E-Paper
Advertisement

Sankranti Special Trains: సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. రేపటి నుంచి బుకింగ్ ఓపెన్

Sankranti Special Trains: సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. రేపటి నుంచి బుకింగ్ ఓపెన్
Advertisement

Sankranti Special Trains: సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ. ఉపాధి, ఉద్యోగ కారణాలతో సొంత ఊర్లను విడిచి పట్టణాలకు వలస వెళ్లిన వారంతా సంక్రాంతి మూడు రోజులు తమ స్వగ్రామంలో గడపాలని కోరుతుంటారు. అందుకే దేశంలో ఎక్కడున్నా.. సంక్రాంతి సొంత ఊరుకు వస్తుంటారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. సంక్రాంతి ప్రత్యేక రైళ్లకు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయనుంది. ప్రయాణికులు ముందస్తు బుకింగ్ లు చేసుకోవాలని సూచించింది దక్షిణ మధ్య రైల్వే.

సంక్రాంతి ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో పలు ప్రత్యేక రైళ్లను నడపడానికి దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 4, 11, 18 తేదీల్లో సికింద్రాబాద్‌-అనకాపల్లె(రైలు నెంబర్ 07041), జనవరి 5, 12, 19 తేదీల్లో అనకాపల్లె- సికింద్రాబాద్‌ (రైలు నెం.07042) ప్రత్యేక రైలును నడుపనున్నట్లు ప్రకటించింది. జనవరి 9, 16, 23 తేదీల్లో హైదరాబాద్‌-గోరక్‌పూర్‌(రైలు నెం.07075), జనవరి 11, 18, 25 తేదీల్లో గోరక్‌పూర్‌-హైదరాబాద్‌ (రైలు నెం.07076) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. డిసెంబర్ 21న మచిలీపట్నం- అజ్మీర్‌ (రైలు నెం.07274), 28న అజ్మీర్‌-మచిలీపట్నం(రైలు నెం.07275) ప్రత్యేక రైలును నడపనున్నారు.

జన్మభూమి సమయాల్లో మార్పులు

Advertisement

విశాఖ-లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలు సమయాల్లో మార్పులు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఫిబ్రవరి 15 నుంచి ఇరువైపులా ఈ రైలు సమయాల్లో మార్పులు అమల్లోకి వస్తాయని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ వెల్లడించారు.

Also Read: Special Trains: తిరుమల వెళ్లే వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు.. ఈ రూట్లలో పొడిగింపు

శబరిమలకు ప్రత్యేక రైళ్లు

Advertisement

శబరిమలకు వెళ్లే భక్తుల కోసం జనవరిలో నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. చర్లపల్లి-కొల్లాం మధ్య ప్రత్యేక రైళ్లకు నడుపుతున్నారు. ఈ రైళ్లు కాచిగూడ, కర్నూలు, డోన్‌, గుత్తి, కడప, తిరుపతి, కాట్పాడి, ఈరోడ్‌, త్రిచూర్‌, ఎర్నాకుళం స్టేషన్లలో ఆగనున్నాయి. జనవరి 14, 21 తేదీల్లో ప్రత్యేక రైలు చర్లపల్లి నుంచి కొల్లాంకు బయల్దేరనుంది.

 

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×