#Gopichandh33:చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టిన రీతూవర్మ (Rithu varma) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టకు ముందు.. షార్ట్ ఫిలిమ్స్ చేసి మంచి పేరు అందుకున్న ఈమె.. ఆ తర్వాత.. బాద్ షా సినిమాలో పింకీ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్, ఎవడే సుబ్రహ్మణ్యం, నా రాకుమారుడు వంటి చిత్రాలలో నటించిన ఈమెకు.. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా వచ్చిన ‘పెళ్లిచూపులు’ సినిమా మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమా తర్వాత పలువురు హీరోల సరసన నటిస్తూ మరింత బిజీగా మారిపోయింది రీతూ వర్మ.
ఆ తర్వాత తెలుగు, తమిళ్ భాషలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. చివరిగా మజాకా సినిమా తర్వాత మరో ప్రాజెక్టు ప్రకటించలేదు. ఇక అవకాశాలు తగ్గిపోయాయని అందురూ అనుకునే లోపే తాజాగా ఈరోజు ఈమెకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అసలు విషయంలోకి వెళ్తే.. రీతు వర్మ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఈమె గోపీచంద్ 33వ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నట్లు అధికారికంగా కన్ఫామ్ చేస్తూ.. ఈమె ఫస్ట్ లు పోస్టర్ ను మేకర్స్ పంచుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ సెలబ్రిటీలు రీతు వర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా.. ఈ పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:Vaishnavi Chaitanya: జోరు పెంచిన వైష్ణవి చైతన్య.. ఏకంగా ఆ స్టార్ హీరోతో రొమాన్స్!
సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక, చారిత్రాత్మక యాక్షన్ డ్రామాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గోపీచంద్ ఒక సరికొత్త యోధుడు పాత్రలో కనిపించనున్నారు. భారతీయ చరిత్రలో మరిచిపోయిన ఒక అధ్యాయాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుందని సమాచారం. అనుదీప్ దేవ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఏడవ శతాబ్దపు నేపథ్యంతో సాగే ఈ చారిత్రాత్మక చిత్రంలో గోపీచంద్ పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే ఇన్ని రోజులు ఈ సినిమాలో రితిక నాయక్ హీరోయిన్గా నటిస్తోంది అంటూ వార్తలు రాగా.. తాజాగా రీతూ వర్మాను అధికారికం చేశారు. ఇందులో సత్యవతి పాత్రలో రీతు వర్మ నటిస్తోంది. అందులో విల్లుపట్టి రౌద్రంతో ఆమె చూస్తున్న తీరు అభిమానులను ఆకట్టుకుంటుంది. సరికొత్తగా తన కెరియర్లో మరో ఇలాంటి విభిన్నమైన పాత్ర చేయడానికి సిద్ధమైన రీతు వర్మకు.. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. అటు గోపీచంద్ ఇటు రీతు వర్మ ఇద్దరూ కూడా సక్సెస్ కోసం గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ఈ జంటకు మంచి విజయం అందించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.