E-Paper
Advertisement

Avika Gor: తల్లి కాబోతున్న చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్…వీడియో వైరల్!

Avika Gor: తల్లి కాబోతున్న చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్…వీడియో వైరల్!
Advertisement

Avika Gor: అవికా గోర్ అంటే తెలుగు ప్రేక్షకులకు టక్కున గుర్తు రాకపోయినా చిన్నారి పెళ్లికూతురు అంటే మాత్రం ఈమె అందరికీ టక్కున గుర్తుకొస్తారు. తెలుగు బుల్లితెర పై ప్రసారమైన చిన్నారి పెళ్లి కూతురు అనే సీరియల్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న అవికా అనంతరం ఉయ్యాల జంపాల అనే సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు పరిచయమయ్యారు. ఇలా తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా కెరియర్ పరంగా నటిగా నిర్మాతగా ఎంతో బిజీగా ఉన్నా అవికా గత ఏడాది పెళ్లి చేసుకుని కొత్త బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

తల్లి కాబోతున్న నటి అవికాగోర్?

అవికా గోర్ గత ఏడాది సెప్టెంబర్ నెలలో తన ప్రియుడు మిలింద్ చాంద్వానీతో కలిసి ఏడడుగులు నడిచారు. ఇక ఈమెకు పెళ్లి తర్వాత తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతూనే ఉన్నాయి. గతంలో ఈమె ప్రెగ్నెన్సీ వార్తలను ఖండించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అవికా ప్రెగ్నెన్సీ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక కార్యక్రమంలో భాగంగా ఈమె తన భర్తతో కలిసి వెళ్లి అనంతరం బయటకు వచ్చారు. ఇలా బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరిని ఫోటోగ్రాఫర్లు క్యాప్చర్ చేస్తుండగా అవికా మాత్రం ఎంతో అసౌకర్యంగా కనిపించారు.

వాంతులు చేసుకున్న నటి..

Advertisement

ఇలా సౌకర్యంగా కనిపించిన ఈమె అక్కడే ఉన్నఫలంగా వాంతులు చేసుకున్నారు అయితే తన భర్త మిలింద్ మాత్రం ఫోటోగ్రాఫర్లను ఫోటోలు తీయద్దు అంటూ రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ దంపతులు తమ మొదట బిడ్డకు స్వాగతం పలకబోతున్నారా ? ఈమె తల్లి కాబోతోందా? అందుకే ఇలా వాంతులు చేసుకున్నారా? అంటూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల చర్చలు మొదలయ్యాయి. కొంతమంది ఈమె తల్లి కాబోతున్నారు అంటూ ఈమెకు శుభాకాంక్షలు తెలియజేయగా మరి కొందరు మాత్రం నాకెందుకు ఇది యాక్టింగ్ అనిపిస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు చాలా అద్భుతంగా నటిస్తున్నారు అంటూ కూడా కామెంట్ లు చేస్తున్నారు.

?igsh=MWhxZTFmZTZrMGg4bw%3D%3D

Advertisement

మరి అవికా గోర్ ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే అధికారకంగా ఈ దంపతులు స్పందించాల్సి ఉంది. ఇక అవికా కెరియర్ విషయానికి వస్తే బాలా నటిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె పలు హిందీ సీరియల్స్ లో నటించారు. ఇక హిందీలో ప్రసారమవుతున్న బాలిక వదు సీరియల్ తెలుగులో చిన్నారి పెళ్లికూతురుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సీరియల్ లో ఆనంది అనే పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా సినిమాల పరంగా బిజీగా ఉన్న ఈమె ఐఐఎం గ్రాడ్యుయేట్ అయి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న మిలింద్ ఆ ఉద్యోగం వదిలేసి ప్రస్తుతం ‘క్యాంప్ డైరీస్’ అనే NGO ద్వారా సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీరి పరిచయం 2019వ సంవత్సరంలో జరిగింది. గత ఏడాది వీరిద్దరు వివాహం చేసుకున్నారు.

Also Read: Divvala Madhuri: తిరుమల కొండ పై నిబంధనలను ఉల్లంఘించిన మాధురి.. ఆ గ్రహిస్తున్న భక్తులు!

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×