E-Paper
Advertisement

BRS : బీఆర్ఎస్‌లో మారీచ సుబాహులు.. వీరి గురువు ఎవరంటే?

BRS : బీఆర్ఎస్‌లో మారీచ సుబాహులు.. వీరి గురువు ఎవరంటే?
Advertisement

మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్ హీట్‌ను పెంచుతున్నాయి. అధికార కాంగ్రెస్ ఇప్పటికే పురపోరుపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రతిపక్షాలు సైతం మున్సిపల్ ఎన్నికలపై ప్రధానంగా దృష్టిసారించాయి.వచ్చే వారం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కానుంది. ఇప్పటికే వార్డుల వారీగా ఓటరు జాబితా.. రిజర్వేషన్లు సైతం ఖరారు అయ్యాయి. ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఈ ఎన్నికల బాధ్యతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రులకు అప్పగించడంతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు సైతం ఎన్నికల్లో ఏం చేయాల్సిన పనులపై ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తున్నది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కో పార్టీ ఒక్కో నినాదంతో ముందుకు వెళ్లాలని చూస్తున్నట్టు సమాచారం.

రాక్షసుల్లా అడ్డుతగులున్నారు..

ముందుగా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్‌ను టార్గెట్‌గా ఎంచుకున్నది. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనికి రాక్షసుల వలే బీఆర్ఎస్ నేతలు అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఆదిలాబాద్ సభలో నిర్వహించిన ‘ప్రజాపాలన, ప్రగతి బాట’ సభలో తీవ్ర విమర్శలు చేశారు. గతంలో రాక్షసులు ఉండేవారని వారి పేరు మారీచుడు, సుబాహు అని.. ప్రస్తుతం వారు అసెంబ్లీలో ప్రభుత్వానికి అడ్డం పడుతున్నారని పరోక్షంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావులను ఉద్దేశించి విమర్శించారు. వీరి గురువు శుక్రాచార్యుడు ఉండేవారని.. ఆయన ప్రస్తుతం ఫాంహౌస్‌లో పడుకున్నారని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ప్రతిపనికి అడ్డంకులే…

Advertisement

ప్రభుత్వం ఏ పని చేపట్టినా ప్రతిపక్ష నేతలు అడ్డుపడుతున్నారని.. మంచి పనికి సలహాలు, సూచనలు ఇవ్వాలని.. ప్రతిదానికి అడ్డుపడితే అభివృద్ధి ఎలా ముందుకు సాగుతుందని సీఎం ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీని ప్రారంభించినప్పుడు రియల్ ఎస్టేట్ కోసమే భూములు పొగేస్తున్నారని అలా విమర్శించారని.. హిల్ట్ పాలసీ విషయంలోనూ అదే రిపీట్ చేశారని అధికార పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. ఇక పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును గత పదేండ్లు పడావు పెట్టిన గత పాలకులు.. ఇప్పుడు తమ ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. రాక్ష్లసులు మాత్రమే ఇలా ప్రతిపనికి అడ్డు పడతారని.. మిగతా వారు ఎవరూ ఇలా చేయరని ఫైర్ అవుతున్నారు.

Naralokesh : పబ్లిసిటీ వద్దంటున్న మంత్రి నారా లోకేష్.. షాక్ అవ్వాల్సిందే!

విమర్శలకేనా ప్రతిపక్షం..

Advertisement

రాజకీయాల్లో అధికారం అనేది ఏ పార్టీకి శాశ్వతం కాదు. ఐదేండ్లు పాలన సరిగా ఉంటే ప్రజలు మరోసారి అధికారపార్టీకి చాన్స్ ఇస్తారు. అదే నచ్చకపోతే వారిని దించేసి ప్రతిపక్షంలో కూర్చోబెడతారు. చరిత్ర మొత్తం ఇదే సీన్ రిపీట్..అలాంటిది అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల మీద విరుచుకపడటం, వారి సలహాలు సూచనలు తీసుకోకుండా నియంత పాలన సాగించిన బీఆర్ఎస్ పార్టీ.. ప్రస్తుతం అధికారానికి దూరమయ్యాక ప్రస్తుత ప్రభుత్వానికి పేరు రాకుండా చేయాలనుకోవడం సరికాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధి, ప్రభుత్వ పాలసీలు, సంక్షేమ పథకాల్లో ప్రజలకు ఏమైనా చెడు జరుగుతున్నదంటే ప్రతిపక్షాలు పోరాటం చేయాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ప్రజలకు అన్యాయం జరగకుండా అడ్డుగోడలా నిలబడాలి. కానీ, మంచి చేసినా అడ్డుతగలడం అనే నియమాన్ని ప్రతిపక్షం పాటించడం సహించరానిదని.. ఇలాంటి సమయంలో వారిని రాక్షసులతోనే పోల్చాల్సి ఉంటుందని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ఇదిలాఉండగా, తమ నేతలను రాక్షసులు అని సీఎం రేవంత్ సంభోదించడాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజ్యాంగాన్ని కాలరాస్తున్న రేవంత్ సర్కార్.. ప్రశ్నిస్తే దూషించడం, అణిచివేయడం చేస్తున్నాడని ఫైర్ అవుతున్నారు.

Related News

బర్తరఫ్ తర్వాత తొలిసారి నోరు విప్పిన కొండా సురేఖ..సీయం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

Big Stories

Advertisement
×