Murder Mysteries ott : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి సినిమాలలో ఉండే వరుస ట్విస్టులు ఇచ్చే కిక్కు అలాంటిది మరి. మీకు కూడా అలాంటి సినిమాలంటే పిచ్చా ? అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీస్ మీ కోసమే. సస్పెన్స్‌తో నిండి ఉన్న ఆ క్రేజీ సినిమాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
కీగో హిగాషినో రాసిన “ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్” నవల ఆధారంగా రూపొందిన మూవీ ఇది. కరీనా కపూర్ ఖాన్, జైదీప్ అహ్లవత్, విజయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన “జానే జాన్” మూవీ ఒక మర్డర్ మిస్టరీ ఆధారంగా సాగుతుంది. 2023లో డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియర్ అయిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఒక్కో ట్విస్టుతో మెంటలెక్కించే ఈ చిత్రానికి IMDbలో 7.0 రేటింగ్ ఉండడం విశేషం. ఒకవేళ ఇంకా ఈ సినిమాను చూడకపోతే వెంటనే ఒక లుక్కేయండి.
1969లో వచ్చిన క్లాసిక్ సినిమాకి రీమేక్ ‘ఇత్తేఫాక్’. ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో సిద్ధార్థ్ మల్హోత్రా, సోనాక్షి సిన్హా, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కథ మొత్తం ఒకే రాత్రి చుట్టూ తిరుగుతుంది. మర్డర్, దానికి సంబంధించిన సాక్ష్యం, అనుమానం, దర్యాప్తు వంటి అంశాలతో ఆశక్తికరంగా కథ సాగుతుంది. చివరి వరకు ఉత్కంఠను కొనసాగిస్తూ ఆడియన్స్ కు సీట్ ఎడ్జ్ థ్రిల్ ఫీలింగ్ ను ఇస్తుంది ఈ మూవీ. నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న ఈ సినిమాకి IMDbలో 7.2 రేటింగ్ ఉంటుంది.
నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే కలిసి నటించిన క్రైమ్ థ్రిల్లర్ “రాత్ అకేలి హై”. ఈ కథ కాన్పూర్ లోని రిచ్ ఫ్యామిలీలలో ఒకటైన బన్సల్ కుటుంబం, అతని పెళ్లి రాత్రి ఆ ఇంట్లో జరిగిన హత్య చుట్టూ తిరుగుతుంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ కేసును దర్యాప్తు చేసే పోలీసు అధికారిగా కన్పించారు. ప్రేమ, దురాశ, కుటుంబ కలహాల చుట్టూ తిరిగే ఈ చిత్రానికి IMDbలో 7.5 రేటింగ్ ఉంది.
టబు, అలీ ఫజల్ మరియు వామికా గబ్బి నటించిన థ్రిల్లర్ “ఖుఫియా”, రాజద్రోహం ఆధారంగా రూపొందించబడిన స్పై థ్రిల్లర్. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ స్థాయిలో సెట్ చేయబడింది, కానీ దాని కథాంశం “స్లాటర్”ని పోలి ఉంటుంది. ఈ సినిమా కథ నమ్మకం, విధేయత మరియు త్యాగంపై కేంద్రీకృతమై ఉంది. ఈ సినిమా IMDb రేటింగ్ 6.1.
ఇక ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో సందడి చేస్తున్న కొత్త మర్డర్ మిస్టరీ “వధ్ 2”. ఈ మూవీని గనుక చూడాలని ప్లాన్ చేస్తుంటే, అంతకంటే ముందుగా “వధ్” చూసేయండి. జస్పాల్ సింగ్ సంధు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంజయ్ మిశ్రా, నీనా గుప్తా వృద్ధ దంపతులుగా నటించారు. తమ కొడుకును చదువు కోసం విదేశాలకు పంపి అప్పుల్లో కూరుకుపోయిన ఈ దంపతులు భయంకరమైన పరిస్థితులలో తమ జీవితాలను గడపవలసి వస్తుంది. అలాంటి సిట్యుయేషన్ లో వాళ్ళు ఏం చేశారన్నదే కథ. ఈ చిత్రానికి IMDb రేటింగ్ 7.2 ఉండడం విశేషం.
Also Read : తమ్ముడి చావుకి అన్న రివేంజ్… గ్యాంగ్ వార్ తో దద్దరిల్లే కొరియన్ క్రైమ్ థ్రిల్లర్