Netflix : సాధారణంగా సినిమాలు థియేటర్లలో విడుదలైన కొన్ని రోజుల తరువాత ఓటీటీలలో అడుగు పెడతాయి. అయితే ఓటీటీలలో కూడా అన్నీ సినిమాలకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సినిమాలకు ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ ను బట్టి, ఇతర కారణాలను దృష్టిలో పెట్టుకుని డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలు ఆ డేట్ ను నిర్ణయిస్తాయి. అందులో భాగంగా కొన్ని సినిమాలు సైలెంట్ గా ఓటీటీల నుంచి డిలీట్ అవుతూ ఉంటాయి. తాజాగా రామ్ ఫ్లాప్ సినిమా వంతు వచ్చేసింది. మరి త్వరలో డిలీట్ కాబోతున్న ఆ సినిమా ఏంటి ? ఎప్పటి వరకు ఆ సినిమా అందుబాటులో ఉంటుంది ? అన్నది తెలుసుకుందాం పదండి.
2021లో విడుదలైన తెలుగు యాక్షన్ డ్రామా రెడ్ (Red). రామ్ పోతినేని డ్యూయల్ రోల్‌లో నటించారు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రం శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై స్రవంతి రవికిషోర్ నిర్మాణంలో తెరకెక్కింది. సినిమా థియేటర్లలో విడుదలై నెగెటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. కానీ లైసెన్స్ గడువు ముగిసినందున ఫిబ్రవరి 22న ఈ మూవీ ఓటీటీ నుంచి డిలీట్ కానుంది. 140 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 6.2 రేటింగ్ సంపాదించింది. కానీ థియేటర్లలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కాగా రామ్ పోతినేని చివరిసారిగా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రంలో కనిపించారు.
రామ్ పోతినేనితో పాటు ఇందులో హీరోయిన్ మాళవిక శర్మ, అమృత అయ్యర్, నివేదా పేతురాజ్, సంపత్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకుడు కిషోర్ తిరుమల సినిమాను యాక్షన్ డ్రామా జానర్ లో తీశాడు. సంగీతం మణిశర్మ అందించారు. ఓపెనింగ్ వీక్‌లో 10 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ మొత్తం 25-30 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. బడ్జెట్ 30 కోట్లు కావడంతో డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఈ సినిమా రామ్ పోతినేని ఫ్యాన్స్ కు నచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రామ్ డ్యూయల్ రోల్, యాక్షన్, ఎమోషన్, రివెంజ్ వంటి అంశాలు మిక్స్ చేసి సరదాగా సాగుతుంది. ఫిబ్రవరి 22 తర్వాత ఓటీటీ నుంచి డిలీట్ అవుతుంది కాబట్టి అంతలోగా ఒక లుక్కేయండి.
Read Also : తిట్లతో వచ్చే వింత లెటర్స్… కితకితలు పెట్టే కామెడీ థ్రిల్లర్… స్ట్రీమింగ్ తెలుగులోనే
సివిల్ ఇంజనీర్ గా పని చేస్తాడు సిద్దార్థ్ (రామ్). తన ఆఫీస్‌లోనే మహిమా (మాళవికా శర్మ) అనే అమ్మాయిని ఇష్టపడతాడు. ఆమెతో తన ప్రేమ విషయాన్ని చెప్పడానికి నానా ఇబ్బందులు పడుతాడు. చివరకు ఎలాగోలా ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. ఆమె కూడా సిద్దార్థ్ ను ప్రేమిస్తుంది. అంతా సెట్ అవ్వడంతో కొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతారు.
కట్ చేస్తే ఆదిత్య (రామ్) ఓ తెలివైన దొంగ. చిన్న చిన్న దొంగతనాలు చేసి, ఆ డబ్బుతో జల్సాలు చేసి తిరుగుతుంటాడు. పేకాటలో లక్షలు పెట్టి పొగొట్టుకుంటాడు. ఇలా ఒకసారి తన ఫ్రెండ్ వేమ (సత్య) దాచుకున్న డబ్బులు తీసుకొని వెళ్లి పేకాటలో తగలబెడతాడు. దాని వల్ల వేమ ప్రమాదం పడతాడు. స్నేహితుడిని కాపాడటం కోసం ఆదిత్య 9 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఓ రౌడీకి ఇస్తాడు. మరోవైపు ఆకాశ్ దారుణ హత్యకు గురవుతాడు. ఈ హత్య కేసులో సిద్దార్థ, ఆదిత్య ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ కేసు సీఐ నాగేంద్ర కుమార్(సంపత్ రాజ్), ఎస్సై యామిని(నివేదా పేతురాజ్) ప్రతిష్టాత్మకంగా తీసుకొని విచారణ చేపడతారు. ఇంతకీ సిద్దార్థ, ఆదిత్యకు ఈ కేసుతో సంబంధం ఏంటి? ఎందుకు వాళ్ళను ఇరికించాలి అనుకుంటారు? అన్నది కథ.