E-Paper
Advertisement

Nagarjuna: అక్కినేని నాగార్జునకు మరికొన్ని ఫ్లాపులు తప్పవా.. నిరాశలో అభిమానులు..!

Nagarjuna: అక్కినేని నాగార్జునకు మరికొన్ని ఫ్లాపులు తప్పవా.. నిరాశలో అభిమానులు..!
Advertisement

Nagarjuna ప్రస్తుతం టాలీవుడ్‌లో నాగార్జున అక్కినేని అభిమానుల్లో కొంత అసంతృప్తి కనిపిస్తోంది. కారణం ఆయన సినిమాల ఎంపికలే అని చాలామంది భావిస్తున్నారు. ఒకప్పుడు ప్రయోగాత్మక పాత్రలు, విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగార్జున, ఇప్పుడు ఎక్కువగా సేఫ్ జోన్ సినిమాలకే పరిమితమవుతున్నారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తన కెరీర్‌ను సోగ్గాడే చిన్నినాయనాతో ఘనంగా ప్రారంభించారు. ఆ సినిమా సూపర్ హిట్‌గా నిలిచి, నాగార్జునకు చాలా ఏళ్ల తర్వాత పెద్ద విజయం అందించింది. ఆ తర్వాత నాగచైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం తీసి మరో హిట్ అందుకున్నారు. అయితే అక్కినేని కుటుంబం బయటకు వచ్చి రవితేజతో చేసిన నేల టికెట్ బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఈ పరాజయం తర్వాత మళ్లీ అక్కినేని క్యాంప్ వైపే కళ్యాణ్ కృష్ణ వెళ్లాల్సి వచ్చింది.

Advertisement

అంతకుముందు వచ్చిన బంగార్రాజు సంక్రాంతికి విడుదలై, భారీ అంచనాల మధ్య కేవలం సగటు ఫలితంతో సరిపెట్టుకుంది. ఈ సినిమా కూడా నాగార్జునకు ఆశించిన స్థాయిలో పేరు తెచ్చిపెట్టలేదనే భావన అభిమానుల్లో ఉంది. తర్వాత చిరంజీవితో బ్రో డాడీ రీమేక్ ప్రయత్నాలు జరిగినా, అవి ముందుకు సాగలేదు.

ఇప్పుడు మళ్లీ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో వసివాడి తస్సడియ్యా అనే కొత్త సినిమా ప్రకటించారు. ఇందులో నాగార్జున, నాగచైతన్య కలిసి నటించనున్నారని సమాచారం. 2027 సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ వార్త అభిమానులను పెద్దగా ఉత్సాహపరచలేదు. ఎందుకంటే ఇది కూడా పాత స్టైల్ ఎంటర్‌టైనర్‌లానే ఉందని వారు భావిస్తున్నారు.

Advertisement

ఇదిలా ఉండగా, నాగార్జున ధురంధర్లో ఒక కీలక పాత్రను వదిలేసుకున్నారనే వార్తలు కూడా చర్చకు దారి తీసాయి. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వడం, ఆ పాత్రకు మంచి పేరు రావడం అభిమానుల్లో మరింత నిరాశను పెంచింది. ఇప్పుడు 100వ సినిమా కూడా రీమేక్ కావడం, కొత్త సినిమా కూడా పెద్ద ప్రయోగంగా లేకపోవడం వల్ల, నాగార్జున స్క్రిప్ట్ ఎంపికపై మళ్లీ ఆలోచించాలా.. అలానే నాగార్జునకి మరికొన్ని ఫ్లాపులు తప్పవా..అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వాణిజ్యంగా సినిమాలు ఆడినా, అభిమానుల మనసు గెలవడం ఇప్పుడు ఆయనకు అసలు సవాల్‌గా మారింది.

ALSO READ: Dhanush: రెండు బయోపిక్స్ ఒకేసారి చెయ్యడానికి సిద్ధమైపోయిన సౌత్ స్టార్ హీరో.. సాధ్యమేనా..?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×