E-Paper
Advertisement

Jagapathi Babu: ఫెయిల్యూర్ లేని మనిషి ప్రభాస్.. జగపతి బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Jagapathi Babu: ఫెయిల్యూర్ లేని మనిషి ప్రభాస్.. జగపతి బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Advertisement

Jagapathi Babu: జగపతిబాబు ఒకానొక సమయంలో హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఈయన తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా విలన్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. హీరోగా ఎన్నో ఫ్యామిలీ సినిమాలలో నటించి ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ని సొంతం చేసుకున్న జగపతిబాబు (Jagapathi Babu)ఊహించిన విధంగా తన సెకండ్ ఇన్నింగ్స్ విలన్ పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లెజెండ్ సినిమాలో విలన్ గా తన అద్భుతమైన నటనను కనబరిచిన జగపతిబాబు తదుపరి సినిమాలన్నీ కూడా విలన్ పాత్రలోనే నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఈయన వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే పెద్ది సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ప్రభాస్ పై జగపతిబాబు ప్రశంసలు..

ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు సినిమాల గురించి అలాగే ఆయన పని చేసిన హీరోల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ (Prabhas)గురించి జగపతిబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ప్రభాస్ మంచితనం గురించి ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఎన్నో విధాలుగా మాట్లాడుతూ ఆయన మంచితనాన్ని బయటపెట్టారు. ఇక జగపతిబాబు కూడా ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ సినిమాల పరంగా సక్సెస్ సాధించారా? లేదా అనేది పక్కన పెడితే ఒక మనిషిగా ఆయన ఎప్పుడూ సక్సెస్ అంటూ మాట్లాడారు. ప్రభాస్ మనిషిగా ఫెయిల్యూర్ అవ్వడని జగపతిబాబు తెలియజేశారు. ప్రభాస్ వ్యవహారి శైలి చాలా పెద్దమనిషి లాగా ఉంటుందని తెలిపారు.

మనిషిగా ఫెయిల్యూర్ అవ్వరు..

Advertisement

ఇలా మనుషులుగా సక్సెస్ అయిన వారు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వారిలో ప్రభాస్ ఒకరు అలాగే రామ్ గోపాల్ వర్మ కూడా ఈ కోవకే చెందిన వారిని తెలిపారు .వీరితోపాటు డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా మనిషిగా ఫెయిల్యూర్ అవ్వడని జగపతిబాబు ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు పెద్ద ఎత్తున పలు వివాదాలలో నిలుస్తుంటారు కానీ ప్రభాస్ మాత్రమే ఇప్పటివరకు ఎలాంటి వివాదాలలో నిలవలేదు ఆయన గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వచ్చిన కూడా పెద్దగా పట్టించుకోరు. సోషల్ మీడియాకి కూడా ప్రభాస్ ఎంతో దూరంగా ఉంటారు.

అప్పల సూరిగా జగపతిబాబు..

Advertisement

ఇలా వివాదాలకు దూరంగా తన సినిమా పనులను చేసుకుంటూ కెరియర్ పరంగా బిజీగా గడుపుతున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక ప్రభాస్ జగపతి బాబు కాంబినేషన్లో సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి భాగంలో వీరిద్దరి మధ్య పెద్దగా సన్నివేశాలు లేకపోయినా సీక్వెల్ సినిమాలో ప్రభాస్ జగపతిబాబు మధ్య భారీ స్థాయిలో సీన్లు ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఇక జగపతిబాబు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ద సినిమాల్లో కూడా అప్పలసూరి అనే పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Also Read: Nagavamsi: నేనేమైనా సాగర సంగమం తీసానా? ఫంకీ సినిమా పై నాగ వంశీ కామెంట్స్!

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×