E-Paper
Advertisement

Prabhas Mistakes: బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన పెద్ద తప్పులు ఇవేనా?

Prabhas Mistakes: బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన పెద్ద తప్పులు ఇవేనా?
Advertisement

Prabhas Mistakes: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కెరీర్‌లో బాహుబలి తర్వాత వచ్చిన సినిమాలపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. ఇందులో కొన్ని సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ గా నిలవగా.. మరికొన్ని మాత్రం డిజాస్టర్ చవిచూశాయి. ఇందులో ముఖ్యంగా ఫ్లాప్ అయిన సినిమాలపై ఎన్నో కథనాలు వినిపిస్తూ వచ్చాయి. తాజాగా విడుదలైన ది రాజా సాబ్ ఆ చర్చను మరింత పెంచింది. సంక్రాంతి పండుగ సీజన్ కారణంగా మొదటి కొన్ని రోజులు కొంత వసూళ్లు వచ్చినా..రెండో సోమవారానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పూర్తిగా కుప్పకూలింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. ఇకపై ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ కూడా చేరడం కష్టమే.

ముఖ్య కారణం అదే..!

సోషల్ మీడియాలో ప్రభాస్‌పై వస్తున్న ట్రోలింగ్ సాధారణంగా లేదు. ఒకప్పుడు దేశవ్యాప్తంగా భారీ మార్కెట్ ఉన్న హీరో ఇలా మీమ్ కంటెంట్‌గా మారడం వెనుక పెద్ద కారణాలే ఉన్నాయి. సమస్య కేవలం బలహీనమైన కథలే కాదు. ప్రభాస్ స్థాయికి తగ్గ దర్శకులు లేకపోవడమే అసలు సమస్యగా మారింది.

ఇది మొదటిసారి ఏమీ కాదు..!

Advertisement

ఇది ఇదే మొదటిసారి కాదు. బాహుబలి తర్వాత వచ్చిన చాలా సినిమాల్లో ఇదే తప్పు కనిపించింది. ఉదాహరణకు సాహో..దర్శకుడు సుజీత్కు ఇది పెద్ద అవకాశం అయినా..ప్రభాస్ లాంటి స్టార్‌ను హ్యాండిల్ చేసే అనుభవం అతనికి సరిపోలేదు. భారీ బడ్జెట్, ఎన్నో రోజుల షూటింగ్ ఉన్నా, కథనం పూర్తిగా గందరగోళంగా మారింది. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా సరిగా వాడుకోలేకపోయారు.

తర్వాత వచ్చిన రాధే శ్యామ్ కూడా ఆశించిన స్థాయిలో నిలబడలేదు. దర్శకుడు రాధా కృష్ణ గొప్ప ప్రేమకథను తీసుకున్నా, ప్రేక్షకులను ఆకట్టుకునేలా చెప్పలేకపోయాడు. ఇక ఆదిపురుష్ అయితే ప్రభాస్ కెరీర్‌లోనే పెద్ద దెబ్బగా మారింది. దర్శకుడు ఓం రౌత్ గతంలో హిట్ ఇచ్చినా, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌కు సరైన విజన్ చూపించలేకపోయాడు. ఈ సినిమా దేశవ్యాప్తంగా విమర్శలకు గురైంది.

Advertisement

ఇప్పుడు ది రాజా సాబ్ విషయంలోనూ అదే పరిస్థితి. దర్శకుడు మారుతి ఇటీవల కాలంలో సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. అలాంటి దర్శకుడిపై ప్రభాస్ నమ్మకం పెట్టడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఫలితంగా వచ్చిన సినిమా ప్రభాస్‌ను ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా ఎక్స్‌పోజ్ చేసింది. ఇది మారుతి కెరీర్‌లోనే కాదు, ప్రభాస్ కెరీర్‌లో కూడా ఒక చెడు ఉదాహరణగా మిగులుతుంది అని చెప్పడంలో సందేహం లేదు.

ఈ క్రమంలో..ఇప్పుడు అందరి ఆశలు స్పిరిట్ మీదే ఉన్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌ను బలమైన పాత్రలో చూపించగలడనే నమ్మకం అభిమానుల్లో ఉంది. కానీ ఒక్క సినిమా ఈ నష్టాన్ని పూడ్చగలదా అనే ప్రశ్న కూడా ఉంది. ఒక విషయం మాత్రం స్పష్టం. ఇకపై ప్రభాస్ తన స్థాయికి తగ్గ విజన్, అనుభవం ఉన్న దర్శకులతోనే సినిమాలు చేయాల్సిన అవసరం చాలా ఎక్కువగా కనిపిస్తోంది.

ప్రభాస్ కానీ ఇలాంటి తప్పులు చేయకుండా మంచి సినిమాలు ఎంపిక చేసుకుని ఉంటే.. బాహుబలి తరువాత మరిన్ని బ్లాక్ బస్టర్లు అందుకో ఉంటే.. ప్రస్తుతం ప్రభాస్ స్థాయి ఎక్కడ ఉండేదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ALSO READ: Maruthi: రాజా సాబ్ డిజాస్టర్… మెగా హీరోని లైన్ లో పెట్టిన మారుతి.. అసలు నిజం ఇదే ?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×