E-Paper
Advertisement

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న త్రిష? హీరో సంచలన వ్యాఖ్యలు!

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న త్రిష? హీరో సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Actress Trisha: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటి త్రిష పేరు ప్రస్తుతం మారుమోగుతోంది. త్రిష గత రెండు దశాబ్దాల క్రితం హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికి వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. త్రిష తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈమె తన వ్యక్తిగతం విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా నటుడు విజయ్ తో త్రిష రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలకు అనుగుణంగానే విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు.

హీరో విజయ్ తో త్రిష రిలేషన్..

ఇక ఈమె కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో భాగంగా తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని ప్రస్తావించారు. దీంతో విజయ్ త్రిష గురించి వస్తున్న రూమర్లు మరింత బలపడ్డాయి. ఇలా వీరిద్దరి రిలేషన్ గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పటికీ విజయ్ కానీ త్రిష కానీ ఈ వార్తలపై ఎక్కడ స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే త్రిష, విజయ్ ప్రేమ గురించి ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి ఎలక్షన్లు పూర్తి అయిన తర్వాత వీరిద్దరూ తమ రిలేషన్ ను అధికారకంగా ప్రకటించబోతున్నారని అనంతరం పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలుస్తుంది.

త్రిష సినిమాలకు దూరమవుతున్నారు..

Advertisement

ఇలా విజయ్ తో పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో త్రిష కూడా సినిమాలకు దూరం అవుతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు బయటకు వచ్చాయి.  త్రిష ప్రస్తుతం విజయ్ రాజకీయ కార్యకలాపాలలో బిజీ కాబోతున్నారనీ , అందుకే సినిమాలకు దూరమవుతున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సీనియర్ నటుడు లక్ష్మణన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. త్రిష త్వరలోనే సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పబోతున్నారని తెలిపారు. యూట్యూబ్ ఛానల్ వేదికగా ఒక నెటిజన్ అడిగిన ఈ సమాధానం చెప్పడంతో ఇది కాస్త చర్చలకు కారణమైంది.

వెండితెరపై త్రిషను హీరోయిన్ గా చూడలేమా?

Advertisement

ఈ విషయం తెలిసిన త్రిష అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇక వెండితెరపై త్రిషను హీరోయిన్ గా చూడలేమా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. విజయ్ కూడా రాజకీయాలలో కొనసాగడం కోసం సినిమాలకు స్వస్తి పలకబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే త్రిష కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఇక త్రిష ప్రస్తుతం ఎలాంటి కొత్త సినిమాలకు కమిట్ అవ్వలేదు కానీ ఈమె నటించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. హీరో సూర్యతో కలిసి కరుప్పు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు .ఈ సినిమా తెలుగులో వీరభద్రుడు అనే పేరుతో మే 14వ తేదీ విడుదల కాబోతోంది. ఈ సినిమాతో పాటు చిరంజీవి హీరోగా నటించిన విశ్వంభర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Also Read: వెండితెరపై మాత్రమే కాదు.. రెస్టారెంట్ బిజినెస్ లోనూ దూసుకుపోతున్న టాలీవుడ్ స్టార్స్!

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×