E-Paper
Advertisement

Spirit Release : సందీప్ రెడ్డి షాకింగ్ డెసిషన్… సంక్రాంతి బరిలో ప్రభాస్ మూవీ

Spirit Release : సందీప్ రెడ్డి షాకింగ్ డెసిషన్… సంక్రాంతి బరిలో ప్రభాస్ మూవీ
Advertisement

Spirit Release: ప్రభాస్ (Prabhas)అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న స్పిరిట్ సినిమా(Spirit Movie) నుంచి వరుస అప్డేట్స్ బయటకు రావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సందీప్ రెడ్డి (Sandeep Reddy) డైరెక్షన్లో సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ కూడా ప్రకటించారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక రెండు రోజులలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది.

స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ ..

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి. మరొక రెండు రోజులలో షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో చిత్ర నిర్మాతలు ఈ సినిమా విడుదల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమాని 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలని ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కు సౌత్ ఇండస్ట్రీలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో స్పిరిట్ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నామంటూ టి సిరీస్ బ్యానర్ అధినేత భూషణ్ కుమార్ తెలిపారు.

2027 సంక్రాంతి రిలీజ్..

Advertisement

ఇక త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే 2027 సంక్రాంతిని టార్గెట్ చేస్తూ ఈ సినిమా విడుదల తేదీ గురించి ఇప్పుడే అనౌన్స్ చేయడంతో ప్రభాస్ అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రభాస్ ది రాజా సాబ్(The Rajasaab) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జనవరి 9వ తేదీ విడుదల కానుంది. ఇక 2026వ సంవత్సరంలోనే హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ నటించిన ఫౌజీ(Fauzi) సినిమా విడుదల కానుంది.

రాజా సాబ్ ప్రమోషన్లలో బిజీగా..

Advertisement

ఈ సినిమా 2026 ఆగస్టులో విడుదల కాబోతోందని వార్తలు వస్తున్నాయి. 2027లో స్పిరిట్ సినిమా రాబోతుందనే విషయం తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ఇలా ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతూ మరోవైపు వరుస సినిమాలను విడుదల చేయటం విశేషం. ఇప్పటికే ఫౌజీ 70 శాతం షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది. ఇక త్వరలోనే ఈ సినిమాతో పాటు స్పిరిట్ పనులలో కూడా ప్రభాస్ బిజీ కానున్నారు. ఇక రాజాసాబ్ జనవరి 9వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో కూడా బిజీ కానున్నారు.

Also Read: Mahavatar Narasimha: ఇట్స్ అఫీషియల్.. ఆస్కార్ రేసులో మహావతార్ నరసింహ..

Related News

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

Big Stories

Advertisement
×