E-Paper
Advertisement

Sara Arjun: ఆ టాలీవుడ్ హీరో పై కన్నేసిన ధురంధర్ బ్యూటీ.. ఎవరంటే?

Sara Arjun: ఆ టాలీవుడ్ హీరో పై కన్నేసిన ధురంధర్ బ్యూటీ.. ఎవరంటే?
Advertisement

Sara Arjun: సారా అర్జున్ ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఈమె పేరు మారుమోగిపోయింది. రణవీర్ సింగ్ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధురంధర్ (Dhurandhar)అనే సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే మరో తెలుగు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమ గుణ నిర్మాణంలో యూఫోరియా(Euphoria) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో భూమిక, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

డ్రగ్స్ నేపథ్యంలో యూఫోరియా..

ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే మాదకద్రవ్యాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. డ్రగ్స్ తీసుకోవడం వల్ల యువత ఎలాంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారనే నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా సారా అర్జున్ తెలుగులో మాట్లాడుతూ అందరిని ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో ఈమె తెలుగు డబ్బింగ్ చెప్పినట్లు కూడా తెలియజేశారు.

విజయ్ దేవరకొండ ఫేవరెట్ హీరో..

Advertisement

ఇలా చక్కగా తెలుగులో మాట్లాడుతున్న ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేవరెట్ హీరో ఎవరు అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు సారా సమాధానం చెబుతూ తనకు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమని తెలియజేశారు. ఇక తెలుగులో ఈమె రెండు సినిమాలు చేయబోతున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు ఒకటి గుణశేఖర్ డైరెక్షన్లో రాబోతున్న యుఫోరియా, అలాగే మరో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో రాబోతున్న మ్యాజిక్ అనే సినిమాలో కూడా నటిస్తున్నట్టు సారా అర్జున్ ఈ సందర్భంగా తెలియజేశారు. విజయ్ దేవరకొండ అంటే తనకు చాలా ఇష్టం అనే విషయాన్ని తెలియచేయడంతో రౌడీ హీరో ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగులో బిజీగా సారా అర్జున్..

Advertisement

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న సారా అర్జున్ ఒక్క సినిమాతో తెలుగులో కూడా అదే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక ఈమె తెలుగు డెబ్యూ మూవీ అయిన యుఫోరియా ద్వారా ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఇక ఒకప్పుడు గుణశేఖర్ సినిమాలు అంటే సినిమా పట్ల మంచి అంచనాలు ఉండేవి కానీ ఇటీవల కాలంలో ఈయన నుంచి వస్తున్న సినిమాలు కాస్త ప్రేక్షకులను నిరాశ పరుస్తున్నాయి. గుణశేఖర్ నీలిమ గుణ కాంబినేషన్లో సమంత నటించిన శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో పెద్దగా సక్సెస్ అందుకో లేకపోయినా ఈ సినిమా అనంతరం యుఫోరియా అనే సినిమా ద్వారా రాబోతున్నారు మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది.

Alaso Read: Anil Sunkara: సినిమా హిట్టయిన సంతోషం లేదు.. అనిల్ సుంకర షాకింగ్ కామెంట్స్!

Related News

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

Big Stories

Advertisement
×