Jailer 2:రజిని కాంత్ చివరిగా సాలిడ్ హిట్ ఇచ్చిన సినిమా గుర్తుందా ? శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో. 2010లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా మూడొందలు కొల్లగొట్టి రజినీ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది.కానీ ఆ తర్వాత వచ్చిన ఏ సినిమాలు ఆ స్థాయి సక్సెస్ ని డెలివర్ చేయలేకపోయాయ్.అలా ఒకటి రెండు కాదు..కొచ్చాడియాన్,లింగా, కబాలి, కాలా ఇలా వచ్చిన సినిమా వచ్చినట్టే పోయాయి.ఇక ఇలా కాదంటూ చివరికి అచ్చొచ్చిన కాంబోలో రోబో 2.0 అని తీసినా ఫలితం మాత్రం అంతంతమాత్రమే.ఇక మేమూ దాని వెంటే అంటూ వెనకాలే వచ్చిన పేట, దర్భార్, అన్నాత్తే ..ఇలా వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేసినవే.
13ఏళ్ల ఎదురుచూపులకి ఎండ్ కార్డ్ వేసిన జైలర్
అయితే సరిగ్గా 13ఏళ్ల ఎదురుచూపులకి ఎండ్ కార్డ్ వేస్తూ 2023లో ఆడియన్స్ ని పలకరించిన సినిమా జైలర్.నెల్సన్.కొలమావు కోకిల, డాక్టర్ ,బీస్ట్ అంటూ సక్సెస్ ఫుల్ సినిమాలు తీసిన నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రజిని పునర్వైభావాన్ని ఘనంగా చాటింది.అది కూడా అలా ఇలా కాదు బాక్సాఫీస్ వద్ద ఏకంగా ఆరొందల కోట్ల సాలిడ్ వసూల్లతో.ఇక ఈ సినిమానే తెలుగులో ఏకంగా 70 కోట్లు వసూలు చేసింది కూడా.ఇంకేం రజినీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు అనుకొనే లోపే లాల్ సలాం, వేట్టయాన్,కూలీ అంటూ మరో సినిమాలు ముచ్చటగా ప్లాప్ టాక్ ని మూటగట్టుకున్నాయి.దీంతో మళ్ళీ తిరిగి కలిసొచ్చిన జైలర్ కి సీక్వెల్ ని పట్టాలెక్కించాడు.అంతవరకు బాగానే ఉంది కాని ఈ సినిమాకి తెలుగు డబ్బింగ్ రైట్స్ కోసం చెబుతున్నరేటే బయ్యర్స్ కి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.
ఒక్క హిట్ పడితేనే ఈ రేంజ్ లో డిమాండ్ చేయడం ఏంటో
అవును గత సినిమాల ట్రాక రికార్డ్ ని గుర్తుపెట్టుకోకుండా జైలర్ కున్న క్రేజ్ తో ఏకంగా అక్షరాలా యాభై ఐదు కోట్లకి తగ్గం అంటున్నారట మేకర్స్.దీంతో ఫస్ట్ పార్ట్ ఆడింది కదా అని ఇలా మమ్మల్ని ఆడించడం ఏం బాగాలేదు అని కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు లోపల లోపల తెగ ఫీలైపోతున్నారట.ఒక్క హిట్ పడితేనే ఈ రేంజ్ లో డిమాండ్ చేయడం ఏంటో అని సెటైర్స్ వేస్తున్నారట.నిజానికి ఇలాగే విపరీతమైన అంచనాలతో వచ్చిన కూలీ సినిమాని మాట కాదనకుండా GST కలిపి 60 కోట్లు సమర్పించుకున్న డిస్ట్రిబ్యూటర్ల కి లోకి ఎలాంటి సినిమా చూపించాడో చెప్పక్కర్లేదు. అలాంటిది మళ్ళీ ఆకాశంలో మబ్బులని చూసి కుండ నీళ్ళు పారేసుకోవడం ఎందుకా అని మదన పడిపోతున్నారట డిస్ట్రిబ్యూటర్లు.
సమర్పించుకుంటారా లేక వెయిట్ చేస్తారా !
నిజానికి రజినీకి ఇక్కడ ఫ్యాన్స్ బేస్, ఫాలోయింగ్ , ఓపెనింగ్ తెచ్చే సత్తా ..అన్నీ ఉన్నాయి.కానీ అది సినిమాలోని కంటెంట్ మాట్లాడేంత వరకే.కాదు మా సినిమా ఇంతే అంటూ తలా తోకా లేక వదిలితే రజినీ కూడా ఏం చేయలేడన్నది గతః సినిమాల కలెక్షన్సే చెబుతున్నాయి.చూడాలి మరి రిస్క్ చేసిన అడిగినంత సమర్పించుకుంటారా లేక మా వల్ల కాదు బాబోయ్ అని తగ్గేదాకా వెయిట్ చేస్తారా !