E-Paper
Advertisement

AA22xA6 Title : బన్నీ మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్.. అట్లీ ఏ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నాడంటే?

AA22xA6 Title : బన్నీ మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్.. అట్లీ ఏ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నాడంటే?
Advertisement

AA22xA6 : టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాడు.. గతంలో చేసిన సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. కానీ పుష్ప సినిమా మాత్రం అతని క్రేజ్ ను పదింతలు పెంచేసింది. గత ఏడాది వచ్చిన పుష్ప మూవీ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం తమిళ డైరెక్టర్ అట్లీ తో సినిమా చేస్తున్నాడు బన్నీ.. ఈ మూవీ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాతో ఎలాగైనా సరే గొప్ప గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ టైటిల్ ను త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ ఈవెంట్ నిర్వహించి టైటిల్ ను అనౌన్స్ చేసేందుకు అట్లీ ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఈవెంట్ పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం..

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్.. 

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమాలు కావడంతో ఈ మూవీ పై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అట్లీ సినిమాలు కమర్షియల్ హిట్ అవ్వడంతో ఈ మూవీ బ్లాక్ బాస్టర్ పక్కా అని ఆయన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సినిమా షూటింగ్ దాదాపు సగం పూర్తి అయ్యింది. కానీ ఇప్పటివరకు టైటిల్ ను అనౌన్స్ చెయ్యలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ ను రాజమౌళి లాగే గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించి రీవిల్ చెయ్యనున్నారట. డైరెక్టర్ అట్లీ ప్లాన్ దాదాపు వర్కౌట్ అయ్యింది. ఈ ఈవెంట్ వివరాలను త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి..

AA22 షూటింగ్ అప్డేట్.. 

Advertisement

అట్లీ, అల్లు అర్జున్ కాంబోలో మూవీ మొదలై చాలా రోజులైంది. సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. అట్లీ ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని తన అభిమానులు సైతం ఆయన్ని హెచ్చరిస్తున్నారు.. భారీ యాక్షన్ సీన్స్ ఉండటంతో హాలీవుడ్ టెక్నీషియన్స్ తో ఈ సినిమాకి పనులను చేయించుకుంటున్నారట. ఇప్పటివరకు 50% షూటింగ్ కంప్లీట్ చేసిన అట్లీ తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ షెడ్యూల్ ను చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట.. అట్లీ అనుకున్నట్టుగానే ఈ సినిమాతో కనక విజయాన్ని సాధిస్తే మాత్రం అట్లీ కూడా పాన్ ఇండియాలో టాప్ డైరెక్టర్ గా మరోసారి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నట్లే.. చూడాలి ఈ మూవీతో అతని లైఫ్ ఎలా టర్న్ అవుతుందో..

Also Read : రణరంగం ముగిసిపోనుంది.. చివరి కెప్టెన్సీ టాస్క్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

పుష్ప 3.. 

Advertisement

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో పుష్ప సిరీస్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా మూడో పార్ట్ రాబోతుందని టాక్ నడుస్తుంది. త్వరలోనే ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుంది..

 

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×