E-Paper
Advertisement

ఓటీటీ విడుదలకు సిద్ధమైన శేష్ డెకాయిట్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఓటీటీ విడుదలకు సిద్ధమైన శేష్ డెకాయిట్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
Advertisement

Dacoit OTT : అడవి శేష్ మృణాళ్ ఠాకూర్ ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం డెకాయిట్. యాక్షన్ అండ్ రొమాంటిక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.షనీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 10 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇలా థియేటర్లలో రూ. 50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్(Amazon prime) సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించి అధికారక ప్రకటనను వెల్లడించారు.

హిందీ ప్రేక్షకులకు నిరాశేనా..

ఏప్రిల్ 10వ తేదీ విడుదలైన ఈ సినిమా 28 రోజుల వ్యవధిలోనే తిరిగి ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా మే 8వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి ఉండబోతుందని అమెజాన్ అధికారికంగా తెలియజేశారు. ఈ బ్లాక్ బస్టర్ సినిమాని థియేటర్లలో మిస్సయిన వారు మే 8వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే హిందీలో ఈ సినిమా చూడాలి అంటే థియేటర్లో విడుదలైన నాలుగు వారాలు పూర్తి అయిన తర్వాతనే ఓటీటీలోకి రావాలనే నిబంధన ఉన్న నేపథ్యంలో మరి కాస్త ఆలస్యంగా హిందీలో విడుదల కానుంది.

ఓటీటీలోకి డెకాయిట్..

Advertisement

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాలో బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా భాగమయ్యారు.బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నెగటివ్ రోల్‌లో మెరవగా.. ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కుల్కర్ణి, జైన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ల వంటి తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాకు బీమ్స్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా డిజిటల్ మీడియాలో ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందనేది తెలియాల్సి ఉంది.

గూడచారి సీజన్ 2..

Advertisement

హీరో అడివి శేష్ విభిన్నమైన కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈయన చేసింది చాలా తక్కువ సినిమాలు అయినప్పటికీ ప్రతి ఒక్క సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఈసారి యాక్షన్ రొమాంటిక్ సినిమాతో మరోసారి డెకాయిట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో శేష్ ప్రస్తుతం తన తదుపరి సినిమాలపై దృష్టి సాధించారు. ప్రస్తుతం ఈయన గూడచారి 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి కాగానే సాయి మార్తాండ్ దర్శకత్వంలో బిజీ కాబోతున్నారు.

Also Read: నిర్మల్ జిల్లా రైతులకు అండగా బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్..ఆర్థిక సాయం చేసిన రైతు బిడ్డ!

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×