E-Paper
Advertisement

Peddi Movie: మెగా ఫ్యాన్స్ కు షాక్.. పెద్ది మళ్లీ వాయిదా పడనుందా ?

Peddi Movie: మెగా ఫ్యాన్స్ కు షాక్.. పెద్ది మళ్లీ వాయిదా పడనుందా ?
Advertisement

Peddi Movie:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత సోలో హీరోగా చేసిన సినిమా గేమ్ ఛేంజర్.ఈ చిత్రం పెద్దగా విజయాన్ని అందుకోలేదు. దీంతో ఎలాగైనా సరే మళ్లీ మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు రామ్ చరణ్.. అందులో భాగంగానే ‘ఉప్పెన’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకొని అందరి దృష్టిని తన వైపుకి లాగేసుకున్న యంగ్ డైరెక్టర్ బుచ్చి బాబు సన (Bucchibabu Sana) దర్శకత్వంలో ‘పెద్ది’ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నప్పటికీ.. తెలంగాణాలో టికెట్ ధరల పెంపుకు 90 రోజుల నిబంధన వెలుగులోకి రావడంతో సినిమాను వాయిదా వేశారు. అలా మార్చి 27న రావాల్సిన సినిమా కాస్త ఏప్రిల్ 30కి వాయిదా పడింది.

పెద్ది మూవీ మళ్లీ వాయిదా పడనుందా?

ఇకపోతే మేకర్స్ కూడా ఈ రిలీజ్ డేట్ ని వదులుకోకూడదని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కానీ మరొకవైపు ఈ సినిమా వాయిదా పడబోతోంది అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. షూటింగు, పోస్ట్ ప్రొడక్షన్, సీజీ వర్క్ తో పాటు ఇంకా కొన్ని పాటల షూట్ మిగిలి ఉన్న నేపథ్యంలోనే ఏప్రిల్ 30న ఈ సినిమా రావడం కష్టమని అటు విశ్లేషకులు కూడా తేల్చేస్తున్నారు. ఇకపోతే పెద్ది సినిమా మిగిలిన షూటింగ్ పార్ట్ ను వేగంగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తోంది చిత్ర బృందం. అటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్నారు. ఇకపోతే ఏప్రిల్ 30వ తేదీన ఈ సినిమాను తీసుకురావాలని చూస్తున్నప్పటికీ ఇలాంటి ఇతర కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడుతోందనే కామెంట్లు గట్టిగా వినిపిస్తూ ఉండడం గమనార్హం . ఏది ఏమైనా ఒకవేళ పెద్ది మళ్ళీ వాయిదా పడితే మాత్రం అభిమానులకు తీరని నిరాశ ఎదురైనట్లే అని చెప్పాలి.

తెరపైకి కొత్త డేట్..

Advertisement

మరోవైపు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఒకవేల పెద్ది సినిమా గనుక వాయిదా పడితే.. ఈ చిత్రాన్ని మే7 తేదీన రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

పెద్ది రిలీజ్ డేట్ పై మీడియం రేంజ్ మూవీల టార్గెట్..

ఇదిలా ఉండగా మరొకవైపు మీడియం రేంజ్ సినిమాలు పెద్ది రిలీజ్ డేట్ ను టార్గెట్ చేస్తున్నాయి. ఒకవేళ పెద్ది అనుకున్న సమయానికి రాకపోతే తమ సినిమాకు ప్లస్ అవుతుందని ఆలోచించే సినిమా బృందాలు కూడా లేకపోలేదు. ఇప్పటికే తరుణ్ భాస్కర్ సినిమా గాయపడ్డ సింహం మే 1న రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. పైగా ఈ సినిమా హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. దిల్ రాజు తమ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు అంటే పెద్ది రిలీజ్ డేట్ పై అనుమానాలు ఉన్నట్టే లెక్క .అందుకే పెద్ది రావట్లేదన్న స్పష్టమైన సమాచారం దిల్ రాజు దగ్గర ఉందని అందుకే తన గాయపడ్డ సింహం చిత్రాన్ని బరిలోకి దించుతున్నారని ఊహాగానాలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి .ఏది ఏమైనా పెద్ది సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇలాంటి వార్తలు మింగుడు పడడం లేదు.

Advertisement

ALSO READ: Tollywood: పోసాని సినిమా వల్లే అవకాశాలు కోల్పోయా.. ప్రముఖ నటి కామెంట్!

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×