనుష్క ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి.

Related News

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

Big Stories

Advertisement
×