E-Paper
Advertisement

Spirit Update: ప్రభాస్ స్పిరిట్ సినిమాలో చిరంజీవి.. క్లారిటీ వచ్చేసింది..!

Spirit Update: ప్రభాస్ స్పిరిట్ సినిమాలో చిరంజీవి.. క్లారిటీ వచ్చేసింది..!
Advertisement

Spirit Update: ప్రభాస్ సినిమా స్పిరిట్ పైన రోజు రోజుకి అంచనాలు రెట్టింపు అవుతూ వస్తున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలిసి చేస్తున్న తొలి సినిమా కావడంతో మొదటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక వార్త, గాసిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.

ఈ క్రమంలో తాజాగా మరో ఆసక్తికరమైన ప్రచారం మొదలైంది. అదేంటంటే… మెగాస్టార్ చిరంజీవి కూడా ‘స్పిరిట్’ సినిమాలో నటించబోతున్నారట అనే వార్త. ప్రభాస్ తండ్రి పాత్రలో చిరంజీవి కనిపిస్తారని, అది సెకండ్ హాఫ్‌లో సుమారు 15 నిమిషాల పాటు ఉంటుందని కొన్ని కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రెండు పెద్ద స్టార్లు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ఎలా ఉంటుందో అని అభిమానులు ఊహించుకోవడం మొదలుపెట్టారు.

Advertisement

ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది చిరంజీవి ‘స్పిరిట్’ సినిమా పూజా కార్యక్రమానికి హాజరుకావడం. దీంతో చాలామంది “చిరంజీవి ఈ సినిమాలో ఖచ్చితంగా ఉన్నారు” అని నమ్మేశారు. కానీ ఈ ప్రచారంపై తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పష్టత ఇచ్చారు.

ఈ వార్తలు పూర్తిగా తప్పు అని ఆయన తేల్చి చెప్పారు. ‘స్పిరిట్’ సినిమాలో చిరంజీవి లేరని స్పష్టంగా ప్రకటించారు. చిరంజీవిపై తనకు ఎంతో అభిమానముందని, తన ఆఫీస్‌లో చిరంజీవి పోస్టర్లు కూడా ఉన్నాయని చెప్పారు. అయితే మెగాస్టార్‌కు చిన్న పాత్ర లేదా అతిథి పాత్ర ఇవ్వడం తనకు ఇష్టం లేదని, భవిష్యత్తులో అవకాశం వస్తే చిరంజీవితో పూర్తి స్థాయి సినిమా చేయాలనుకుంటున్నానని తెలిపారు.

Advertisement

దర్శకుడు ఇంత స్పష్టంగా చెప్పినా కూడా, సోషల్ మీడియాలో మాత్రం ఈ రూమర్స్ మళ్లీ మళ్లీ వస్తూనే ఉన్నాయి. క్లిక్‌బైట్ వార్తల వల్లే ఇలాంటి గాసిప్స్ తిరిగి తిరిగి వినిపిస్తున్నాయని సినీ వర్గాలు అంటున్నాయి.

ఇక ‘స్పిరిట్’ సినిమా వివరాల విషయానికి వస్తే, ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రీ నటిస్తోంది. ఈ సినిమాకు కథ, దర్శకత్వం, ఎడిటింగ్ అన్నీ సందీప్ రెడ్డి వంగానే చేస్తున్నారు. టీ-సిరీస్‌తో పాటు వంగా ప్రొడక్షన్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, చైనీస్ (మాండరిన్), జపనీస్, కొరియన్ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘స్పిరిట్’ సినిమా 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ALSO READ: Eesha Rebba Marriage: తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ పెళ్లి నిజమా..లేక సినిమా ప్రమోషనా..!

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×