E-Paper
Advertisement

UTS to RailOne app: రైల్వే పాస్ ను UTS నుంచి RailOneకు మార్చుకోవాలా? సింపుల్ గా ఇలా చేస్తే చాలు!

UTS to RailOne app: రైల్వే పాస్ ను UTS నుంచి RailOneకు మార్చుకోవాలా? సింపుల్ గా ఇలా చేస్తే చాలు!
Advertisement

భారతీయ రైల్వే UTS మొబైల్ యాప్ విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి యాప్ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఇకపై అన్ని రైల్వే సేవల కోసం RailOne యాప్ ను ఉపయోగించాలని ప్రయాణీకులకు సూచించింది. UTS యాప్ కంప్లీట్ గా నిలిపివేయనప్పటికీ,  దాని సీజనల్ పాస్ బుకింగ్, రెన్యువల్ లాంటి సర్వీసులను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో అసలు UTS నుంచి ప్రస్తుత పాస్ ను RailOneకు ఎలా ట్రాన్స్ ఫర్ చేసుకోవాలని ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఎలాంటి టెన్షన్ అవసరం లేదని అధికారులు వెల్లడించారు. సింపుల్ గా తమ రైలు పాసులను RailOneకు మార్చుకోవచ్చని చెప్తున్నారు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇకపై అన్ని రైల్వే సేవలు RailOne యాప్ లోనే!

ఇప్పటి వరకు రైల్వేకు సంబంధించి ఒక్కో సర్వీసుకు ఒక్కో యాప్ ఉండేది. ప్రస్తుతం రైల్వే సేవలు అన్నీ ఒకే యాప్ నుంచి అందించేందుకు RailOne యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  దీని ఇంటర్‌ ఫేస్ చాలా సింపుల్ గా ఉంటుంది. సులభంగా ఉపయోగించేలా ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్, ఐవోఎస్ లో అందుబాటులో ఉంది. ఈ యాప్ R-Wallet ద్వారా రిజర్వ్ చేయని UTS టికెట్ బుకింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, ఈ యాప్ ద్వారా రిజర్వేషన్ చేయని టికెట్లు బుక్ చేసుకున్న వారికి 3% తగ్గింపును కూడా అందిస్తోంది. అదే సమయంలో రియల్ టైమ్ ట్రైన్ ట్రాకింగ్‌ను కూడా అందిస్తుంది.   ఈ యాప్ లో ఇ క్యాటరింగ్, పోర్టర్ బుకింగ్, లాస్ట్ మైల్ టాక్సీ సేవలతో పాటు టికెట్ క్యాన్సిలేషన్, రీఫండ్, ఫిర్యాదుల వరకు అన్ని సర్వీసులను అందిస్తుంది.

రైలు పాస్ ను ఎలా ట్రాన్స్ ఫర్ చేసుకోవాలంటే?

Advertisement

RailOneకు యాప్ కు Mpin లేదంటే బయోమెట్రిక్ ద్వారా లాగిన్ కావచ్చు. సింగిల్ సైన్ ఆన్ సిస్టమ్‌ను అందిస్తుంది. వినియోగదారులు తమ ప్రస్తుత రైల్‌ కనెక్ట్, UTS వివరాలను ఉపయోగించి కూడా లాగిన్ కావచ్చు. రైల్‌వన్ ఒకే ప్లాట్‌ఫామ్‌లో అన్ని రైల్వే సేవలను  అందిస్తుంది కాబట్టి,  ప్రయాణీకులు ఇకపై  మరిన్ని యాప్ లను వాడాల్సిన అవసరం లేదు.అటు UTS యాప్ లో తీసుకున్న సీజన్ పాస్‌లను ట్రాన్స్‌ ఫర్ టికెట్ లింక్‌ని ఉపయోగించి రైల్‌వన్‌కు మార్చుకోవచ్చని రైల్వే అధికారులు వెల్లడించారు. వాలెట్ బ్యాలెన్స్‌ ఆటోమేటిక్ గా రైల్ వన్ కు మార్చబడుతాయని తెలిపారు. రైలు పాస్ ను ఎలా ట్రాన్స్ ఫర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

⦿  UTS యాప్‌ను ఓపెన్ చేసి ‘ట్రాన్స్‌ ఫర్ టికెట్’ లింక్‌ క్లిక్ చేయాలి.

Advertisement

⦿ ట్రాన్స్ ఫర్ చేయడానికి యాక్టివ్ సీజన్ పాస్ ను సెలెక్ట్ చేసుకోవాలి.

⦿ పాస్‌ను రైల్‌వన్‌కు లింక్ చేయడానికి స్క్రీన్‌ మీద ఉన్న సూచనలను ఉపయోగించాలి.

⦿ ఆధారాలను ఉపయోగించి రైల్‌వన్‌ లో లాగిన్ కావాలి.

⦿ UTS వాలెట్ బ్యాలెన్స్‌ ను మీ రైల్‌ వన్ అకౌంట్ కు ఆటోమేటిక్ గా ట్రాన్స్ ఫర్ అవుతోంది.

⦿ రైల్‌వన్‌ లోకి లాగిన్ అయిన తర్వాత అదనపు భద్రత కోసం యూజర్లు M-PINను సెట్ చేసుకోవాలి.

Read Also: లోకల్ ప్రయాణికులకు షాక్.. UTS యాప్ బంద్, ఇక ఆ కొత్త యాప్‌లోనే అన్నీ!

Related News

ఇండియన్ టూరిస్టులపై స్విట్జర్లాండ్ స్పెషల్ ఫోకస్.. ఏకంగా జెమీమాతో ప్రమోషన్స్!

విమానంలో బిడ్డ పుడితే ఏ దేశ పౌరసత్వం వస్తుంది? రూల్స్ ఏం చెప్తున్నాయంటే?

చలికాలానికి ముందే మంచు అందాలను చూడాలనుందా? దేశంలో 7 అదిరిపోయే ప్లేసెస్ ఇవే!

ప్రయాణికుడి చెవిలో ఇరుక్కుపోయిన ఇయర్‌ బడ్.. రైల్వే సిబ్బంది చేసిన పనికి ప్రశంసలు!

ప్రకృతి అందాల మధ్య మరిచిపోలేని అనుభూతి.. దేశంలో 8 అద్భుతమైన రైలు ప్రయాణాలు!

అంతరిక్షంలోకి టూరిస్టులు.. అసలు ఇది సాధ్యమేనా, ఖర్చు ఎంతవుతుంది?

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×