E-Paper
Advertisement

Thalapathy Vijay Sentiment: జన నాయగన్ డిజాస్టర్ అవ్వబోతోందా..? విజయ్ కెరీర్‌ను వెంటాడుతున్న సెంటిమెంట్..!

Thalapathy Vijay Sentiment: జన నాయగన్ డిజాస్టర్ అవ్వబోతోందా..? విజయ్ కెరీర్‌ను వెంటాడుతున్న సెంటిమెంట్..!
Advertisement

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్లు ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు విడుదలకు ముందే వాయిదా పడటం.. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాకపోవడం కూడా జరిగింది. అన్నిటికంటే షాకింగ్ విషయం ఏమిటి అంటే విజయ్ కెరీర్ లో వాయిదా పడిన సినిమాలు అన్నీ కూడా ఫ్లాప్ రికార్డులు అందుకోవడం. దీంతో.. వాయిదా పడిన విజయ్ సినిమాల సెంటిమెంట్.. అనే ఒక చర్చ సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది.

ముందుగా..2004లో వచ్చిన ఉదయ సినిమా.. విరుదలకు చాలా ఆలస్యం అయింది. విడుదల సమయంలో మంచి అంచనాలు ఉన్నా.. చివరకు అది పోస్ట్ ఫోన్ అయి ఆ తర్వాత విడుదలై..డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత 2006లో వచ్చిన ఆతి(Aathi).. సినిమా కూడా వాయిదాల తర్వాత థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా అయితే ఏకంగా తమిళ ఇండస్ట్రీ భారీ డిజాస్టర్‌గా.. మారి పెద్ద షాక్ ఇచ్చింది.

Advertisement

2011లో విడుదలైన కావలన్ విషయంలో కూడా జాప్యం జరిగింది. ఎన్నో అడ్డంకుల తర్వాత విడుదలైన ఈ చిత్రం.. కథ, భావోద్వేగాలు బాగున్నాయని చెప్పుకున్నా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం డిజాస్టర్‌గా మిగిలింది. 2013లో వచ్చిన తలైవా సినిమాకు రాజకీయ కారణాలతో విడుదల ఆలస్యం అయింది. చివరకు సినిమా ఫలితం అభిమానులను నిరాశపరిచింది.

2015లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పులి సినిమా మీద అంచనాలు అప్పట్లో భారీగా ఉన్నాయి. కానీ ఈ సినిమా కూడా పలుమార్లు వాయిదా పడింది. విడుదలైన తర్వాత ఇది ఇండస్ట్రీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో విజయ్ సినిమాలు వాయిదా పడితే ఫ్లాప్.. అనే సెంటిమెంట్ మరింత బలపడింది.

Advertisement

ఇప్పుడు 2025లో రాబోతున్న జన నాయగన్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు విజయ్ నటిస్తున్న చివరి సినిమా కావడంతో అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే సెన్సార్ సమస్యలు.. హింసాత్మక సన్నివేశాలు, కొన్ని డైలాగులు మతపరమైన వివాదాలకు దారితీయవచ్చన్న కారణాలతో.. సెన్సార్ వారు సినిమా విడుదలను వాయిదా వేశారు. దీనిపై జనవరి 9 ఉదయం హైకోర్టులో ఫైనల్ డెఫిషియన్.

గత అనుభవాల కారణంగా అభిమానుల్లో టెన్షన్ ఉన్నా, ఇది విజయ్ చివరి సినిమా కావడంతో ఈసారి సెంటిమెంట్ బ్రేక్ అవుతుందని వారు గట్టిగా నమ్ముతున్నారు. జన నాయగన్ విజయ్ కెరీర్‌కు గౌరవప్రదమైన ముగింపు అవుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

ALSO READ: Anasuya Bharadwaj: పరువు పోయే పనులు అవసరమా.. ఘాటైన సమాధానం ఇచ్చిన అనసూయ..!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×