BigTV English

Actress Tabu: షాకింగ్.. టబుకు 16 ఏళ్లు ఉన్నప్పుడు ఆ స్టార్ హీరో అలా చేయబోయాడా?

Actress Tabu: షాకింగ్.. టబుకు 16 ఏళ్లు ఉన్నప్పుడు ఆ స్టార్ హీరో అలా చేయబోయాడా?

Actress Tabu: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్రతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి టబు(Tabu) దక్షిణాది సినీ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు.. ఇలా అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటున్నారు. గత కొంతకాలంగా సౌత్ సినిమాలకు దూరంగా ఉన్న ఈమె ఇటీవల అలా వైకుంఠపురం సినిమా ద్వారా తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం తెలుగుతోపాటు బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లలో టబు నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా టబుకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.


ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించిన నటుడు…

టబు అక్క ఫరానాజ్‌ (Farah Naaz)కూడా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ సొంతం చేసుకున్నారు. జాకీ ష్రాఫ్(Jackie Shroff), ఫరానాజ్‌ జంటగా దిల్జాలా(Diljala) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అప్పట్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో నటుడు జాకీ ష్రాఫ్ చిత్త బృందానికి ఘనంగా పార్టీ ఇచ్చారని తెలుస్తోంది. 1987లో మారిషస్‌లో నిర్వహించిన ఈ పార్టీలో నటి టబు కూడా పాల్గొన్నారు. అయితే అప్పటికి ఆమెకు కేవలం 16 సంవత్సరాలు వయసు కావటం విశేషం. పలు నివేదికల ప్రకారం ఈ పార్టీలో నటుడు జాకీ ష్రాఫ్ బాగా మద్యం మత్తులో ఉండి, టబును ముద్దు పెట్టుకోవడానికి పదే పదే ప్రయత్నించాడని తెలుస్తోంది.


పదహారేళ్ళ వయసులో చేదు అనుభవం..

ఈ పార్టీలో ఫుల్లుగా మద్యం మత్తులో ఉన్న జాకీ ష్రాఫ్ ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయగా ఆ సమయంలో డానీ డెంజోంగ్పా జోక్యం చేసుకొని జాకీ ష్రాఫ్ చర్యలను ఖండించినట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయంలో నటి ఫరానాజ్ కూడా జాకీ ష్రాఫ్ చర్యలను తప్పుపట్టారనే తెలుస్తుంది. ఇక ఈ విషయం గురించి నటి టబు ఎక్కడా కూడా ప్రస్తావించలేదని చెప్పాలి. బహుశా ఆ సమయంలో ఆమె చాలా చిన్న వయసు కావడంతో ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడలేదని తెలుస్తోంది. ఇలా నటుడు జాకీ నుంచి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న టబు అతనితో కలిసి సినిమాలలో నటించకపోవడం గమనార్హం.

టాలీవుడ్ హీరోతో లవ్ రూమర్లు…

ఇలా కెరియర్ తొలినాళ్లలో పలు వివాదాలలో నిలిచిన ఈమె అనంతరం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక తెలుగులో కూడా అగ్ర హీరోలందరి సరసన నటించిన టబూ నాగార్జున (Nagarjuna)తో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో నాగార్జున, టబు ఇద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ కూడా వార్తలు హల్చల్ చేశాయి. ఇప్పటికీ కూడా వీరిద్దరి రిలేషన్ గురించి ఏదో ఒక వార్త వినపడుతూనే ఉంది. నిజానికి వీరిద్దరూ చాలా మంచి స్నేహితులని తాను ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన నాగార్జున ఇంటికి వెళ్తానని టబు పలు సందర్భాలలో తెలియచేశారు. ఇక ప్రస్తుతం ఈమె పలు సినిమాలలో వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ ,విజయ్ సేతుపతితో చేయబోతున్న సినిమాలో కూడా టబు కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: పెళ్లి కాలేదు కానీ.. 40 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న నటి!

Related News

Actress Hema: ఆ క్షణం ఎవరినైనా చంపేయాలనిపించేది..ఎమోషనల్ అయిన హేమ!

Bahubali The Epic: బాహుబలి ది ఎపిక్.. బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన జక్కన్న?

OG 2: పవన్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్.. ఓజి 2లో అకీరా .. థియేటర్లు తగలబడి పోవాల్సిందే!

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ ఇంట సంబరాలు.. మరోసారి తండ్రైన ఆర్భాజ్ ఖాన్‌!

Samantha: ఫైనల్లీ కొత్త ప్రాజెక్ట్ పై అప్డేట్ ఇచ్చిన సమంత.. త్వరలోనే షూటింగ్ అంటూ!

Vijay Devarakonda: నిశ్చితార్థం తరువాత ఫేవరెట్ ప్లేస్ కి విజయ్ దేవరకొండ.. ప్రత్యేకం ఏంటబ్బా!

Rukmini Vasanth: క్రష్ ట్యాగ్ పై రుక్మిణి షాకింగ్ రియాక్షన్.. తాత్కాలికం అంటూ!

Rishabh shetty: ఆ ఘర్షణ నుంచే కాంతార కథ పుట్టింది.. అసలు విషయం చెప్పిన రిషబ్!

Big Stories

×