E-Paper
Advertisement

Telangana Municipal Results: 64 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. పార్టీల వారీగా గెలిచిన స్థానాలివే!

Telangana Municipal Results: 64 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. పార్టీల వారీగా గెలిచిన స్థానాలివే!
Advertisement

Telangana Municipal Results: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన ప్రభంజనాన్ని కొనసాగించి, అత్యధిక మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీలకు జరిగిన ఈ ఎన్నికల్లో, 64 చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి మున్సిపల్ పీఠాలను దక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ 13 మున్సిపాలిటీలలో గెలుపొందగా, 38 మున్సిపాలిటీలలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. కాగా, మహబూబ్‌నగర్ జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ దక్కించుకోవడం విశేషం.

వార్డుల వారీగా వెలువడిన ఫలితాలను పరిశీలిస్తే, మొత్తం 2,582 వార్డుల్లో సగానికి పైగా స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకుంది. పార్టీల వారీగా.. 1,347 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 717 వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 261 వార్డుల్లో బీజేపీ గెలుపొందింది. 256 వార్డుల్లో ఇతరులు/స్వతంత్రులు విజయం సాధించారు. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలోని 6వ వార్డులో విషాదం చోటుచేసుకుంది. అక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి మరణించడంతో, ఆ వార్డులో ఎన్నిక నిర్వహించలేదు.

Advertisement

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో BJP సత్తా చాటింది. మొత్తం 66 డివిజన్లకు గాను బీజేపీ 30 స్థానాల్లో ఘనవిజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 9 డివిజన్లలో గెలుపొందగా, ఇతరులు 12 స్థానాలను కైవసం చేసుకున్నారు. బీజేపీ మేయర్ పీఠం దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది.

నిజామాబాద్ కార్పొరేషన్‌లో ఓట్ల లెక్కింపు ముగియగా, 28 స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడంతో హంగ్ ఏర్పడింది. కాంగ్రెస్ 18, ఎంఐఎం 13, బీఆర్ఎస్ ఒక స్థానంలో గెలిచాయి. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి శమంత రెడ్డి ఓటమి పాలవ్వడం గమనార్హం.

Advertisement

ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సొంత జిల్లా అయిన నల్గొండలోని చండూరు, చిట్యాల, దేవరకొండ, హాలియా, మిర్యాలగూడ, నందికొండ వంటి అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఖమ్మం జిల్లాలో ఏదులాపురం, వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లెందు మున్సిపాలిటీలు హస్తం పరమయ్యాయి. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మద్దతుదారులు స్వతంత్రులుగా పోటీ చేసి అత్యధిక స్థానాలను గెలుచుకోవడం గమనార్హం.

మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది. మంచిర్యాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయం సాధించగా, కొత్తగూడెం కార్పొరేషన్ ఫలితం ఉత్కంఠ రేపుతోంది. ఇక్కడ మొత్తం 60 డివిజన్లలో కాంగ్రెస్, సీపీఐ చెరో 22 స్థానాల్లో గెలుపొందాయి. బీఆర్ఎస్ 8, బీజేపీ 1, సీపీఎం 1, ఇతరులు 6 స్థానాల్లో గెలిచారు. ఇక్కడ సీపీఐకి మద్దతు ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమవడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. మహబూబ్ నగర్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకోవడం ఒక ప్రత్యేక పరిణామం.

మరోవైపు బీఆర్ఎస్ గడ్డపోతారం, ఇంద్రేశం, అయిజ, తొర్రూర్ వంటి మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 16 వార్డులకు గాను కాంగ్రెస్ 12, బీజేపీ 3 స్థానాల్లో గెలిచాయి. అయితే, దేవరకద్ర, అలంపూర్, కోహిర్, కేసముద్రం వంటి ప్రాంతాల్లో హంగ్ ఏర్పడటంతో అక్కడ స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు. బీజేపీ ఇప్పటివరకు ఒక్క మున్సిపాలిటీని కూడా సొంతం చేసుకోలేకపోయింది. ఫిబ్రవరి 16న కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనుండటంతో, హంగ్ వచ్చిన చోట సమీకరణాలు ఎలా మారతాయో వేచి చూడాలి.

Read Also: Harish Rao: పురపోరులో బీఆర్ఎస్ జోరు.. ప్రజావ్యతిరేకతకు నిదర్శనం.. హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×