Road Accident: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రేగొండ మండలం నారాయణపూర్ సమీపంలో జాతీయ రహదారిపై.. అతి వేగంగా వస్తున్న కారు, పల్సర్ బైక్ ముఖాముఖి ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
ప్రమాదం సమయంలో యువకులు తమ పల్సర్ బైక్‌పై పరకాల నుండి భూపాలపల్లి వైపు వెళ్తున్నారు. అదే సమయంలో భూపాలపల్లి నుండి రేగొండ వైపు వస్తున్న మారుతి స్విప్ట్ డిజైర్ కారు నారాయణపూర్ గ్రామ శివారులోకి రాగానే బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా అతివేగంతో ఉండటంతో ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది.
ఢీకొన్న ధాటికి పల్సర్ బైక్ నుజ్జునుజ్జువ్వగా, దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్రమైన రక్తస్రావం కావడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు ముందు భాగం కూడా పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని రక్తపుమడుగులో పడి ఉన్న మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
Also Read:టోలిచౌకిలో ఘోర ప్రమాదం.. ఐదో అంతస్తు నుంచి పడి ముగ్గురు కూలీల దుర్మరణం!