Chicken Manchurian: బయట రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు స్టార్టర్స్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది చికెన్ మంచూరియా. చాలామంది ఫేవరెట్ డిష్ కూడా ఇదే. అలా అని రోజూ రెస్టారెంట్‌కి వెళ్లి డబ్బులు ఖర్చుపెట్టలేము కదా. అయితే, తక్కువ ఖర్చుతో కొన్ని చిట్కాలు పాటిస్తూ.. సరైన సాస్‌ల కాంబినేషన్‌లో చేస్తే, అదిరిపోయే చికెన్ మంచూరియా ఇంట్లోనే రెడీ. ఇంటికి బంధువులు వచ్చినప్పుడు స్పెషల్‌గా వడ్డించాలన్నా లేదా సండే పిల్లలకు ఏదైనా టేస్టీగా చేసి పెట్టాలన్నా ఈ రెసిపీ బెస్ట్ ఛాయిస్.
Also Read: బయట పానీపూరీ తినాలంటే భయమా? అయితే ఇంట్లోనే ఇలా చిటికెలో పానీ రెడీ చేసుకోండి!
బోన్‌లెస్ చికెన్ – 1/4 కేజీ
తరిగిన ఉల్లిపాయలు – అరకప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి – అర టీస్పూన్
కోడిగుడ్డు – ఒకటి
మైదాపిండి – ఒక టీస్పూన్
సోయాసాస్ – ఒక టీస్పూన్
చిల్లీ సాస్ – ఒక టీస్పూన్
వెనిగర్ – ఒక టీస్పూన్
కార్న్ ఫ్లోర్ – ఒక టీస్పూన్
టమోటా సాస్ – ఒక టీస్పూన్
ఉప్పు – రుచికి తగినంత
నూనె – తగినంత
ముందుగా చికెన్‌ను మిరియాల పొడి, కోడిగుడ్డు, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, మిర్చి, కార్న్ ఫోర్‌లను తగినంత నీటితో కలిపి అరగంట పాటు నాననివ్వాలి. తర్వాత స్టవ్ ాన్ చేసి బాణలిలో నూనె పోసి చికెన్‌ను దోరగా వేయించి ఓ ప్లేటులోకి తీసుకోవాలి. తర్వాత మరో పాత్రలో నూనె వేసి ఉల్లిపాయ తరుగు, అల్లం, వెల్లుల్లి, మిర్చి పేస్ట్‌ను కలిపి బాగా వేపుకోవాలి. ఇందులో సోయాసాప్, టమోటా సాస్, చిల్లీ సాస్, వెనిగర్, నీరు చేర్చి కాసేపు వేగనివ్వాలి.
తర్వాత ఈ మిశ్రంలో వేయించిన చికెన్ ఫీస్‌లను చేర్చి నాలుగు నిమిషాల పాటు వేపాలి. ఇందులో తగినంత ఉప్పు వేసుకుంటే సరి. అంతే టేస్టీ చికెన్ మంచూరియా రెడీ. దీనిన ఫ్రైడ్‌రైస్, చపాతీ, రోటీలకు సైడ్ డిష్‌గా సర్వ చేసుకుని తింటే ఆ మజానే వేరు.
Also Read: పిల్లలు కూడా లొట్టలేసుకుని తినేలా.. స్పెషల్ వెజిటేబుల్ కిచిడీ రెడీ!