E-Paper
Advertisement

వెండితెరపై మాత్రమే కాదు.. రెస్టారెంట్ బిజినెస్ లోనూ దూసుకుపోతున్న టాలీవుడ్ స్టార్స్!

వెండితెరపై మాత్రమే కాదు.. రెస్టారెంట్ బిజినెస్ లోనూ దూసుకుపోతున్న టాలీవుడ్ స్టార్స్!
Advertisement

Tollywood Stars : సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీలు కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ఇతర వ్యాపారాలను కూడా ప్రారంభిస్తూ అందులో కూడా మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది హీరోలు ప్రొడక్షన్ వైపు అడుగులు వేయగా మరి కొంతమంది రెస్టారెంట్, రియల్ ఎస్టేట్ బిజినెస్ పై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. మరి కొంతమంది థియేటర్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీలు ఎక్కువగా రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్నారు. మరి హైదరాబాదులో టాలీవుడ్ స్టార్స్ ఏర్పాటు చేసిన రెస్టారెంట్ల విషయానికి వస్తే..

టాలీవుడ్ హీరోల రెస్టారెంట్స్…

మహేష్ బాబు:

Advertisement

మహేష్ బాబు హీరోగా మాత్రమే కాకుండా సినిమా థియేటర్ ఓనర్ గా కూడా కొనసాగుతున్నారు. అయితే ఈయన హైదరాబాద్ బంజారాహిల్స్ లో “ఏఎన్ రెస్టారెంట్” ప్రారంభించారు. ఏషియన్ వారితో భాగస్వామ్యం అయ్యి ఈ రెస్టారెంట్ నడుపుతున్నారు. ఇక ఈ రెస్టారెంట్ బాధ్యతలను నమ్రత చూసుకుంటున్నారు .

రకుల్ ప్రీతిసింగ్:
నటి రకుల్ ప్రీతిసింగ్ ఇప్పటికే జిమ్ సెంటర్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే .అయితే హైదరాబాద్లో “ఆరంభం” అనే పేరిట ఈమె రెస్టారెంట్ ప్రారంభించారు.

Advertisement

నాగచైతన్య:
నాగచైతన్య “షోయు” పేరుతో గత కొంతకాలంగా రెస్టారెంట్ బిజినెస్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మాదాపూర్ లో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ మంచి సక్సెస్ అందుకుంది.

అల్లు అర్జున్:
అల్లు అర్జున్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.ఈయన ఇప్పటికే స్టూడియోస్, అల్లు థియేటర్స్ ఏర్పాటు చేశారు .ఇక రెస్టారెంట్ బిజినెస్ లో కూడా సక్సెస్ అందుకున్నారు. “బఫెలో వైల్డ్ వింగ్స్” పేరిట జూబ్లీహిల్స్ లో రెస్టారెంట్ ప్రారంభించి మంచి సక్సెస్ అందుకున్నారు.

నాగార్జున:
నాగార్జున ఇప్పటికి ఎన్నో వ్యాపారాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈయన కూడా రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించారు. జూబ్లీహిల్స్ లో “ఎన్ గ్రిల్ అండ్ ఎన్ ఏషియన్” పేరిట రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు.

రానా దగ్గుబాటి:
రానా దగ్గుబాటి కుటుంబం కూడా గత కొంతకాలంగా రెస్టారెంట్ బిజినెస్ లు నిర్వహిస్తూ వచ్చారు. ఈయన “శాంకుర్చీ అండ్ బ్రాడ్ వే” రెస్టారెంట్ నిర్వహిస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు.

విజయ్ దేవరకొండ:
విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ తో కలిసి “గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్” పేరిట మణికొండలో ఒక కేఫ్ నిర్వహిస్తున్నారు.

నితిన్:
టాలీవుడ్ అండ్ హీరో నితిన్ సైతం రెస్టారెంట్ బిజినెస్ లోఅడుగు పెట్టారు. ఈయన “టీ గ్రిల్” పేరిట ఈ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గా పేరుగాంచిన కోకాపేటలో ఉండటం విశేషం.

సందీప్ కిషన్:
టాలీవుడ్ మరో యంగ్ హీరో సందీప్ కిషన్ సైతం రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు ఈయన “వివాహ భోజనం” పేరిట జూబ్లీహిల్స్ లో రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. ఈ హీరోలందరూ కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు బిజినెస్ రంగంలోకి కూడా అడుగు పెట్టారు.

Also Read: హీరోయిన్ కు లిప్ కిస్ పెట్టిన అభిమాని..ఇలా తయారయ్యారేంట్రా బాబు!

Related News

సాంప్రదాయబద్ధంగా సమంత  సీమంతపు వేడుక వైరల్ అవుతున్న ఫోటోలు!

నటుడిగా మెప్పించి ‘నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి’ పుస్తకంతో రచయితగా మారుతున్న హీరో సూర్య తేజ్

పావలా శ్యామల కుమార్తె విషయంలో ‘మా’ కీలక నిర్ణయం!

నా ముందే ఆటిట్యూడ్‌తో తిరుగుతున్నావ్.. శోభితపై చైతూ ఓపెన్ కామెంట్స్.. వీడియో చూశారా?

ఆకట్టుకుంటున్న రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’ ట్రైలర్!

హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!

తరుణ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ‘ENE రిపీట్’ కోసం భలే కాకా పడుతున్నావే!

డైరెక్టర్ ఇంట్లో వినాయక చవితి చేసుకున్న నటి.. ఆ రిలేషన్ ఎదో కన్ఫర్మ్ చేసేయండయ్యా?

Big Stories

Advertisement
×