E-Paper
Advertisement

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!
Advertisement

Jailer 2 Box Office Collection:సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు చెబితే చాలు.. థియేటర్లలో అభిమానుల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన స్టైల్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. ఇక అలాంటి రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ థియేటర్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే.

జైలర్ కి సీక్వెల్ గా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించడంతో ప్రేక్షకుల్లో మాంచి బజ్ క్రియేట్ అయింది. ఇక ఫస్ట్ పార్ట్ సూపర్ సక్సెస్ అవడంతో ఇప్పుడు సీక్వెల్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisement

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాను సుమారు రూ.350 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారని టాక్. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.320 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు వినిపిస్తుంది. ఇక సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు రూ.300 కోట్ల షేర్, రూ.600 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.

ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు ఎస్.జే. సూర్య, విద్యా బాలన్, మిథున్ చక్రవర్తి, శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ,హృతిక్ వంటి భారీ స్టార్ క్యాస్ట్ ఉన్న సంగతి తెల్సిందే.ఇక మొదటి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. తమిళనాడులో రూ.25 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.15 కోట్లు, కర్ణాటకలో రూ.15 కోట్లు, కేరళలో రూ.11 కోట్లు, నార్త్ ఇండియాలో రూ.6 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు వినిపిస్తుంది.

Advertisement

మొత్తంగా దేశవ్యాప్తంగా సుమారు రూ.75 కోట్ల గ్రాస్, రూ.65 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఇక ఓవర్సీస్ మార్కెట్ నుంచి మరో రూ.55 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సమాచారం.దీంతో మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.125 కోట్లకి పైగానే గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు లేక్కలేయడంతో మురిసిపోతున్నారు తలైవా ఫ్యాన్స్.

ఇక రెండో రోజు కూడా సినిమా కలెక్షన్లపై భారీ అంచనాలే ఉన్నాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా తమిళనాడులో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సినిమా మొత్తంగా ఈజీగానే రెండు వందల కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని అంచనాలు వేస్తున్నారు ఫిల్మీ ఫ్యాన్స్.

గతంలో రజనీకాంత్ నటించిన ‘2.0’, ‘పేట’, ‘దర్బార్’, ‘కబాలి’ వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ‘జైలర్’సినిమాతో ఒక్కసారిగా సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు తలైవా. మొత్తంగా సినిమా ఊహించని కలెక్షన్స్ రాబ్డుతుండటం తో వెయ్యి కోట్లు కొడుతుందా అంటూ ఆశగా లెక్కలు వేస్తున్నారు తమిళ తంబీలు .చూడాలి మరి కోలీవుడ్ కోరికని తలైవా నెరవేరుస్తాడో లేదో !

ALSO READ :గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

Tags

Related News

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ షాక్.. భారత్ వదిలి వెళ్లాల్సిందేనా?

Big Stories

Advertisement
×