E-Paper
Advertisement

Rukmini Vasanth: ప్రేమలో రుక్మిణి వసంత్… ఒక్క ఫోటోతో కుర్రకారులకు షాక్ ఇచ్చిన బ్యూటీ!

Rukmini Vasanth: ప్రేమలో రుక్మిణి వసంత్… ఒక్క ఫోటోతో కుర్రకారులకు షాక్ ఇచ్చిన బ్యూటీ!
Advertisement

Rukmini Vasanth: రుక్మిణి వసంత్ పరిచయం అవసరం లేని పేరు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. సప్త సాగరాలు దాటి అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రుక్మిణి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. ఇకపోతే ఇటీవల కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టితో కలిసి నటించిన కాంతారా చాప్టర్ 1 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా రుక్మిణి కెరియర్ ను కీలక మలుపు తిప్పిందని చెప్పాలి.

రిలేషన్ లో కాంతార బ్యూటీ..

తన నటన, అందంతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పించిన రుక్మిణి వసంత్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా ఈమె ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న రుక్మిణి వసంత్ అంటే ఎంతో మంది అబ్బాయిలకు క్రష్ గా మారిపోయారు అయితే తాజాగా ఈమెకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన కుర్రకారులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈ ఫోటో చూసిన అభిమానులు ఈమె రిలేషన్ లో ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఎవరీ సిద్ధాంత్ నాగ్..

Advertisement

తాజాగా రుక్మిణి వసంత్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .ఇందులో భాగంగా ఈమె మరో వ్యక్తితో చాలా చనువుగా ఉంటూ తనతో దిగిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు రుక్మిణి వసంత్ తో చనువుగా ఉన్న అబ్బాయి ఎవరు అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే సోషల్ మీడియాలో ఆయన పేరు సిద్ధాంత్ నాగ్ (Siddanth Nag)అని ఉంది. ఇలా ఈ ఫోటో వైరల్ అవ్వడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారా? లేక ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉందా? అంటూ పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు.

ఎన్టీఆర్ డ్రాగన్..

Advertisement

ఇలా రుక్మిణి వసంత్ రిలేషన్ లో ఉన్నారనే విషయం తెలిసిన అభిమానులు షాక్ అవుతూ బ్రోకెన్ హార్ట్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. మరి ఈ సిద్ధాంత్ నాగ్ ఎవరనేది తెలియాలి అంటే ఈ విషయంపై రుక్మిణి వసంత్ స్పందించాల్సి ఉంది. ఇక రుక్మిణి కెరియర్ విషయానికి వస్తే ఈమె ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి డ్రాగన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు కేజీఎఫ్ నటుడు యశ్ టాక్సిక్ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా రుక్మిణి వసంత్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇలాంటి సమయంలోనే ఈమె ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తన వ్యక్తిగత విషయానికి సంబంధించి కూడా ఈ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

Alsop Read: Sara Arjun: ఆ టాలీవుడ్ హీరో పై కన్నేసిన ధురంధర్ బ్యూటీ.. ఎవరంటే?

Related News

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

Big Stories

Advertisement
×