E-Paper
Advertisement

Tollywood: పోసాని సినిమా వల్లే అవకాశాలు కోల్పోయా.. ప్రముఖ నటి కామెంట్!

Tollywood: పోసాని సినిమా వల్లే అవకాశాలు కోల్పోయా.. ప్రముఖ నటి కామెంట్!
Advertisement

Tollywood:సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు సెలబ్రిటీలు చేసే పాత్రలు మంచి పేరు తెచ్చి పెట్టినా.. ఆ తర్వాత కాలంలో అవే పాత్రలు ఎక్కువగా రావడం లేదా ఆ పాత్రలలో అవకాశాలు లభించక.. వేరే పాత్రలు లేక సినిమా అవకాశాలు కోల్పోయిన వారు కూడా లేకపోలేదు. అలాంటి వారిలో తాను కూడా ఒకరు అని చెప్పుకొచ్చింది ప్రముఖ నటి సత్యా కృష్ణన్ (Sathya krishnan) పోసానితో ‘మెంటల్ కృష్ణ’ సినిమా చేసి మంచి పేరు దక్కించుకుంది. అయితే ఈ సినిమా తర్వాతే తనకు అవకాశాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేసింది నటి సత్యా కృష్ణన్.

ఆ సినిమా వల్లే ఆఫర్లు తగ్గిపోయాయి..

అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన కెరియర్ గురించి మాట్లాడుతూ..” మెంటల్ కృష్ణ సినిమాతో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నేను.. అదే నా కెరియర్ కు మైనస్ అవుతుందని అనుకోలేదు. ఈ సినిమా తర్వాత నిర్మాతలు నన్ను కేవలం మెయిన్ రోల్స్ కోసమే సంప్రదించారు. ఇక అలా నేను మెయిన్ రోల్స్ మాత్రమే చేస్తానని వారు పరిగణించడం వల్లే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఓటీటీ ప్రాజెక్టులలో సరికొత్త విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నాను. భవిష్యత్తులో దసరా వంటి సినిమాలలో మాస్ పాత్రలు, రగ్గడ్ లుక్స్ లో నటించాలని ఉంది. అటు శ్రీకాకుళం యాస కష్టమైనా.. తెలంగాణ యాసను కొంతవరకు మేనేజ్ చేయగలను. మాస్ క్యారెక్టర్లు చేయడానికి పూర్తిగా ఇష్టమే. అలాంటి పాత్రల కోసమే చూస్తున్నాను అంటూ సత్యా కృష్ణన్ తెలిపింది. మొత్తానికైతే ఇప్పుడు తాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధమేనని చెప్పిన ఈమె.. ఈ మాటలతో దర్శక నిర్మాతలు ఆఫర్లు ఇస్తారో లేదో చూడాలి.

సత్యా కృష్ణన్ సినిమా కెరియర్..

Advertisement

సత్యా కృష్ణన్ విషయానికి వస్తే.. హైదరాబాదులో తన చదువును పూర్తి చేసిన ఈమె హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో ఉద్యోగంలో చేరిన సత్య ఎయిర్ హోస్టెస్ కావాలనుకుంది. కానీ హోటల్ మేనేజ్మెంట్ లో ప్రొఫెషనల్ గా పనిచేస్తున్న ఈమెను డైరెక్టర్ శేఖర్ కమ్ముల చూసి తన మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్ ద్వారా వెండితెరకు పరిచయం చేశారు. ఇక ఈ సినిమా తర్వాత ఆమె వివాహం చేసుకొని పంజాగుట్టలోని ఒక బ్యాంకు ఉద్యోగంలో చేరింది. నాలుగేళ్ల తర్వాత మళ్లీ శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాకు ఈమెకు ఉత్తమ సహాయక నంది అవార్డు కూడా లభించింది. ఇక దాంతో ఉద్యోగాన్ని వదిలిపెట్టి పూర్తిస్థాయి నటిగా మారిపోయింది సత్య.

ALSO READ:Ranya Rao: 100 కోట్ల గోల్డ్ స్మగ్లింగ్.. ఈమె అతి తెలివి చూస్తే షాక్!

సత్యా కృష్ణన్ సినిమాలు..

Advertisement

అలా బొమ్మరిల్లు, మొదటి సినిమా, వినాయకుడు లాంటి చిత్రాలలో నటించి తనకంటూ మంచి పేరు సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మళ్లీ సరైన అవకాశం కోసం ఎదురుచూస్తోంది ఈ ముద్దుగుమ్మ. మరి ఇప్పటికైనా ఈమెకు సరైన అవకాశం ఎప్పుడు తలుపు తడుతుందో చూడాలి.

Related News

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

Big Stories

Advertisement
×