E-Paper
Advertisement

James Cameron: హాలీవుడ్‌కు జేమ్స్ కామెరాన్ హెచ్చరిక.. ఇక మిగిలేది ఏమీ లేదంటూ..!

James Cameron: హాలీవుడ్‌కు జేమ్స్ కామెరాన్ హెచ్చరిక.. ఇక మిగిలేది ఏమీ లేదంటూ..!
Advertisement

James Cameron: హాలీవుడ్ సినిమా పరిశ్రమలో .. ప్రస్తుతం స్టార్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ స్పందించిన ఒక విషయం అందరిని..తెగ ఆశ్చర్యపరుస్తుంది. నెట్‌ఫ్లిక్స్.. వార్నర్ బ్రదర్స్ మధ్య జరుగుతున్న ఒప్పందం సినిమా రంగానికి ప్రమాదకరమని ఆయన స్పష్టంగా హెచ్చరించారు.

జేమ్స్ కామెరాన్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు అన్న విషయం తెలిసిందే. టైటానిక్, అవతార్ వంటి భారీ సినిమాలతో ఆయన సినిమా చరిత్రలో.. తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అలాంటి దర్శకుడు తాజాగా అమెరికా సెనేటర్ మైక్ లీ కు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో..నెట్‌ఫ్లిక్స్ సంస్థ వార్నర్ బ్రదర్స్ ను కొనుగోలు చేయడం వల్ల థియేటర్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని పేర్కొన్నారు.

Advertisement

ఈ ఒప్పందం అమలులోకి వస్తే అనేక సినిమా థియేటర్లు మూతపడే పరిస్థితి వస్తుందని జేమ్స్ కామెరాన్ అన్నారు. థియేటర్లు తగ్గిపోతే, సినిమాల నిర్మాణం కూడా చాలా పరిమితమవుతుందని ఆయన అభిప్రాయం. ముఖ్యంగా..సినిమా పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మందికి ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

నెట్‌ఫ్లిక్స్ వ్యాపార విధానం పూర్తిగా డిజిటల్ మాధ్యమాలపై ఆధారపడి ఉందని, అది థియేటర్ ఆధారిత సినిమా పరిశ్రమకు పూర్తిగా విరుద్ధమని కామెరాన్ తెలిపారు. తన సినిమాలు కూడా ఓటీటీ వేదికల్లో విడుదల అవుతున్నాయన్న విషయాన్ని అంగీకరించినప్పటికీ..తన మొదటి ప్రేమ మాత్రం సినిమా హాళ్లేనని చెప్పారు. పెద్ద తెరపై సినిమాలు చూసే అనుభూతిని ఏ డిజిటల్ వేదిక కూడా భర్తీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

వార్నర్ బ్రదర్స్ లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా తన దారి మార్చుకుంటే, నాణ్యమైన సినిమాల కాలం ముగిసినట్టే అవుతుందని కామెరాన్ హెచ్చరించారు. అలా జరిగితే, సినిమాల రంగంలో అమెరికా తన నాయకత్వాన్ని కోల్పోయే అవకాశం ఉందని కూడా చెప్పారు.

ఈ అంశంపై మైక్ లీ స్పందిస్తూ.. ఇప్పటికే పలువురు నటులు, దర్శకులు ఈ ఒప్పందంపై తమ ఆందోళనలను వ్యక్తం చేశారని తెలిపారు. దీనిపై మరోసారి ప్రత్యేక విచారణ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. జేమ్స్ కామెరాన్ లాంటి గొప్ప దర్శకుడు ఈ విధంగా బహిరంగంగా మాట్లాడటం సినిమా పరిశ్రమ భవిష్యత్తుపై ఎంతటి ప్రభావం చూపుతుందో అర్థమవుతోంది. ఈ ఒప్పందంపై చర్చలు ఇంకా కొనసాగే అవకాశముంది.

ALSO READ: Toxic Ticket: రాయా తర్వాత టికెట్… యష్ డ్యూయల్ రోల్ సస్పెన్స్

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×