E-Paper
Advertisement

Hero Suriya: స్టార్ హీరో సూర్యపై డైరెక్టర్ కేసు వేయబోతున్నారా?

Hero Suriya: స్టార్ హీరో సూర్యపై డైరెక్టర్ కేసు వేయబోతున్నారా?
Advertisement

Hero Suriya: సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య , దర్శకుల మధ్య, నిర్మాతల మధ్య అభిప్రాయ బేధాలు రావడం సహజమే. అయితే హీరోకి – నిర్మాతలకి లేదా దర్శకుడికి – నిర్మాతలకి ఏదైనా ఆర్థిక విషయంలో ఇబ్బందులు తలెత్తితే మాత్రం కోర్టు వరకు వెళ్తారు అనడంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పై డైరెక్టర్ కేసు వేయబోతున్నారా? అనే అనుమానాలు కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వ్యక్తమవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

సూర్య సినిమా విడుదల ఆలస్యానికి కారణం?

ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న 45వ చిత్రం కరుప్పు. తమిళ సినీ పరిశ్రమలో ఈ సినిమా విడుదల ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినట్లు సమాచారం. యాక్షన్ ఫాంటసీ అంశాలతో ఈ సినిమా షూటింగ్ పూర్తయినా.. ఇంకా విడుదల కాకపోవడంతో సోషల్ మీడియాలో పలు రకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకం పై ఎస్ ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు నిర్మిస్తున్నారు .ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 2025 నవంబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ తో పాటు సినిమా పనులన్నీ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. మరి అన్ని పనులు పూర్తయినా ఇంకా ఎందుకు ఈ సినిమా విడుదల కాలేదు అనే అనుమానం వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం.

సూర్య పై డైరెక్టర్ కేసు వేయనున్నారా?

Advertisement

అయితే ఈ సినిమా నిర్మాత ఎస్.ఆర్ ప్రభు, హీరో సూర్య లపై దర్శకుడు ఆర్జే బాలాజీ కేసు వేయాలని భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమా పూర్తయినా.. వ్యక్తిగత కారణాలతో నిర్మాత కావాలనే ఆలస్యం చేస్తున్నారని , అందుకే ఆర్జే బాలాజీకి ఇవ్వాల్సిన పూర్తి పారితోషకం ఇవ్వలేదని, ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యాకే సెటిల్ చేస్తామని నిర్మాత చెప్పడం వల్ల ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని సినీవర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఆలస్యం వల్ల దర్శకుడు కెరియర్ కు నష్టం జరుగుతోందని , సినిమా పొటెన్షియల్ వృధా అవుతోందని ఫ్యాన్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలా ఆయన కేస్ ఫైల్ చేయబోతున్నారు అంటూ వార్తలు రాగా దీనిపై చిత్ర బృందం స్పందించింది.

ALSO READ:#Gopichandh33: సత్యవతిగా రీతూవర్మ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్!

స్పందించిన నిర్మాతలు..

Advertisement

ఆర్జే బాలాజీకి, నిర్మాతలకు మధ్య ఎటువంటి విభేదాలు లేవు. ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అంటూ కొట్టి పారేశారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వివాదాలన్నీ సమిసిపోవాలి అంటే సినిమా థియేటర్లలోకి రావాలి. సూర్య ఖాతాలో మరో హిట్టు పడితే మాత్రం ఈ రూమర్స్ అన్ని కొట్టుకుపోతాయి అనడంలో సందేహం లేదు. మరి కరుప్పు సినిమా ఆలస్యం వెనుక అసలు కారణాన్ని ఎవరూ బయట పెట్టకపోవడంతోనే ఇలాంటి రూమర్లు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా చిత్ర బృందం ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×