E-Paper
Advertisement

రాజమౌళి, ప్రభాస్ పై జగపతి బాబు కామెంట్స్.. పేరుకే స్టార్స్ కానీ?

రాజమౌళి, ప్రభాస్ పై జగపతి బాబు కామెంట్స్.. పేరుకే స్టార్స్ కానీ?
Advertisement

Jagapathi Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు జగపతిబాబు(Jagapathi Babu) ఒకరు. హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఈయన సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం విలన్ పాత్రలలో నటిస్తూ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. ఇక జగపతిబాబు ప్రస్తుతం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు హీరో ప్రభాస్ గురించి అదే విధంగా దర్శకుడు రాజమౌళి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆపదలో ఉన్నప్పుడు సాయం చేశాడు..

ప్రభాస్ గురించి జగపతిబాబు మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో తనకు ఎలాంటి సినిమా అవకాశాలు లేక సినిమాలలో సంపాదించింది మొత్తం పోగొట్టుకొని ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాను. అలాంటి సమయంలో నాకు గుర్తొచ్చిన నటుడు ప్రభాస్. ఆ సమయంలో ప్రభాస్ కి ఫోన్ చేయగా అతను విదేశాలలో ఉన్నాడు అయితే ఇండియా వచ్చిన తర్వాత తప్పకుండా కలుస్తానని నాకు మాట ఇచ్చాడు. ఫోన్ చేయడంతో అలా చెప్పాడు అనుకున్నాను కానీ చెప్పిన విధంగానే ఇండియా రాగానే మొదట తనని కలిసారని, నా సమస్య తెలుసుకొని నాకు సహాయం చేశారని జగపతిబాబు తెలిపారు. ప్రభాస్ అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ గుర్తు పెట్టుకుని నన్ను కలవడం చాలా గ్రేట్ అని తెలిపారు.

రాజమౌళి ఎక్కడికి వెళ్లినా సినిమా ఆలోచనలే..

Advertisement

ఇక రాజమౌళి గురించి జగపతిబాబు మాట్లాడుతూ.. రాజమౌళికి ఆయన కుటుంబమే తనకు పెద్ద బలం వారందరూ ఎక్కడికి వెళ్లినా సినిమా గురించి మాత్రమే మాట్లాడుతారు వారి ఆలోచనలో 20 శాతం మనం సినిమాల గురించి ఆలోచించినా ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చని జగపతిబాబు తెలిపారు. ఇక రాజమౌళి కుటుంబంలో అందరూ కూడా అద్భుతంగా నటిస్తారు కానీ ఆయన సినిమాలలో అవసరంలేని పాత్రలలో వారిని పెట్టుకోరని ఆ పాత్రకు ఎవరు సరిపోతే వారిని మాత్రమే ఎంపిక చేస్తారని, అందుకే రాజమౌళి సినిమాలు మంచి విజయాలను అందుకుంటాయని జగపతి బాబు తెలిపారు.

సాదా సీదా జీవితం గడుపుతారు…

Advertisement

ఇలా ప్రభాస్, రాజమౌళి ఇద్దరు కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. వీరిద్దరూ పెద్ద స్టార్స్ అయినప్పటికీ ఒక సాదా సీదా జీవితం గడుపుతారని అలా బ్రతకడం గ్రేట్ అంటూ జగపతిబాబు ఈ సందర్భంగా ప్రభాస్ రాజమౌళి గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . ఇక జగపతిబాబు ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఈయన అప్పలసూరి అనే విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఇక ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సలార్ 2 సినిమాలో కూడా జగపతిబాబు నటిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: ఓటీటీ విడుదలకు సిద్ధమైన శేష్ డెకాయిట్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×