CNAP System: ప్రతిరోజూ మనకు వచ్చే స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌తో చాలామంది విసిగిపోతున్నారు. అయితే ఇక నుంచి ఇలాంటి టెన్షన్లకి ఎండ్ కార్డ్ పడబోతోంది. టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఒక ఇంపార్టెంట్ రూల్‌ని అమల్లోకి తెస్తోంది. కేంద్రం తీసుకొస్తున్న ఈ కొత్త సీఎన్ఎపి అంటే Calling Name Presentation సిస్టమ్‌తో… నంబర్ సేవ్ లేకపోయినా కాలర్ పేరు నేరుగా మీ మొబైల్ స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతుంది.
ఈ ఫీచర్ పనిచేసే విధానం చాలా సింపుల్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మనం సిమ్ కార్డ్ తీసుకునేటప్పుడు ఇచ్చే అఫీషియల్ KYC అంటే ఆధార్ లేదా పాన్ కార్డ్‌లలో ఉన్న అసలైన పేరునే టెలికాం నెట్వర్క్ డైరెక్ట్‌గా స్క్రీన్ మీద చూపిస్తుంది. దీనివల్ల ఫేక్ పేర్లతో, రాంగ్ ఐడెంటిటీతో కాల్స్ చేసే వాళ్లను ఈజీగా కనిపెట్టవచ్చు. నవంబర్ 1 నుంచి జియో, ఎయిర్టెల్, విఐ, బిఎస్ఎన్ఎల్ లాంటి నెట్వర్క్స్ అన్నింట్లోనూ ఇది కంప్లీట్‌గా రోల్ అవుట్ కాబోతోంది.
దీనివల్ల గూగుల్ డేటాబేస్‌లో రిజిస్టర్ అయిన బిజినెస్ కంపెనీలు, వెరిఫైడ్ నంబర్ల ఐడెంటిటీ వెంటనే తెలిసిపోతుంది. మొత్తానికి కేంద్రం తెస్తున్న ఈ సీఎన్ఎపి సిస్టమ్ అమల్లోకి వస్తే స్పామర్లు, ఫ్రాడ్‌స్టర్ల ఆటలకు కంప్లీట్‌గా చెక్ పడినట్లే..
Also read: స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..