E-Paper
Advertisement

Hebha Patel: రహస్యంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ బ్యూటీ.. ఆ పోస్ట్ కు అర్థం అదేనా?

Hebha Patel: రహస్యంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ బ్యూటీ.. ఆ పోస్ట్ కు అర్థం అదేనా?
Advertisement

Hebha Patel: కుమారి 21 ఎఫ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయమై మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటి హెబ్బా పటేల్(Hebha Patel). ఇలా మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు అనంతరం వరుస సినిమాలలో అవకాశాలు వచ్చాయి కానీ పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. ఇలా సక్సెస్ కోసం ఏకంగా డి గ్లామర్ పాత్రలలో నటించిన పేరు ప్రఖ్యాతులు మాత్రం రాలేదని చెప్పాలి. ఇలా సినిమాలలో సక్సెస్ కోసం నిరంతరం కష్టపడుతున్న హెబ్బా పటేల్ త్వరలోనే ఈషా(Eesha) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

హెబ్బా పటేల్ పెళ్లి చేసుకుందా?

హర్రర్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీన విడుదల కావాల్సి ఉండగా అఖండ 2 విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలా ఈ సినిమా ప్రమోషన్లలో చిత్ర బృందం బిజీగా ఉన్నారు ఇదిలా ఉండగా తాజాగా హెబ్బా పటేల్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు ఏంటి హెబ్బా పటేల్ పెళ్లి చేసుకున్నారా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆమె చేసిన పోస్ట్ ఏంటి అనే విషయానికి వస్తే..

ఆలస్యమైన పెళ్లిచూపులు..

Advertisement

హెబ్బా పటేల్ తన లేటెస్ట్ క్యూట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. కళ్లకు కాటుక పెట్టుకుని చాలా ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసిన ఈమె ఈ ఫోటోలకు “ఆలస్యమైన పెళ్లి చూపులు” అనే క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ ఫోటోలు కాస్త నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా ఏంటి హెబ్బా పటేల్ ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారా? అందుకే ఇలాంటి పోస్ట్ చేశారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

మరి హెబ్బా పటేల్ నిజంగానే పెళ్లి చేసుకున్నారా? మరి ఈమె చేసిన ఈ పోస్ట్ కు అర్థం ఏంటి? అనేది తెలియాలి అంటే స్వయంగా ఈ పోస్ట్ పట్ల హెబ్బా పటేల్ స్పందించాల్సిన అవసరం ఉంది. ఇక ఇటీవల కాలంలో ఎంతోమంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హెబ్బా పటేల్ కూడా ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారా అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఇక ఈషా సినిమా విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత హెబ్బా పటేల్ ఇలాంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో త్రిగుణ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ ట్రైలర్ మంచి అంచనాలను పెంచేశాయి.

Also Read: Actor Shivaji: టికెట్ల రేట్ల నియంత్రణ బాధ్యత ప్రభుత్వానిదే.. మరీ అంత ధరలు ఏంటండీ?

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×