Kannada Actress: ఇటీవల కాలంలో ఎంతోమంది హీరోయిన్లు పెళ్లి వయసు దాటిపోయిన ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకోకుండా ఒంటరిగానే జీవితాన్ని గడుపుతున్నారు. ఇలా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వారిలో కన్నడ నటి భావన రామన్న (Bhavana Ramanna)కూడా ఒకరు. సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలోనూ నటించే ప్రేక్షకులను మెప్పించిన ఈమె నటిగా మాత్రమే కాకుండా అద్భుతమైన డాన్సర్ గా ఎన్నో స్టేజీలపై తన నాట్యంతో అందరిని ఆకట్టుకున్నారు. ఇలా స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న భావన రామన్న తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న నటి..
తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా తన ప్రేగ్నెన్సీ(Pregnancy) ని ప్రకటిస్తూ బేబీ బంప్ (Baby Bump) ఫోటోలను షేర్ చేశారు. ఇలా బేబీ బంప్ తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. తన ప్రేగ్నెన్సీ గురించి ఈమె తెలియజేస్తూ… “నేను ఈ విషయాన్ని మీకు ఇలా చెబుతానని ఎప్పుడు అనుకోలేదు. ప్రస్తుతం తాను ఆరు నెలల గర్భవతి అని తెలిపారు. అలాగే కవల (Twins)పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లు కూడా వెల్లడించారు. తనకు 20 లేదా 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తల్లి కావాలనే కోరికలు కలగలేదు కానీ 40 సంవత్సరాల వయసులో తల్లి కావాలని కోరిక బలపడిందని భావన వెల్లడించారు.
ఐవిఎఫ్ పద్ధతిలో…
ఇలా 40 సంవత్సరాల వయసులో తల్లి కావాలనే కోరిక కలగడంతో ఆమె ఎన్నో ఐవీఎఫ్(IVF) కేంద్రాలను సందర్శించిన సింగిల్ ఉమెన్ గా 40 సంవత్సరాల వయసులో ఇలాంటి రిస్క్ చేయొద్దని సలహాలు ఇచ్చినట్టు తెలిపారు. ఈ విషయంలో నాకు నా తోబుట్టువులు, నా తండ్రి, నా స్నేహితుల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభించిందని, ఈ విషయంలో వారు నన్ను ఎప్పుడు ప్రశ్నించలేదని భావన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తల్లిని కావాలని నేను తీసుకున్న నిర్ణయం నా జీవితాన్ని మార్చేసిందని తెలిపారు. ఇక గర్భవతిగా ఉన్న సమయంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కూడా ఈ సందర్భంగా తెలిపారు.
గర్వంగా పెంచుతాం..
ఇక నా పిల్లలకి రాక కోసం నేను ఎంతో ఎదురుచూస్తున్నానని, నా పిల్లలకు తండ్రి లేకపోయినా వారిని నేను చాలా గర్వంగా పెంచుతాను అంటూ భావన తన ప్రెగ్నెన్సీ గురించి తెలియజేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. అయితే ఈమె పెళ్లి చేసుకోకుండా కేవలం ఐవిఎఫ్ పద్ధతి ద్వారా తల్లిగా మారబోతున్నారని తెలుస్తోంది. ఇలా నాలుగుపదుల వయసులో ఈమె తల్లి కాబోతుందనే విషయం తెలిసిన అభిమానులు ఓకింత ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా ఈమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం భావన బేబీ బంప్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 1996లో ‘మారిబెల్’ చిత్రంతో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన , భావన నీ ముదిత మల్లిగే, క్షమ, భాగీరథి, భగవాన్, శాంతి వంటి పలు సినిమాలలో నటిగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
Also Read: విడాకులపై ఓపెన్ అయిన అభిషేక్ బచ్చన్..ఆ అవసరం మాకు లేదంటూ!