E-Paper
Advertisement

Spirit: విజయ్ ని కాపీ కొడుతున్న ప్రభాస్.. సెట్ అవుతుందా.. ?

Spirit: విజయ్ ని కాపీ కొడుతున్న ప్రభాస్.. సెట్ అవుతుందా.. ?
Advertisement

Spirit: పాన్  ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ఐదు సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయి. ఏ ముహూర్తాన ఆదిపురుష్ సమయంలో ప్రభాస్ అభిమానులకు మాట ఇచ్చాడో..  ఆ మాటను చాలా సీరియస్ గా  తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏడాదికి ఒక సినిమా ఖచ్చితంగా రిలీజ్ చేస్తాను అని చెప్పిన విషయాన్ని ప్రభాస్ ఈ రేంజ్ లో సీరియస్ గా  తీసుకుంటాడని అభిమానులు అనుకోలేదు. కానీ ఇచ్చిన మాట కోసం రాజుగారు నిలబడతారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఒకపక్క ది రాజా సాబ్ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది.

ఇది కాకుండా ఇప్పటికే హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఫౌజీ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లిపోయాడు. అది కూడా సగానికి వచ్చేసిందని సమాచారం. ఇక ఈ రెండు సినిమాలు కాకుండా ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం స్పిరిట్. యానిమల్ సినిమాతో బాలీవుడ్ ని గడగడలాడించిన సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన విషయం తెలిసిందే. ఇక ఆగస్టు.. సెప్టెంబర్.. అక్టోబర్ అనుకుంటూ ఎట్టకేలకు నవంబర్ లో  స్పిరిట్ పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి సందీప్ రెడ్డి వంగాకు బెస్ట్ విషెస్ తెలిపారు.

Advertisement

ఇక ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఏ వార్త వచ్చినా కూడా ఇట్టే వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే. ఇక ఏఐ వచ్చాక ఏ ఫోటో ఒరిజినలో..  ఏ ఫోటో ఫేకో  అన్న విషయం తెలియడం చాలా కష్టం అని చెప్పొచ్చు. గత రెండు మూడు రోజుల నుంచి స్పిరిట్ లో ప్రభాస్ లుక్ ఇదే అంటూ ఒక ఏఐ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆ ఫోటో చూసిన ప్రతి ఒక్కరూ ప్రభాస్.. విజయ్ దేవరకొండ ను ఫాలో అవుతున్నాడు అంటూ మాట్లాడుకుంటున్నారు.

కింగ్డమ్ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక లుక్ తో కనిపించిన విషయం తెలిసిందే. జుట్టు మొత్తం కట్ చేసుకుని గుండుతో కనిపించాడు. ఇప్పుడు ప్రభాస్ కూడా స్పిరిట్ లో ఇలానే కనిపిస్తాడు అంటూ కొందరు చెప్పుకొస్తున్నారు. అయితే అందులో నిజం లేదు అని ఫాన్స్ క్లారిటీ ఇస్తున్నారు. అది ఏఐ ఫోటో అని తేల్చి చెప్తున్నారు. నిజం చెప్పాలంటే ప్రభాస్ ఆ లుక్ లో కనిపించడం చాలా కష్టం అని అందరికీ తెలుసు . ఎందుకంటే ప్రభాస్ హెయిర్ ఒరిజినల్ కాదు అని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయాలి అంటే ఒరిజినల్ హెయిర్ అయినా అయి ఉండాలి లేకపోతే హెయిర్ ని  అయినా పెట్టి ఉండాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్ కావడంతో ప్రభాస్ దీనికి ఒప్పుకొని ఉండడు అని టాక్. దీంతో ప్రభాస్ స్పిరిట్ లుక్ ఇది కాదు అని నెటిజెన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెత నీది తెలియాల్సి ఉంది.

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×