E-Paper
Advertisement

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!
Advertisement

Huawei Watch GT 7: ప్రతిరోజూ వాచ్‌కు ఛార్జింగ్ పెట్ట లేక విసిగిపోతున్నారా? ఎండలో స్మార్ట్‌వాచ్ స్క్రీన్ కనిపించక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ సమస్యలకు చెక్ పెట్టేందుకు హువాయ్ కంపెనీ ఒక సాలిడ్ సొల్యూషన్‌తో వచ్చింది. అద్భుతమైన ఫీచర్లతో Huawei Watch GT 7 సిరీస్‌ను గ్లోబల్ మార్కెట్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేసింది. దీనిలో Watch GT 7 Proతో పాటు, సాధారణ GT 7 మోడల్‌ను 46mm, 41mm సైజుల్లో పరిచయం చేసింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారాల తరబడి తిరుగులేని బ్యాటరీ లైఫ్ ఇచ్చే ఈ వాచ్‌లు.. మార్కెట్లో టెక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ సిరీస్‌లోని Watch GT 7 Pro, 46mm మోడల్స్ 1.47 ఇంచుల అమోల్డ్ స్క్రీన్‌తో వస్తున్నాయి. ఇక చిన్నదైన 41mm మోడల్ 1.327 ఇంచుల స్క్రీన్‌ కలిగి ఉంది. వీటన్నింటిలో అత్యంత ప్రధానమైన విశేషం ఏంటంటే.. ఏకంగా 3000 నిట్స్ బ్రైట్‌నెస్ ఇవ్వడం. దీంతో నడి వేసవిలో, కంటికి తీవ్రమైన ఎండ తగులుతున్నా కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాచ్‌ను సులభంగా ఆపరేట్ చేయడానికి రొటేటింగ్ క్రౌన్, సైడ్ బటన్ ఇచ్చారు.

Advertisement

Also Read: కొత్త మోడల్ వచ్చేలోపే శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. బెస్ట్ AI ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

సాధారణంగా స్మార్ట్‌వాచ్‌లలో బ్యాటరీ త్వరగా అయిపోతుందనే బాధ ఉంటుంది. కానీ ప్రో మోడల్, 46mm మోడల్స్ లైట్ యూసేజ్‌లో ఏకంగా 21 రోజుల పాటు పనిచేస్తాయి. మామూలు వాడకంలో 12 రోజులు, ఆల్‌వేస్ ఆన్ డిస్ప్లే ఆన్‌లో ఉంటే 7 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తాయి. ఇక చిన్న సైజ్ 41mm మోడల్ లైట్ వాడకంలో 14 రోజులు, సాధారణ వాడకంలో వారం రోజుల పాటు ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది.

Advertisement

ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వారి కోసం ఇందులో ఎన్నో అడ్వాన్స్డ్ సెన్సార్లు ఉన్నాయి. గుండె వేగం, శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయిలు తెలుసుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ప్రో మోడల్‌లో ఈసీజీ (ECG), డెప్త్ సెన్సార్లు అదనంగా ఇచ్చారు. నీటిలో 40 మీటర్ల లోతు వరకు డైవింగ్ చేసినా ఇది తడవకుండా పనిచేస్తుంది. దీనికి ఉన్న 5ATM, IP69 రేటింగ్స్ వాచ్‌ను నీరు, ధూళి నుండి పూర్తిగా కాపాడతాయి.

బ్లూటూత్ 6.0, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ వంటి అధునాతన కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటికీ ఇవి సపోర్ట్ చేస్తాయి. ఇక ధరల విషయానికి వస్తే.. ప్రో మోడల్ సుమారు రూ.47,225గా ఉంది. జీటీ 7 మోడల్ ధరలు రూ.32,915 నుండి ప్రారంభమవుతున్నాయి. ప్రీమియం లుక్, బెస్ట్ ఫీచర్లు కోరుకునే వారికి ఈ సిరీస్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

Also Read: భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

Tags

Related News

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

కొత్త మోడల్ వచ్చేలోపే శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. బెస్ట్ AI ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

Big Stories

Advertisement
×