E-Paper
Advertisement

Dragon Fruit Benefits: యవ్వనంగా కనిపించాలా? క్యాన్సర్ దరిచేరకూడదా? అయితే ఈ పింక్ పండును అస్సలు వదలకండి!

Dragon Fruit Benefits: యవ్వనంగా కనిపించాలా? క్యాన్సర్ దరిచేరకూడదా? అయితే ఈ పింక్ పండును అస్సలు వదలకండి!
Advertisement

Dragon Fruit Benefits: ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పండ్లలో డ్రాగన్ ఫ్రూట్ ఒకటి. చూడగానే ఆకర్షించే గులాబీ రంగు, లోపల చిన్న చిన్న నల్లని గింజలతో డిఫ్రెంట్‌గా కనిపించే ఈ పండును ‘పిటాయా’ అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు మన దేశంలో చాలా తక్కువగా కనిపించే ఈ పండు.. ప్రస్తుతం తనలోని అద్భుతమైన పోషక విలువల వల్ల ప్రతి ఫ్రూట్ మార్కెట్‌లోనూ సందడి చేస్తోంది. మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌ను పుష్కలంగా అందించే ఈ పండు వల్ల కలిగే మేలు అంతా ఇంతా కాదు.

మధుమేహులకు వరం:

మనం రోజూ తీసుకునే పండ్లలో చక్కెర శాతం కాస్త ఎక్కువగా ఉంటుంది. కానీ డ్రాగన్ ఫ్రూట్ విషయంలో అలా కాదు. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటమే కాకుండా.. ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అందుకే షుగర్ పేషంట్లు కూడా ఎలాంటి భయం లేకుండా డ్రాగన్ ఫ్రూట్‌ను డైట్‌లో చేర్చుకోవచ్చు.

Advertisement

Also Read: సాయంత్రం పూట వేడి వేడి స్వీట్ కార్న్ గారెలు.. నోట్లో వేసుకోగానే కరిగిపోవాల్సిందే!

క్యాన్సర్ నుంచి రక్షణ: 

కేవలం డ్రాగన్ ఫ్రూట్ గుజ్జులోనే కాదు.. దాని తొక్కలో కూడా ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. దీనిలో ఉండే విటమిన్ సీ, బీటాలైన్లు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇవి వాపులను నివారించడమే కాకుండా.. మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. డ్రాగన్ ఫ్రూట్‌లోని యాంటీఆక్సిడెంట్లు కణాలను రక్షించడంలో ముందుంటాయి.

రోగనిరోధక శక్తి పెంపు:

Advertisement

తరచుగా రోగాల బారిన పడకుండా ఉండాలంటే మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉండాలి. డ్రాగన్ ఫ్రూట్‌లో అధికంగా ఉండే విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు ఇమ్యూన్ సిస్టమ్‌ను బలోపేతం చేస్తాయి. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడటమే కాకుండా.. దీర్ఘకాలిక వ్యాధులు దరి చేరకుండా రక్షణ కల్పిస్తాయి.

గుండె ఆరోగ్యం పదిలం:

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో డ్రాగన్ ఫ్రూట్ అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో ఉండే హెల్తీ కొవ్వు ఆమ్లాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చూస్తాయి. ఫలితంగా గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

వృద్ధాప్యం దరిచేరదు:

డ్రాగన్ ఫ్రూట్ తినడం వలన ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా చర్మ సౌందర్యం మీద శ్రద్ధ పెట్టేవారికి కూడా ఇది మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఐరన్, ప్రోటీన్లు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, కాలుష్యం, ఎండ వల్ల కలిగే చర్మ సమస్యల నుంచి కాపాడి, చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.

Also Read: మాటిమాటికీ తలనొప్పి ఎందుకు వస్తుంది? ఉపశమనం పొందే సహజ మార్గాలు ఇవే..

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×