E-Paper
Advertisement

CM Chandrababu: గుండాలు, రౌడీలతోనే మన యుద్ధం.. అప్రమత్తంగా ఉండండి.. తమ్ముళ్లకు సీఎం చంద్రబాబు హెచ్చరిక!

CM Chandrababu: గుండాలు, రౌడీలతోనే మన యుద్ధం.. అప్రమత్తంగా ఉండండి.. తమ్ముళ్లకు సీఎం చంద్రబాబు హెచ్చరిక!
Advertisement

CM Chandrababu: సాధారణ ఎన్నికలే కాదు, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అందులోభాగంగా మంత్రులు, ఎమ్మెల్యే లపై పూర్తిస్థాయిలో నమ్మకం లేక… పార్టీ అధినేత చంద్రబాబు పార్లమెంటరీ కమిటీని రంగంలోకి దించారంటున్నారు. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం పార్లమెంటరీ కమిటీ ఏది చెప్తే అది చేయాల్సిందేనా?..అంతలా బాధ్యతలు పార్లమెంటరీ కమిటీలకు బాధ్యతులు కట్టబెట్టడానికి ఇవ్వడానికి కారణం 2029లో జరగునున్న సార్వత్రిక ఎన్నికలేనా? అసలు టీడీపీ వర్క్ షాప్‌లో సీఎం చంద్రబాబు తన వారికి సీరియస్ వార్నింగ్ ఇవ్వడానికి కారణాలేంటి?

నియోజకవర్గాల పనితీరుపై ఫోకస్

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి బాధ్యతులు నిర్వర్తిస్తూనే పార్టీ కార్యాలయానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రతి వారంలో ఒక రోజు కేంద్ర కార్యాలయానికి వచ్చి ప్రజల అర్జీలు స్వీకరిస్తూ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, అలాగే పార్టీ బలోపేతం కోసం పని చేస్తున్న టీడీపీ నాయకులపై ఆరా తీస్తున్నారట.. నేతలు సరిగా పని చేయని నియోజకవర్గంలో అవసరమైతే మార్పులు చేర్పులు చేయటానికైన సిద్దమని సంకేతాలు పంపిస్తున్నారంట..

పార్టీ బలోపేతానికి కొత్త వ్యూహాలు..

Advertisement

పార్లమెంటరీ కమిటీ లో ఉన్న వారందరూ ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి, తీసుకొస్తున్న పెట్టుబడుల పై తెలియచేసేలా వ్యవహారించాలని సీఎం చంద్రబాబు సూచిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి సీఎం చంద్రబాబు పాలన పై దృష్టి పెడుతూ, గ్రౌండ్ లెవెల్‌లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది పథకాలను ప్రజలకు చేరవేసేలా నాయకులను, క్యాడర్‌ను అప్రమత్తం చేస్తూ, పార్టీ బలోపేతానికి వ్యూహాలు రచిస్తున్నారు.

పనితీరు సరిగా లేకపోతే పక్కన పెడతా

స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సాధారణ ఎన్నికల్లో పని చేసిన విధంగా సమన్వయంతో ముందుకు సాగాలని టీడీపీ కార్యకర్తలకి సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేస్తున్నారు.. టీడీపీ పార్లమెంటరీ కమిటీ వర్క్‌షాప్‌లో సీఎం చంద్రబాబు ప్రతి ఒక్కరికి సీరియస్‌గా పని చేయాలని సూచిస్తున్నారు.. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులకు సైతం పార్లమెంటరీ కమిటీ చెప్పిందే ఫైనల్ అంటున్నారట.. పని తీరు సరిగా లేకపోతే తప్పనిసరిగా పీకి పక్కన పెట్టేస్తానని ఘాటైన వార్నింగులు ఇస్తున్నారట.. పోరాడేది ప్రతిపక్ష పార్టీతో కాదు రౌడీలతో, గుండాలతో అని ఆయన పార్లమెంట్ వర్క్‌షాప్‌లో వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి.. పార్టీ శ్రేణులకు సీఎం క్లాస్

Advertisement

స్థానిక ఎన్నికలని సాధారణ ఎన్నికల కంటే ఎంతో ప్రతిష్టత్మకంగా టీడీపీ భావిస్తుందట. అందుకే సాధారణ ఎన్నికల్లో ఏవిధంగా కష్టపడి పని చేసారో అంతే రెట్టింపు ఉత్సాహం తో పని చేయాలనీ సీఎం చంద్రబాబు పార్టీ క్యాడర్ కి పిలుపునిస్తున్నారు.. వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం పై చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పి కొడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పనులు అలాగే అభివృద్ధి ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ వర్క్ షాప్ లో పలు సూచనలు చేసారంట.. అంతే కాదు మంత్రులు, ఎమ్మెల్యే లు ప్రజల్లో తిరుగుతూ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకి తెలియచేయాలని వర్క్ షాప్‌లో క్లాస్ తీసుకున్నారని సమాచారం..

టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక

నేతలు ఏ స్థాయి వారైన పని తీరు సరిగా లేకపోతే మార్పులు చేర్పులు చేయటంలో ఏ మాత్రం ఆలస్యం ఉండదని స్పష్టంగా చెప్తున్నారంట. ప్రతి 3నెలల కొకసారి టీడీపీ నాయకుల పని తీరు పై నివేదిక తెప్పించుకుంటానని, సరిగా పని చేయకపోతే పక్కన పడేస్తా నని వర్క్ షాప్ లో ఘాటైన వ్యాఖ్యలు చేశారట సీఎం చంద్రబాబు… దాంతో వచ్చే ఎన్నికల్లో కూడా కూటమి విజయం సాదించాలంటే ఇప్పడి నుంచే వ్యూహాలు అమలు చేసే దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.

2029 లక్ష్యంగా చంద్రబాబు మాస్టర్ ప్లాన్…

2029 ఎన్నికల్లో అధికారం చేజారకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పని చేయాలని, తెలుగు తమ్ముళ్ళకి దిశా నిర్దేశం చేశారట. గతంతో వైసీపీ ప్రభుత్వంఅమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రచారం చేసుకోవడంతో విఫలం అయ్యారన్న టాక్ ఉంది. కానీ చంద్రబాబు మాత్రం అలాంటి తప్పులకి అవకాశం ఇవ్వకుండా గ్రౌండ్ లెవెల్ ల్లోకి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలానే ఉద్దేశంతో పార్లమెంటరీ కమిటీలు, జిల్లా కమిటీలు, మండల కమిటీలు నియమిస్తున్నారట… ప్రస్తుతం ఉన్న మంత్రులు, ఎమ్మెల్యే లపై ఆధారపడకుండా పార్టీ కమిటీ లు నియమించి ప్రజల్లోకి చొచ్చుకెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారంట.. మరి చంద్రబాబు వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.

Also Read: స్కూల్ బస్సును ఢీకొన్న ట్రాక్టర్.. ఒకరు మృతి, విద్యార్థులకు గాయాలు

Story by: Apparao, Big Tv

Related News

అసెంబ్లీని బ‌హిష్క‌రించిన మాజీ సీఎంలు.. ప్ర‌తిన‌ బూని మ‌ళ్లీ సీఎంగానే అడుగుపెట్టి.. ! జ‌య‌లలిత ఎపిసోడ్ టోట‌ల్ డిఫ‌రెంట్‌..

తెలుగు రాష్ట్రాల్లో షాకింగ్ పొలిటికల్ హిస్టరీ.. కేబినెట్ నుంచి బర్తరఫ్‌ అయిన మంత్రుల పూర్తి లిస్ట్ ఇదే!

బ‌ర్త‌ర‌ఫ్ వేడి చ‌ల్లారిన త‌రువాతే.. విస్త‌ర‌ణ‌! ఆశావహులకు ఇంకా హ‌స్తిన‌ ద్వారాలు తెరిచే ఉన్నాయి..!

కొండా సురేఖపై వేటుతో షాక్ తిన్న కీలక నేతలు.. సీఎం రేవంత్ నెక్ట్స్ ప్లాన్ ఇదేనట..?

ప‌నిచేయ‌ని బీసీ కార్డు.. కరువైన సానుభూతి.. ఆదుకోని మ‌హిళా బీసీ నేత కోటా… ఆ కుటుంబంపై అంత‌టా వ్య‌తిరేక‌తే.. ఎందుకు?

టంగ్ స్లిప్ప‌వుతుందా? ఓట‌మిని ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారా? జ‌నాల‌ను కించ‌ప‌రిచేలా ఈ మాట‌లేలా?

ఆది నుంచి త‌ప్పట‌డుగులే.. వివాదాలే ఆమె దారి? ఇదీ కొండా సురేఖ వైఖరి!

ఇకపై అసమ్మతి గళాలకు బ్రేకులు… పరిపాలన పై రేవంత్ సర్కార్ మరింత పట్టు..

Big Stories

Advertisement
×