E-Paper
Advertisement

Jana Nayagan: జన నాయగన్ సెన్సార్ కోతల పై విచారణ..సర్టిఫికెట్ లేకుండా విడుదల తేదీ ప్రకటించడం ఏంటీ?

Jana Nayagan: జన నాయగన్ సెన్సార్ కోతల పై విచారణ..సర్టిఫికెట్ లేకుండా విడుదల తేదీ ప్రకటించడం ఏంటీ?
Advertisement

Jana Nayagan: తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు విజయ్ (Vijay)ఒకరు. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే విజయ్ ఆఖరి సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జన నాయగన్(Jana Nayagan) సినిమా విషయంలో మాత్రం ప్రేక్షకులు తీవ్రని రాష్ట్ర వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9వ తేదీ విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వని నేపథ్యంలో వాయిదా పడింది. ఇక ఈ సినిమా సెన్సార్ విషయంలో అధికారులు ఎన్నో అభ్యంతరాలను వ్యక్తం చేయటంతో ఈ సినిమా విడుదల కాస్త ఆగిపోయింది. ఇక ఇదే విషయంపై నేడు మద్రాస్ హైకోర్టులో విచారణ జరగగా అక్కడ కూడా నిరాశ ఎదురయింది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్..

ఈ సినిమా సెన్సార్ కు సంబంధించి నిర్మాతలు కేవీఎన్ ప్రొడక్షన్ వారు దాఖలు చేసిన పిటిషన్‌ను ఈరోజు, మంగళవారం, జనవరి 20న మద్రాస్ హైకోర్టులో విచారించినట్లు తెలుస్తోంది. ఈ విచారణలో భాగంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నిర్మాతలకు సూచించిన మార్పులు మద్యంతర మార్పులు మాత్రమేనని, అది ఫైనల్ కాదని తెలిపారు. ఈ విచారణలో భాగంగా సెంట్రల్ బోర్డ్ న్యాయవాది వాదిస్తూ..జన నాయగన్‌ను రివైజింగ్ కమిటీకి పంపినట్లు జనవరి 6న నిర్మాతలకు సమాచారం అందినప్పటికీ జనవరి 7న హైకోర్టులో జరిగిన విచారణలో సింగిల్ జడ్జి ముందు ఈ విషయం పట్ల కౌంటర్ దాఖలు చేయడానికి సమయం లేదని సెంట్రల్ బోర్డ్ న్యాయవాది తెలియజేశారు.

రూ.500 కోట్ల బడ్జెట్..

Advertisement

ఇక ఈ సినిమా కోసం సుమారు 500 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించినట్లు నిర్మాతలు తమ వాదనను తెలియజేశారు అయితే ఈ వాదనపై సెంట్రల్ బోర్డ్ తరపు లాయర్ మాట్లాడుతూ సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ రాకుండా సినిమా విడుదల తేదీని ఎలా ప్రకటిస్తారు అంటూ ప్రశ్నించారు. అయితే ఈ సినిమా విడుదలకు గతంలో మద్రాస్ హైకోర్టు నుంచి విడుదలకు అనుమతి తెలపాలనే అంశంపై సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించినా ఆ తర్వాత, నిర్మాతలు ఆ స్టేకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని భావించినప్పటికీ సుప్రీంకోర్టు తిరస్కరించింది.

విజయ్ ఆఖరి సినిమా..

Advertisement

ఇలా కోర్టులో ఈ సినిమాకు తరచూ వ్యతిరేకంగా తీర్పులు వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల విషయంపై ఇప్పటివరకు సరైన స్పష్టత రాని నేపథ్యంలో అభిమానులు కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా నటుడు విజయ్ కు ఆఖరి సినిమా కావటం విశేషం ఈయన రాజకీయాలలో కొనసాగుతున్న నేపథ్యంలో ఇకపై రాజకీయాలకే పరిమితం కావాలన్నా ఉద్దేశంతో జననాయగన్ సినిమాని తన ఆఖరి సినిమాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆఖరి సినిమాకు ఆటంకాలు ఏర్పడుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Maruthi: రాజా సాబ్ డిజాస్టర్… మెగా హీరోని లైన్ లో పెట్టిన మారుతి.. అసలు నిజం ఇదే ?

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×